ప్రవాసీ భారతీయ సమ్మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవాసీ భారతీయ సమ్మాన్
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌరులకు
విభాగం అంతర్జాతీయ
వ్యవస్థాపిత 2003
మొత్తం బహూకరణలు 136
బహూకరించేవారు భారత రాష్ట్రపతి
వివరణ అత్యున్నత స్థాయి కృషి చేసిన ప్రవాస భారతీయులను సన్మానించడం
2009 ప్రవాసి భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేస్తున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్

ప్రవాసీ భారతీయ సమ్మాన్, (ప్రవాస భారతీయ పురస్కారం) వివిధ రంగాల్లో ప్రశంసనీయమైన కృషి చేసిన ప్రవాస భారతీయులను సన్మానించేందుకు భారత ప్రభుత్వం నెలకొల్పిన పురస్కారాలు. ప్రవాస భారతీయుల దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు.[1]

భారత విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైటులో పురస్కార గ్రహీతల జాబితాను చూడవచ్చు.[2]

2015 పురస్కార గ్రహీతలు[మార్చు]

 1. మాలా మెహతా: హిందీ భాషకు ఆమె చేసిన కృషికి గాను ఈ పురస్కారం పొందారు. సిడ్నీ శివార్లలో ఇండో ఆస్ట్రేలియన్ బాల భారతీయ విద్యాలయంను స్థాపించారామె. ఈ సంస్థ ద్వారా ఆస్ట్రేలియాలో హిందీ భాషాభివృద్ధికి కృషిచేస్తున్నారు.
 2. డోనాల్డ్ రబీందర్నాథ్ రామావ్‌తార్: గయానా అధ్యక్షుడు. గయానాలో భారతీయ సంతతికి ఆయన్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం పొందారు.
 3. డా. రాజారామ్‌ సంజయ: భారత్‌లో జన్మించిన మెక్సికో శాస్త్రవేత్త. 480 గోధుమ రకాలను కనిపెట్టినందుకు గాను ఆయన 2014 ప్రపంచ ఆహర పురస్కారం పొందారు.
 4. కన్వల్ సింగ్ బక్షీ: న్యూజీల్యాండ్‌లో పార్లమెంటు సభ్యుడు. ఆ దేశంలో భారత సంతతి ప్రజలకు ఎంతో సేవ చేసారు.
 5. రాజ్‌మల్ పరాఖ్: ప్రముఖ దాత. ఒమన్, భారత్‌లలో ఆయన ధార్మిక, సంఘ సేవ చేసారు.
 6. దురైకణ్ణు కరుణాకరన్: సీషెల్స్ సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి.
 7. ఎసోప్ గూలామ్‌ పహాడ్: దక్షిణాఫ్రికాలో 1999 నుండి 2008 వరకు మంత్రిగా పనిచేసారు.
 8. భరత్ కుమార్ జయంతిలాల్ షా: యుఏఈ లో సంఘ సేవకుడు.
 9. అష్రాఫ్ పాలాకున్నుమ్మాల్: యుఏఈ లో మలయాళీ సంఘ సేవకుడు.
 10. మహేంద్ర నాన్‌జీ మెహతా: ఉగాండాలో వ్యాపారవేత్త.
 11. ప్రొఫెసర్ నాథూ రాం పురి: ప్యూరికో గ్రూపు వ్యవస్థాపకుడు. సంఘసేవకుడు.
 12. సత్య నాదెళ్ళ: మైక్రోసాఫ్ట్ సిఈవో
 13. డా. నందిని టాండన్: అమెరికాలో ఆరోగ్య, ఐటీ రంగాల్లో ఆమె చేసిన సేవకు గాను ఆమెకు ఈ పురస్కారం లభించింది. 
 14. డా. కమ్లేష్ లుల్లా: నాసాలో ఎర్త్ అబ్సర్వేషన్‌లో ఛీఫ్ సైంటిస్టుగాపనిచేస్తున్నారు. అంతరిక్ష శాస్త్రంలో ఆయన కృషికిగానూ ఈ పురస్కారం పొందారు.
 15. రాజ్ లూంబా: రింకు గ్రూపు వ్యవస్థాపకుడు. దాత. ఇంగ్లాండు హౌస్ ఆఫ్ లార్డ్స్‌ సభ్యుడు.

2014 పురస్కార గ్రహీతలు[మార్చు]

 1. సెనెటరు లీసా మేరియా సింగ్ - ఆస్ట్రేలియా పార్లమెంటులో దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వ్యక్తి
 2. కురియన్ వర్ఘీస్ - బహ్రెయిన్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త
 3. వాసుదేవ్ చంచ్లానీ - కెనడాలో స్థిరపడ్డ వ్యాపారవేత్త, దాత
 4. రామకృష్ణ మఠం - ఫిజీ
 5. బికాస్ చంద్ర సన్యాల్ - ఫ్రాన్సులో ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త
 6. సత్‌నారాయణ్‌సింగ్ రాఅబిన్ బల్దేవ్‌సింగ్ - నెదర్లాండ్స్‌లో భారత్ పట్ల సదవగాహనకు కృషి చేసారు.
 7. శశీంద్రన్ ముత్తువేల్ - పపువా న్యూ గినియా పార్లమెంటులో తొలి భారత సంతతి సభ్యులు
 8. షిహాబుదీన్ వావా కుంజూ - సౌదీ అరేబియాలో భారత సమాజ సంక్షేమం కోసం కృషి చేసారు
 9. ఎళా గాంధీ - భారత దక్షిణాఫ్రికాల మధ్య సంబంధాల ప్రగతికి కృషి చేసారు
 10. షంషీర్ వయాళిల్ పరంబత్ - యుఏఈ లో ఆరోగ్య రంగంలో వ్యాపారం, భారత్ పట్ల సదవగాహనకు కృషి
 11. శైలేష్ లక్ష్మణ్ వర - ఇంగ్లాండులో భారత సంతతికి చెందిన కంసర్వేటివ్ మంత్రి
 12. డా. పార్థసారథి చిరామెల్ పిళ్ళై - శాస్త్ర విజ్ఞాన రంగంలో కృషి, భారత అమెరికాల మధ్య సత్సంబంధాలకై కృషి
 13. డా. రేణు ఖటోర్ - అమెరికాలో ఓ రీసెర్చి యూనివర్సిటీ అధ్యక్షుడైన తొలి భారత సంతతి వ్యక్తుల్లో ఒకరు.
 14. డా. నమితా రాయ్ చౌదరి - న్యూ యార్కు లోని ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఫుల్ ప్రొఫెసరైన తొలి భారతీయ మహిళ.

2013 పురస్కార గ్రహీతలు[మార్చు]

 1. రాజ్‌కేశ్వర్ పర్యాగ్ - మారిషస్ అధ్యక్షుడు
 2. నరేంద్ర ఆర్ కుమార్ - తల మెడ సర్జరీలో స్పెషలిస్టు
 3. మొహమ్మద్ రబీ కరువంతోడి - మధ్య ఆసియాలో పాలీక్లినిక్కులను నడుపుతున్నారు
 4. బావా హాజీ పండలింగళ్ - యుఏఈ
 5. పాట్రీషియా మారియా రొజరియో - సంగీతంలో ఆమె కృషికి 
 6. ప్రొఫెసరు గురుశరణ్ సింగ్ చత్వాల్ - జర్మనీ  (శాస్త్ర విజ్ఞానం).
 7. అశోక్ వాస్వానీ - గినియా (సమాజ సేవ).
 8. తన్ శ్రీ రవీంద్రన్ మీనన్ - మలేసియా (సమాజ సేవ).
 9. డా. స్రసిక్ వి జోషి - మెక్సికో (సాహిత్యం).
 10. డా. సతీంద్ర కె సింగ్ - న్యూజీలాండ్ (సమాజ సేవ).
 11. గిల్బర్ట్ సి మోటియెన్ - రీయూనియన్ ఐలండ్ (వ్యాపారం).
 12. ఇస్మాయిల్ ఇ ఎబ్రహీమ్‌ -  దక్షిణాఫ్రికా (ప్రజా సేవ).
 13. సుభాష్ రాజ్దాన్, అమెరికా (ప్రజా సేవ).

2012 పురస్కార గ్రహీతలు[మార్చు]

 • రాధాకృష్ణ ప్లవలిళ్ కిఝక్కెత్తిల్ వాసుదేవన్ పిళ్ళై, బహ్రెయిన్
 • సచ్చిదానంద్ సహాయ్, కంబోడియా
 • ఇండో కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్, కెనడా
 • దీపక్ నారాయణ్‌దాస్ శివ్‌దాసాని, కోటె డి వోయిర్
 • విక్టర్ షహీద్ స్మెటాసెక్, జర్మనీ
 • ప్రకాష్ లోహియా ఇండోనేసియా
 • జోస్ పరయాంకెన్, మొజాంబిక్
 • కిరణ్ నవీన్‌చంద్ర అషర్ - ఒమన్
 • హసన్ అబ్దుల్‌కరీం చౌగులే - కతార్
 • ఎస్.ఆర్. నాథన్ - మాజీ సింగపూర్ అధ్యక్షుడు
 • కుమారి ఖొర్షెద్ నోషిర్ ఘిన్‌వాలా - దక్షిణాఫ్రికా
 • కమలా పెర్సాద్ బిస్సేస్సర్ - ట్రినిడాడ్, టొబాగో ప్రధానమంత్రి
 • రాజేష్ కుమార్ సరయ్యా - యుక్రెయిన్
 • ప్రొఫెసరు సురేంద్ర కుమార్ కౌశిక్ -  అమెరికా
 • కుమారి కల్పలత కుమ్మమూరి గుంటుపల్లి - అమెరికా

2011 పురస్కార గ్రహీతలు[మార్చు]

 • ప్రొఫెసరు వీణా హర్‌భగవాన్ సహజ్‌వాలా - ఆస్ట్రేలియా (శాస్త్ర విజ్ఞానం)
 • లతా పాడా (కళలు)
 • హరీందర్ సింగ్ బంగా - హాంగ్‌కాంగ్ (వ్యాపారం)
 • మొహమ్మద్ మునీర్ నజీర్ హసన్ అన్సారి - ఇజ్రాయిల్ (సమాజ సేవ)
 • ఉప్‌జిత్ సింగ్ సచ్‌దేవా -లైబీరియాఅ (సమాజ సేవ)
 • తన్ శ్రీ దాతో అజిత్ సింగ్ - మలేసియా (ప్రజాహిత కార్యక్రమాలు)
 • సర్ ఆనంద్ సత్యానంద్ న్యూజీలాండ్ (ప్రజాహిత కార్యక్రమాలు)
 • సాలెహ్ వహీద్ - నెదర్లాండ్స్ (సమాజ సేవ)
 • భారతీయ సమాజ సంక్షేమ నిధి - కతార్ (సమాజ సేవ)
 • డా. మొహియుద్దీన్ సయ్యద్ కరీముద్దీన్, పిల్ల వైద్య నీపుణులు, జెడ్డా, సౌదీ అరేబియా (సమాజ సేవ)
 • మనో సెల్వనాథన్ - శ్రీలంక (వ్యాపారం)
 • మోహన్ జషన్‌మల్ - యుఏఈ (సమాజ సేవ)
 • బరోనెస్ (డా.) సందీప్ వర్మ, ఇంగ్లాండు (ప్రజాహిత కార్యక్రమాలు)

మూలాలు[మార్చు]

 1. "Pravasi Bharatiya Divas concludes; Overseas Indian doctors ready to help India". Economic Times. 9 Jan 2011.
 2. Pravasi Bharatiya Samman Archived 2010-11-03 at the Wayback Machine MOIA website.