Jump to content

ప్రేమ్ వాత్స

వికీపీడియా నుండి
ప్రేమ్ వాత్స
జననం (1950-08-05) 1950 ఆగస్టు 5 (వయసు 74)
జాతీయతభారతీయుడు[1]
విద్యాసంస్థ
వృత్తివ్యాపారవేత్త
నికర విలువ1.1 బిలియన్ అమెరికన్ డాలర్లు (2016 సెప్టెంబరు)[2]
బోర్డు సభ్యులుఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చైర్మన్

ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త.[3][4][5] ఇతన్ని "కెనడియన్ వారెన్ బఫెట్" అని పిలుస్తారు.[6][7] టొరంటోలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్. 2020 జనవరిలో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.[8][9][10]

జననం, విద్య

[మార్చు]

ప్రేమ్ 1950, ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రోమన్ కాథలిక్ బ్రాహ్మణ వారసత్వ కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్[11][12] లలో చదివాడు. కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత లండన్, అంటారియోకు వెళ్లి, వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలోని రిచర్డ్ ఐవీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ నుండి ఎంబిఏ సంపాదించాడు. తన విశ్వవిద్యాలయ విద్యకు కావలసిన డబ్బుకోసం ఫర్నేస్‌లు, ఎయిర్ కండీషనర్‌లను అమ్మేసిన వాత్స US$8తో విదేశాలకు వెళ్ళాడు. [13]

వృత్తిరంగం

[మార్చు]

గ్రాడ్యుయేషన్ తర్వాత, బీమా కంపెనీ కాన్ఫెడరేషన్ లైఫ్‌లో పనిచేశాడు. 1984లో తన మాజీ బాస్ టోనీ హాంబ్లిన్‌తో కలిసి హాంబ్లిన్ వాత్స ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెల్ అనే పెట్టుబడి సంస్థను ప్రారంభించాడు.[12] నష్టాల్లో ఉన్న ఒక చిన్న కెనడియన్ ట్రక్కింగ్ బీమా కంపెనీ అయిన మార్కెల్ ఫైనాన్షియల్‌ను 1985లో స్వాధీనం చేసుకొని[13] దానికి ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అని పేరు పెట్టాడు.[12] 2012లో సంవత్సరానికి $8 బిలియన్ల వార్షిక ఆదాయాన్ని చేరుకున్న కంపెనీని అభివృద్ధి చేయడంలో వాత్స సహాయం చేశాడు.[12] 2001 నుండి పెట్టుబడిదారుల సమావేశాలను నిర్వహించాడు.[12][13]

నిర్వర్తించిన పదవులు

[మార్చు]
  • 2009 జూన్ నెలలో యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూకి తొమ్మిదవ ఛాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[14]
  • 2015లో ఆర్డర్ ఆఫ్ కెనడా సభ్యునిగా ఎంపికయ్యాడు.[15]
  • 2017 సెప్టెంబరులో హురాన్ యూనివర్సిటీ కాలేజీకి మొదటి ఛాన్సలర్‌గా ఎన్నికయ్యాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. "Prem Watsa". www.nndb.com.
  2. "#1741 V. Prem Watsa". Forbes. Retrieved 2022-05-31.
  3. (BusinessWeek.com - Executive Profile - Prem Watsa/FFH) http://investing.businessweek.com/research/stocks/people/person.asp?personId=1136292&symbol=FFH.
  4. (Yahoo!
  5. (Fool.com - 2007-12-05 - How to Dodge the Debt: BRK.
  6. "reportonbusiness.com: Short shrift". Archived from the original on 20 April 2006. Retrieved 2022-05-31.
  7. Feeley, Jef (22 April 2010). "Zenith National Investors Lose Bid to Halt Buyout". Bloomberg. Retrieved 2022-05-31.
  8. "Anand Mahindra, Venu Srinivasan to be honoured with Padma Bhushan; Naukri.com founder to get Padma Shri". The Economic Times. 26 January 2020. Retrieved 2022-05-31.
  9. "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
  10. "IIT Madras congratulates its professors, alumnus on being conferred with Padma awards". Hindustan Times. 26 January 2020. Retrieved 2022-05-31.
  11. "Citations: 1999 Distinguished Alumnus Awards Recipients - Office Of Alumni Relations". alumni.iitm.ac.in.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 Castaldo, Joe (10 October 2013). "The man with nothing to lose". Canadian Business. Archived from the original on 2021-03-04. Retrieved 2022-05-31.
  13. 13.0 13.1 13.2 Doval, Pankaj (25 September 2013). "Prem Watsa, the 'richest, savviest guy you've never heard of'". Gadgets Now. Retrieved 2022-05-31.
  14. "Home - Waterloo News". 26 June 2012.
  15. "Four Nova Scotians among Order of Canada honourees".
  16. (Huron University College - News Release - 2017-10-18) http://huronuc.ca/AboutHuron/News/NewsDetail?q=f54ce115-dd8d-4cba-b102-cf8399c09475 Archived 2018-09-10 at the Wayback Machine

బయటి లింకులు

[మార్చు]