ప్రియాంక్ ఖర్గే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియాంక్ ఖర్గే

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013
ముందు వాల్మీకి నాయక్
నియోజకవర్గం చిత్తాపూర్

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
8 జూన్ 2018 – 23 జులై 2019
ముందు హెచ్. ఆంజనేయ
తరువాత గోవింద్ కరజోల్
నియోజకవర్గం చిత్తాపూర్

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
27 మే 2023 – ప్రస్తుతం
నియోజకవర్గం చిత్తాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1978-11-22) 1978 నవంబరు 22 (వయసు 45)
గుల్బర్గా, కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు మల్లికార్జున్ ఖర్గే
రాధాబాయి ఖర్గే
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రియాంక్‌ ఖర్గే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు చిత్తాపూర్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 20న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రియాంక్ ఖర్గే తన తండ్రి మల్లికార్జున్ ఖర్గే అడుగుజాడల్లో 1998లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన ఆ తరువాత 1999లో ఎన్‌ఎస్‌యూఐ కాలేజీ జనరల్ సెక్రటరీగా, తర్వాత 2001లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2005 వరకు పని చేసి, 2005 నుండి 2007 వరకు కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 2007 నుండి 2011 వరకు కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.

ప్రియాంక్ ఖర్గే 2009లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలో చిత్తాపూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వాల్మీకి నాయక్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2011లో ప్రియాంక్ ఖర్గే 2014 వరకు కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2013లో జరిగిన ఎన్నికల్లో చిత్తాపూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016లో సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఐటీ, బిటీ & పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.

ప్రియాంక్ ఖర్గే 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై హెచ్‌డి కుమారస్వామి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2023లో ఎన్నికల్లో గెలిచి ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 20న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  2. Eenadu (21 May 2023). "అష్టదిగ్గజాలే". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  3. Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.