అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
32 బైట్లు చేర్చారు ,  7 నెలల క్రితం
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
విజయనగరం [[మహారాజా కళాశాల]]లో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
 
పైడిరాజు 1949లో [[విజయనగరము]]లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్]], [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]], [[సింగపూర్]] లకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి. విజయనగరంలో [[బొడ్డు పైడన్న]], పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు, వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న [[గురజాడ అప్పారావు]] విగ్రహం మొదల్గునవి పైడిరాజు చేసినవే.
 
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.
 
భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.
 
17,332

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3444788" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ