"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{ప్రాముఖ్యత లేని విషయం}}
 
తెలుగుదేశంలో[[దక్షిణ భారతదేశం]]లో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం '''బీబి నాంచారమ్మ''' లేదా '''తుళుక్క నాచ్చియార్''' (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య. బీబీ నాంచారమ్మ కి [[కనకదుర్గ]] ఆడపడచు.<ref>1980-1990వరకు 9వ తరగతి తెలుగు నాన్ డిటైల్డ్ లో పాఠం </ref> .భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చింది.<ref>అలమేలుమంగా విలాసం http://www.hindu.com/fr/2007/06/01/stories/2007060152210300.htm </ref> నాంచారమ్మ గురించి పలు కథలు ప్రచారంలో అందులో ప్రముఖమైనది మాలిక్ కాఫూర్ వృత్తాంతము. నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని భావిస్తున్నారు. బీబీ నాంచారమ్మ కథకు సరైన ఆధారం లేకపోయిన చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈ కథను విశ్వసిస్తూ తిరుమలను దర్శించుకుంటున్నారు. ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్ మిర్జా అనే మహమ్మదీయుడు సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఈయన ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.<ref>http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html</ref>
 
తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/538104" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ