పద్మవ్యూహం (యుద్ధ వ్యూహం): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(మూలం చేర్చాను)
ట్యాగు: 2017 source edit
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
'''పద్మవ్యూహం''' లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలలో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని [[మహాభారతం|మహాభారత]] కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నగా అందులో [[అభిమన్యుడు]] చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు.
 
మహాభారత యుద్ధంలో [[భీష్ముడు]] ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క పదమూడవ రోజున [[ద్రోణాచార్యుడు]] పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]]కి, [[అర్జునుడు|అర్జునుని]]కి, [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్నుని]]కి (శ్రీకృష్ణుని కొడుకు), మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.
 
[[Image:Halebid2.JPG|right|thumb| అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం చెక్కిన శిల్పం - హలిబేడు, కర్ణాటక]]
2,04,044

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888079" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ