ప్రేమపుస్తకం
ప్రేమపుస్తకం (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గొల్లపూడి శ్రీనివాస్ |
---|---|
తారాగణం | అజిత్ కుమార్ , సంఘవి |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | శ్రీకర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ప్రేమపుస్తకం (బుక్ ఆఫ్ లవ్) అనేది 1993 సం.లో విడుదలైన ఒక శృంగార చిత్రం. ఈ చిత్రం సెట్లో ఉండగా, తన మరణానికి ముందు పాక్షికంగా గొల్లపూడి శ్రీనివాస్ చేత దర్శకత్వం వహించబడింది; తరువాత అతని తండ్రి, గొల్లపూడి మారుతీ రావు చేత ఈ సినిమా పూర్తయింది. [1] సినిమాలో కొత్తగా వచ్చిన అజిత్ కుమార్, కంచన్ ప్రధాన పాత్రలు పోషించగా, దేవేంద్రన్ సంగీతాన్ని అందించారు.
తారాగణం
[మార్చు]అజిత్ కుమార్ సిద్ధార్థ గాను, కాంచన్ చరిత్ర పాత్రలోను, తంగన, ఎస్.కె.మిస్రో ఇతర పాత్రలలో నటించారు. గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమపుస్తకం'తోనే అజిత్ హీరోగా పరిచయమయ్యాడు. అజిత్ 1971 సం.లో తెలుగు రాష్ట్రం హైదరాబాద్ లో జన్మించాడు.
ప్రారంభం
[మార్చు]ఈ చిత్రం 1992 సం.లో ప్రారంభంలో గొల్లపూడి మారుతీ రావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ చేత కథ వ్రాయబడింది, 1992 ఆగస్టులో ప్రధాన పాత్రలో అజిత్ కుమార్ ఈ సినిమాకు సంతకం చేసాడు. అయితే, మొదటి నెల షూటింగ్‌లో, సినిమాకు ప్రథమ దర్శకుడు అయిన గొల్లపూడి శ్రీనివాస్ దర్శకుడుగా తన తొలిచిత్రం ప్రారంభ దర్శకత్వంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నగరంలో సినిమా సెట్టింగ్ లోనే ఉండగా ప్రమాదానికి గురై గాయాలు తగిలిన తరువాత తొలి దర్శకుడు చనిపోయాడు. [2]ఈ మరణం తర్వాత గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు సృష్టించ బడింది. దర్శకుడు మరణం తదుపరి, అతని తండ్రి గొల్లపూడి మారుతీ రావు కుమారుని వారసత్వాన్ని కొనసాగించడానికి తొలిసారి దర్శకత్వం వహించిన దర్శకులకు తనే చిత్రానికి దర్శాకత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. [3] ఈ చిత్రం నిర్మాణం ఆలస్యం అయింది, తరువాత శ్రీనివాస్ తండ్రి పూర్తిచేశారు, 1993 సం.లో ఇది విడుదలైంది.
విడుదల
[మార్చు]1994 సం.లో గొల్లపూడి మారుతీ రావు ఉత్తమ స్కీన్‌ప్లేగా నంది పురస్కారం గెలుచుకున్నారు. [4] ఈ చిత్రం ప్రారంభ సమయంలో ఎదుర్కొన్న సమస్యల కారణంగా అజిత్ కుమార్‌కు "ప్రశంసనీయం మర్చిపోలేనిది" ఈ చిత్రం అని వ్యాఖ్యాతలచే వ్యాఖ్యానించబడింది. [5][6] తర్వాత 1997 సం.లో తమిళంలో కాదల్ పుతంగమ్ గా అనువదించబడింది, విడుదల చేయబడింది. [7]
పాటలు
[మార్చు]- మూడు నేలలేగా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- విశాఖ బీచ్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన:వేటూరి సుందర రామమూర్తి
- తియ్యగా పుట్టేదే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- మనుగడే మధురము , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- గెలుచుకో, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- కలికి సీతమ్మకు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మొదలైనదీ మన , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- అనుకున్నది , గానం యస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పూర్ణమదం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వేటూరి సుందర రామమూర్తి
చిత్రం వివరాలు
[మార్చు]ఈ చిత్రానికి ఎ.పూర్ణచంద్ర రావు సమర్పకుడు, శ్రీకర్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా తయారయీంది. ఈ చిత్రం రచన గొల్లపూడి.
- కెమెరామెన్ : ఎం.రామకృష్ణ
- అసోసియేట్ ఎడిటర్ : భాస్కర్
- అసోసియేట్ డైరెక్టర్ : తులసీరామ్
- కో-డైరెక్టర్స్ : దాసం శాయి ప్రసాద్ (శ్యాం)
- నృత్యం : చిన్ని ప్రకాష్
- కళ : జి.అరుణ్ గౌడ్ గాంకర్
- స్పెషల్ ఆర్ట్ డైరెక్టర్ : తోట తరణి
- ఎడిటింగ్ : గౌతంరాజు
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఎస్. నవకాంత్
- సంగీతం : దేవేంద్రన్
- నిర్మాత : వి. సత్యనారాయణ
తారాగణం
[మార్చు]శ్రీకర్, చరిత్ర నూతన పరిచయస్తులు. లక్ష్మీప్రియ, సోహిని, దీపిక, స్వాతి, పి.యల్.నారాయణ, మహర్షి రాఘవ, తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతీ రావు, బాలు, మిశ్రో, కాశీ విశ్వనాథ్, కళ్ళు చిదంబరం, కుమార రాజా, ప్రసాద రావు, రజనీ శ్రీనివాస్, జి.వి.రామకృష్ణ, జి.గౌరీశాంకర్, విద్యాసాగర్ రాజు మిగతా నటులు. అలాగే, మురళీ మోహన్, గిరిబాబు, వేలు, మల్లిఖార్జున రావులు గౌరవ నటులుగా నటించారు.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి వేటూరి, జాలాది, సిరివెన్నెల, వెన్నెలకంటి, గురుచరణ్ పాటలు వ్రాసారు.
నేపథ్య గానం
[మార్చు]ఎస్.పి, బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చిత్ర, రాధిక చిత్రానికి పాటలు పాడారు.
సినిమాకు అవార్డులు
[మార్చు]ఈ సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ నంది అవార్డు, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత నంది పురస్కారం మొదలయినవి లభించాయి.
మూలాలు
[మార్చు]- ↑ "A bid day for Thala Ajith! Check to know why!". Behindwoods.com. 2 August 2017. Retrieved 2 August 2017.
- ↑ "Bad back, great future". Rediff.com. 6 July 1999. Retrieved 8 July 2011.
- ↑ "About Us". Gollapudi National Award. Archived from the original on 11 జూలై 2011. Retrieved 17 ఏప్రిల్ 2018.
- ↑ https://www.telugucinema.com/c/publish/Guest_Articles_22/_509_printer.phpRetrieved 8 July 2011. Archived 21 అక్టోబరు 2010 at the Wayback Machine
- ↑ "Pyar to hona hi tha". Rediff.com. 15 September 1999. Retrieved 8 July 2011.
- ↑ Ajith Kumar Retrieved 8 July 2011.
- ↑ Tamil Movie News--Pudhu Edition 3 Retrieved 8 July 2011.