ప్రపంచ నిద్ర దినోత్సవం
ప్రపంచ నిద్ర దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | నిద్ర దినోత్సవం |
జరుపుకొనేవారు | వరల్డ్ స్లీప్ డే కమిటీ |
ప్రారంభం | 2008 |
జరుపుకొనే రోజు | మార్చి 3వ శుక్రవారం |
ఉత్సవాలు | ప్రపంచవ్యాప్తంగా |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ నిద్ర దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి నెల మాడవ శుక్రవారం నాడు జరుపబడుతోంది. వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ (వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్)[1] ఆధ్వర్యంలో 2008 నుండి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపడం, నిద్ర సమస్యల భారం, వైద్య, విద్యా, సామాజిక అంశాలపై సమాజం దృష్టిని ఆకర్షించడం, నిద్ర రుగ్మతల నివారణ, నిర్వహణను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
విమర్శ
[మార్చు]2017, మార్చి 17న ఈ ప్రపంచ నిద్ర దినోత్సవం గురించి ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అయ్యింది. భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ 'రేపు, మార్చి 17న ప్రపంచ నిద్ర దినోత్సవం' అని ట్వీట్ చేశాడు.[2] నిద్ర అవసరం గురించి తెలియజేయడానికి ఇది సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఒకే నిద్రను ఆశించాలనే ఆలోచనను ముందుకు తెస్తున్నారని విమర్శించారు. ఈ ఆలోచన ఇటీవలి ఆవిష్కరణ అని చరిత్రకారులు చెబుతున్నారు.[3]
వార్షిక వేడుక
[మార్చు]ప్రతి సంవత్సరం మార్చి ఈక్వినాక్స్ కి ముందువచ్చే (మూడవ) శుక్రవారం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[4] 2008, మార్చి 14న మొదటి ప్రపంచ నిద్ర దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలు, సమావేశాలు, ప్రదర్శనలు, ఆన్‌లైన్ కార్యక్రమాలు జరుగుతాయి.
సంవత్సరం | తేదీ | నినాదం |
---|---|---|
2008 | 14 మార్చి | 'బాగా నిద్రపోండి, పూర్తిగా మేల్కొని జీవించండి' |
2009 | 20 మార్చి | 'డ్రైవ్ హెచ్చరిక, సురక్షితంగా చేరుకోండి'[5] |
2010 | 19 మార్చి | 'బాగా నిద్రపోండి, ఆరోగ్యంగా ఉండండి'[6] |
2011 | 18 మార్చి | 'బాగా నిద్రపోండి, ఆరోగ్యంగా పెరగండి'[7] |
2012 | 16 మార్చి | 'సులభంగా ఊపిరి పీల్చండి, బాగా నిద్రపోండి'[8] |
2013 | 15 మార్చి | 'మంచి నిద్ర, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం' |
2014 | 14 మార్చి | 'రెస్ట్‌ఫుల్ స్లీప్, ఈజీ బ్రీతింగ్, హెల్తీ బాడీ' |
2015 | 13 మార్చి | 'నిద్ర బాగా ఉన్నప్పుడే, ఆరోగ్యం, ఆనందం పుష్కలంగా ఉంటాయి' |
2016 | 18 మార్చి | 'మంచి నిద్ర అనేది చేరుకోగల కల' |
2017 | 17 మార్చి | 'బాగా నిద్రపోండి, జీవితాన్ని పెంచుకోండి' |
2018 | 16 మార్చి | 'స్లీప్ వరల్డ్‌లో చేరండి, జీవితాన్ని ఆస్వాదించడానికి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' |
2019 | 15 మార్చి | 'ఆరోగ్యకరమైన నిద్ర, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం' |
2020 | 13 మార్చి | 'బెటర్ స్లీప్, బెటర్ లైఫ్, బెటర్ ప్లానెట్'[9] |
2021 | 19 మార్చి | 'రెగ్యులర్ స్లీప్, హెల్తీ ఫ్యూచర్' |
2022 | 18 మార్చి | 'క్వాలిటీ స్లీప్, సౌండ్ మైండ్, హ్యాపీ వరల్డ్' |
2023 | 17 మార్చి | ' ఆరోగ్యానికి నిద్ర చాల అవసరం ' (స్లీప్ ఈస్ ఎసెన్సియల్ ఫార్ హెల్త్) |
అవసరం
[మార్చు]మనిషికి సుఖ వంత మైన నిద్ర అంటే ప్రశాంతముగా కనీసం 7 గంటలు నిద్ర లేకుంటే ప్రశాంతంగా ఉండక పోవడం, శరీర ఆనారోగ్యం కావడం, చికాకుగా ఉండటం, గుండె జబ్బులు, ఊబకాయాన్ని మనిషి దగ్గర అవుతాడు అని పరిశోధకులు పేర్కొంటారు. నిద్ర అవసరం, ప్రాముఖ్యత గురించి కొంత మంది మహనీయులైన వారు చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి[10].
- "మనిషి నిద్రపోయే ముందు తన కోపాన్ని మరచిపోవాలి." - మహాత్మా గాంధీ
- 'నిద్ర ఉత్తమ ధ్యానం'- దలైలామా
- "మీ భవిష్యత్తు మీ కలలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి నిద్రపోండి." - మెసుట్ బరాజానీ
- "నిద్రలో మునిగిపోయిన ఆత్మ కూడా పనిలో కష్టపడి పనిచేస్తుంది,ప్రపంచంలో ఏదో చేయడానికి సహాయపడుతుంది." - హెరాక్లిటస్
2023 ప్రపంచ నిద్ర దినోత్సవం నినాదం లో 'ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం'. నిద్ర ఒక్కటే గాక ప్రజలు మంచి ఆరోగ్యకరమైన పదార్థాలను తినడం, వ్యాయామం చేయడం వంటి శారీరక, మానసిక,సామాజిక శ్రేయస్సు కొరకు నిద్ర ప్రాముఖ్యతను ఈ నినాదం చెబుతుంది. ప్రజలకు నిద్ర,ఆరోగ్యం , ప్రశాంతత అవగాహన పెంచడానికి అనేక మంది నిద్ర ఆరోగ్య నిపుణులు, మేధావులు వారి అభిప్రాయాలు తెలియచేయడానికి ఈ రోజు ఒక వేదిక గా నిలుస్తుంది అని చెప్పవచ్చు [11].
మూలాలు
[మార్చు]- ↑ World Sleep Day, accessed 19 March 2011
- ↑ Twitter @SrBachchan
- ↑ "Why the sleep industry is keeping us awake at night". Guardian. 9 March 2019. Retrieved 21 April 2019.
- ↑ "Good Sleep is a Reachable Dream". Retrieved 2016-03-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-22. Retrieved 2021-03-19.
- ↑ "March 19 2010 is Third Annual World Sleep Day". Thaindian News. Archived from the original on 2019-02-26. Retrieved 2021-03-19.
- ↑ "Philips official sponsor of World Sleep Day 2011". March 18, 2011. Archived from the original on 2021-04-22. Retrieved 2021-03-19.
- ↑ "World Sleep Day® is March 15, 2019".
- ↑ "World Sleep Day 2015 toolkit" (PDF). Retrieved 2020-03-12.
- ↑ Singh, Shivangani (2022-03-17). "World Sleep Day 2022: Theme, Quotes, and Posters". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2023-03-16.
- ↑ "World Sleep Day 2023: Theme, History, Significance and Quotes to Share". News18 (in ఇంగ్లీష్). 2023-03-16. Retrieved 2023-03-16.