ప్రదీప్ హేంసింగ్ జాదవ్
ప్రదీప్ హేంసింగ్ జాదవ్ | |||
పదవీ కాలం 2004 – 2019 | |||
ముందు | దిగంబర్ బాపూజీ పవార్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | భీమ్‌రావ్ కేరామ్ | ||
నియోజకవర్గం | కిన్వాట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రదీప్ హేంసింగ్ జాదవ్ (నాయక్) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కిన్వాట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రదీప్ హేంసింగ్ జాదవ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కిన్వాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డి.బి. పాటిల్ చేతిలో 4,209 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి భీమ్‌రావ్ రామ్‌పై 28516 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
ప్రదీప్ హేంసింగ్ జాదవ్ 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కిన్వాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భీమ్‌రావ్ రామ్‌పై 18162 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి భీమ్‌రావ్ రామ్‌పై 4975 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
ప్రదీప్ హేంసింగ్ జాదవ్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కిన్వాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భీమ్‌రావ్ కేరామ్ చేతిలో 13272 ఓట్ల తేడాతో, 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి భీమ్‌రావ్ కేరామ్ చేతిలో 5,636 ఓట్ల తేడాతో వరుసగా ఓడిపోయాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ The Times of India (23 November 2024). "Kinwat Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Kinwat" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.