"విద్యుద్ఘాతము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
కావాల్సినంత వోల్టేజ్ విద్యుచ్ఛక్తి శరీరం గుండా ప్రవహించినప్పుడు మాత్రమే కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షులు సాధారణంగా ఒక వైరు మీదనే కూర్చుంటాయి. అందువల్ల వాటి శరీరం గుండా విద్యుచ్ఛక్తి ప్రవహించదు. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కరెంట్ తీగ మీద కూర్చొన్న పక్షి నేలను తాకినా, కూర్చున్న తీగ కాక మరొక తీగ తగిలినా, మరొక తీగపై కూర్చున్న మరొక పక్షిని తగిలినా ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తయి దాని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించి ఆ పక్షికి షాక్ కొట్టి మరణిస్తుంది.
 
==కొన్ని సందర్భాలలో చెప్పులు ధరించిన వ్యక్తికి షాక్ ఎందుకు తగలదు==
దాదాపు అన్ని రకాల చెప్పులు విద్యుత్ ప్రవాహా నిరోధకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తికి షాక్ తగలాలంటే తన ద్వారా తగినంత విద్యుత్ మరొక చోటుకి ప్రవహించి సర్క్యూట్ పూర్తికావాలి. ఫేస్ వైర్ అనగా విద్యుత్ ప్రవహిస్తున్న వైరును నేలపై నిలిచి ఉన్న వ్యక్తి తగిలినట్లయితే సర్క్యూట్ పూర్తయి ఆ వ్యక్తికి షాక్ కొడుతుంది. విద్యుత్ ప్రవాహా నిరోధకాలైన చెప్పులు ధరించిన వ్యక్తి విద్యుత్ ప్రవహిస్తున్న వైరును తగిలినప్పటికి ఫేస్ కి ఎర్త్ కి మధ్యన విద్యుత్ ప్రవాహ నిరోధకాలు ఉన్నందున సర్క్యూట్ పూర్తి కాలేదు కాబట్టి ఫేస్ వైరు తగిలి ఉన్నప్పటికి ఆ వ్యక్తి షాక్ తగలదు, కాని చెప్పులు తడిగా ఉన్నట్లయితే షాక్ కొడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/753762" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ