వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
== సభ్యులు == |
== సభ్యులు == |
||
# --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:01, 21 మార్చి 2020 (UTC) |
# --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:01, 21 మార్చి 2020 (UTC) |
||
#----[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 05:00, 23 మార్చి 2020 (UTC) |
#----[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 05:00, 23 మార్చి 2020 (UTC) |
||
== పని == |
== పని == |
05:01, 23 మార్చి 2020 నాటి కూర్పు
వికీప్రాజెక్టు కోవిడ్-19 అన్నది కోవిడ్-19 వ్యాధి, దానికి కారణమవుతున్న కరోనావైరస్ (సార్స్-సీవోవీ-2), దీని వ్యాప్తి వల్ల ప్రస్తుతం సాగుతున్న మహమ్మారి - వీటికి సంబంధించిన పలు వ్యాసాలను మెరుగుపరచడానికి ఏర్పాటుచేసిన ప్రాజెక్టు.
లక్ష్యం
కోవిడ్-19 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి (పెన్డమిక్) స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారతదేశంలో కూడా దీని వ్యాప్తి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపడుతున్నాయి. నేరుగా ప్రజా జీవితంపై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి వ్యాప్తి గురించి రకరకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. దానిపై పలు సంస్థలు, ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. ఈ తరుణంలో తెలుగు వికీపీడియాలో సరైన సమాచారాన్ని అందిస్తూ నాణ్యమైన వ్యాసాలను రూపొందించడం వికీపీడియా ఆవశ్యకతను ఫలప్రదం చేసే విషయంగా భావిస్తూ ఆ కృషిని సమన్వయపరచడానికి ఈ ప్రాజెక్టు ఏర్పాటయింది.
సభ్యులు
- --పవన్ సంతోష్ (చర్చ) 11:01, 21 మార్చి 2020 (UTC)
- ----Ch Maheswara Raju (చర్చ) 05:00, 23 మార్చి 2020 (UTC)
పని
వ్యాసాలు, పేజీలు
అత్యున్నత ప్రాధాన్యత స్థాయి
ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత స్థాయి
వ్యాసం | స్థితి | సంబంధిత ఆంగ్ల వ్యాసం | చేయవలసింది | అప్డేట్ చేసిన సమయం | పనిచేస్తున్నవారు |
---|---|---|---|---|---|
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి 2020 | లేదు | ||||
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ వ్యాప్తి 2020 | లేదు | ||||
చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020 | en:2019–20 coronavirus pandemic in mainland China | ||||
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనావైరస్ మహమ్మారి 2020 | en:2020 coronavirus pandemic in the United States | ||||
కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షలు | en:COVID-19 testing | ||||
కోవిడ్-19 వాక్సిన్ | en:COVID-19 vaccine | ||||
తృతీయ శ్రేణి ప్రాధాన్యత స్థాయి
వ్యాసం | స్థితి | సంబంధిత ఆంగ్ల వ్యాసం | చేయవలసింది | అప్డేట్ చేసిన సమయం | పనిచేస్తున్నవారు |
---|---|---|---|---|---|
ప్రణాళిక
ప్రణాళిక విషయమై ఈ కింది సూచనలు గమనించండి:
- ఒక వ్యాసాన్ని అనువదించడమో, సృష్టించడమో ప్రారంభించినప్పుడు దయచేసి దాన్ని సంతృప్తికరంగా పూర్తిచేయడంపైనే మీ సమయాన్ని, శక్తిని వెచ్చించమని మనవి. ఒకే సారి అనేక వ్యాసాలు మొలకలుగానో, యాంత్రికానువాద కంటెంటుతోనో ప్రారంభించి విడిచిపెడితే అది ప్రాజెక్టుకు చేటు చేయవచ్చునన్న విషయం దృష్టిలో ఉంచుకోగలరు.
- మౌలిక ప్రాధాన్యత క్రమం ప్రాజెక్టు ప్రారంభకులు ఒక మొదలు అంటూ ఉండాలి కనుక ఏర్పాటుచేశారు. ఈ ప్రాధాన్యత ఏమీ శిలా శాసనం కాదు. దీనిపై ఏమైనా విభేదం ఉన్నా, కొత్త సూచనలు ఉన్నా ప్రాజెక్టు చర్చ పేజీలో చర్చించి, ఏకాభిప్రాయం ఆధారంగా మార్పుచేర్పులు చేయవచ్చు.
- పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతున్నది కాబట్టి ఆంగ్లంలోని పేజీలను, నమ్మదగ్గ మూలాలను ఆధారం చేసుకుని కనీసం రోజుకు ఒకసారైనా ఈ వ్యాసాలలో తాజాకరించడం ప్రాధాన్యత కలిగిన కృషి. తాజాకరించేప్పుడు ఈ మూడు విషయాలు ముఖ్యంగా పట్టించుకోండి:
- నిర్ధారిత కేసులు, మృతుల సంఖ్య
- ప్రభుత్వ ఉత్తర్వులు, తీసుకుంటున్న చర్యలు
- మీరు తాజాకరించే జట్టులో ఉండదలుచుకుంటే పనిచేస్తున్నవారు సెక్షన్లో మీ పేరు రాసేప్పుడు (తాజాకరణ) అని బ్రాకెట్లో ఉంచండి.
- అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లను నమ్మకండి, కేవలం అత్యున్నత ప్రమాణాల్లోని నమ్మదగ్గ మూలాలను మాత్రమే ఆధారం చేసుకుని వ్యాసాలు రాయండి.
- ఈ వ్యాసాలు చాలామంది పాఠకులకు అవసరమైనవని భావించడానికి తగ్గ ఆధారాలున్నాయి. కాబట్టి, కృతకమైన అనువాదం తగదు. నిర్వాహకులు దీనిపై జాగ్రత్త వహించాలి.