"మడిపల్లి భద్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎మూలాలు: +{{Authority control}})
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
 
'''మడిపల్లి భద్రయ్య''' తెలంగాణా ప్రాంతానికి చెందిన రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు మరియు, ఆధ్యాత్మికవేత్త.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1945]], [[జనవరి 17]]వ తేదీన [[నిర్మల్]] పట్టణంలో మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1968లో బి.ఎ.ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని తండ్రి వీరయ్య కూడా విద్వత్కవి. ఆయన వేములవాడ రాజరాజేశ్వరుని మీద సీసపద్యాలలో ఒక శతకాన్ని వ్రాశాడు. తండ్రి నుండి ఇతడు పద్యాలను ఎలా ఆలాపించాలో నేర్చుకున్నాడు. ఇతడు ఐదవ తరగతి చదువుతున్నప్పుడు కోరుట్ల ఆంధ్ర బాలానందసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు<ref name=పట్వర్ధన్>{{cite journal|last1=ఎం.వి.పట్వర్ధన్|title=మానవీయ విలువలున్న మడిపల్లి భద్రయ్య|journal=పాలపిట్ట|date=1 October 2017|volume=8|issue=9|pages=62-66|accessdate=24 November 2017}}</ref>. 1963లో [[లక్సెట్టిపేట]] పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, [[భైంసా]], [[దిలావర్‌పూర్]], [[ఇచ్చోడ]], [[ఉట్నూరు]], [[ఆసిఫాబాద్]] మొదలైన చోట్ల పనిచేసి 2001లో [[కుంటాల]] ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు. ఇతడు జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూరులో ఆంధ్ర పద్యకవితా సదస్సు, నర్సాపూరులో నవతా కళా సమితి మొదలైన సాహితీ సాంస్కృతిక సంస్థలను స్థాపించి ఆయా ప్రాంతాలలో సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి పాటుపడ్డాడు. ఇచ్చోడలో పనిచేస్తున్నప్పుడు "ప్రత్యూష" అనే లిఖత సాహిత్యపత్రికను నడిపాడు. సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానము వంటి పౌరాణిక నాటకాలతో పాటు నటనాలయం, రాముడు లేని రాజ్యంలో వంటి సాంఘిక నాటకాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతడు బుల్లితెరపై నాగబాల, చాకలి ఐలమ్మ, కొమరం భీం వంటి సీరియళ్లలో కూడా నటించాడు. ఇతడు తొలి, మలి తెలంగాణా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు. ఇతడికి భార్య ఇందిర, నలుగురు కుమారులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు<ref name=ఇంట్ర్వ్యూ>{{cite journal|last1=సి.ఎస్.రాంబాబు|title=కుటుంబ చైతన్యమే మాతృభాషకు పునాది - మడిపల్లి భద్రయ్యతో ఇంటర్వ్యూ|journal=పాలపిట్ట|date=1 October 2017|volume=8|issue=9|pages=58-61|accessdate=24 November 2017}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2882944" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ