Jump to content

ప్రనూతన్ బహల్

వికీపీడియా నుండి
ప్రనూతన్ బహల్
2020లో ప్రనూతన్ బహల్
జననం (1993-03-10) 1993 మార్చి 10 (వయసు 31)[1]
విద్యాసంస్థప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబై
ముంబయి విశ్వవిద్యాలయం, ముంబై
వృత్తి
  • నటి
  • న్యాయవాది
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులుముఖర్జీ-సమర్థ్ కుటుంబం

ప్రనూతన్ బహల్ (జననం 1993 మార్చి 10) భారతీయ సినీనటి. న్యాయవాది. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో నటిస్తుంది.

ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరైన నూతన్ మనవరాలు. అలాగే సినిమా నటులైన మోహ్నిష్ బహల్, ఏక్తా సోహిని దంపతుల కుమార్తె. ప్రనూతన్ బహల్ 2019లో నోట్‌బుక్ చిత్రంతో బాలీవుడ్ అరంగేంట్రం చేసింది. దీంతో ఆమె ఉత్తమ నూతన నటీమణులు విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికి నామినేట్ అయింది. ఆ తరువాత ఆమె కామెడీ చిత్రం హెల్మెట్ (2021)లోనూ నటించి మెప్పించింది.[2]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ప్రనూతన్ బహల్ 1993 మార్చి 10న మహారాష్ట్రలోని ముంబైలో నటులు మోహ్నిష్ బహ్ల్, ఏక్తా సోహిని దంపతులకు జన్మించింది.[3] ఆమె నటి నూతన్, రజనీష్ బహల్ ల మనవరాలు.[4]

ఆమె హిందీ సీనియర్ నటి తనూజకు మనవరాలు, కాజోల్, తనీషా ముఖర్జీలకి మేనకోడలు కూడా.[5]

ఆమె ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుండి లీగల్ సైన్స్ అండ్ లా (B.L.S. LLB)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యూనివర్శిటీ ఆఫ్ ముంబై నుండి మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) డిగ్రీని పొందింది. ప్రనూతన్ బహల్ ప్రొఫెషనల్ లాయర్.[6][7]

కెరీర్

[మార్చు]

కైరా ఖన్నా పాత్రను పోషించిన ఎసెన్షియల్ లైక్ నో అదర్(Essential Like No Other) అనే షార్ట్ ఫిల్మ్‌తో ప్రనూతన్ బహల్ తన కెరీర్‌ని ప్రారంభించింది.[8]

2019లో జహీర్ ఇక్బాల్ సరసన నోట్‌బుక్‌తో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. కాశ్మీరీ టీచర్ ఫిర్దౌస్ క్వాడ్రీగా తన నటనకు గానూ ఉత్తమ మహిళా డెబ్యూగా స్క్రీన్ అవార్డ్, ఫిలింఫేర్ ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్లను అందుకుంది.[9][10]

ఆమె తర్వాత 2021లో విడుదలైన హెల్మెట్ చిత్రంలో అపరశక్తి ఖురానా సరసన నటించింది. ఇది భారతదేశంలో కండోమ్‌ల వాడకంతో ముడిపడి ఉన్న కథాంశంతో వచ్చిన చిత్రం. ఆమె పెళ్లిళ్లలో పుష్పాలంకరణను అందించే అమ్మాయి రూపాలి పాత్రను పోషించింది. ఇది ZEE5లో విడుదలైంది.[11]

మూలాలు

[మార్చు]
  1. "Pranutan Bahl cuts cake as Notebook co-star Zaheer Iqbal sings Happy Birthday. Watch video". India Today. 11 March 2019.
  2. "Pranutan Bahl Is A Star On The Rise- Interview". Grazia. 21 September 2021. Retrieved 25 May 2022.
  3. "Pranutan celebrates 27th birthday with dad Mohnish Bahl and family. See pic". India Today. Retrieved 11 March 2020.
  4. "Pranutan Bahl revisits her grandmother Nutan's timeless melody". Hindustan Times. Retrieved 3 July 2022.
  5. "Tanuja and Kajol welcome Pranutan Bahl to Bollywood; see their messages". Mid Day. Retrieved 4 November 2020.
  6. "Here's all you need to know about Notebook actress and Mohnish Bahl's daughter Pranutan Bahl". Mid Day. Retrieved 4 May 2019.
  7. "In Bed With Pranutan Bahl: "I regret not meeting my grandma, Nutan"". Mid Day. Retrieved 4 November 2021.
  8. "VIDEO: Nutan's grand daughter Pranutan's acting debut with Tropicana ad! Proves her comedy skills too!". ABP News. Retrieved 15 November 2018.
  9. "Notebook 2019 Full Movie". Amazon Prime Video. June 2019. Retrieved 1 July 2019.
  10. "Zaheer Iqbal and Pranutan Bahl's Notebook Box Office Collection". Bollywood Hungama. Retrieved 2 April 2019.
  11. "Aparshakti Khurana, Pranutan Bahl, Abhishek Banerjee starrer Helmet to premiere on ZEE5 on September 3". Bollywood Hungama. 20 August 2021. Retrieved 27 August 2021.