ప్రీతి ముకుందన్
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.[1]
జీవితం
[మార్చు]పేరు ప్రీతి ముకుందన్ 30 జూలై 2000 తిరుచ్చి, తమిళనాడు లో జన్మించినది. ప్రీతి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచ్చి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బీటెక్ చదివింది. ప్రీతి ముకుందన్ అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఒక స్థాయిని నిలపెట్టుకున్నది. ప్రీతి 2024లో 'ఓం భీమ్ బుష్' అనే విజయవంతమైన చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ప్రీతి నటనకు తోడు భరతనాట్య నృత్యకారిణి, చిన్న వయస్సు నుండి శిక్షణ పొందింది. హిప్ హాప్, సినీ జానపదం, పాశ్చాత్య, సమకాలీన, ఫ్యూజన్ వంటి విభిన్న రూపాల్లో రాణిస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె తన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ తో పాటు, ఆమె అనేక టీవీ వాణిజ్య ప్రకటనలలో, వార్త ప్రకటనలలో రావడం, దక్షిణ భారత యాడ్-ఫిల్మ్ పరిశ్రమలో గుర్తింపు పొందింది[2].
కెరీర్ ప్రారంభం
[మార్చు]ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలలో తన నటనాజీవితం ప్రారంభించింది. ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ 'ముత్తు ము2'తో యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది. విష్ణు సరసన నటించిన 'ఓం భీమ్ బుష్' చిత్రంతో తెలుగు (టాలీవుడ్) చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది[3].
మూలాలు
[మార్చు]- ↑ "కన్నప్పలో కథానాయికగా.. | Kannappa: Preeti Mukundan as heroine in Vishnu Manchu dream project Kannappa official announcement - Sakshi". web.archive.org. 2023-12-15. Archived from the original on 2023-12-15. Retrieved 2023-12-15.
{{cite web}}
: no-break space character in|title=
at position 23 (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Preity Mukhundhan Biography". https://www.filmibeat.com/. Retrieved 30 July 2024.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ Sir, Mohit (2024-07-24). "Indian Film Actress Preity Mukhundhan Biography" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-30.