ప్రొపనోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంతి -పుల్ల మాదిరి
రేఖా సౌష్టవం

ప్రొపనోల్ అనే రంగులేని ద్రవం ఒక ప్రాధమిక సారాయి(ఆల్కహాలు). అత్యంత సాధారణ రకాల్లో ప్రొపనోల్ ఒక ప్రాధమిక ఆల్కహాల్ లలో ఒకటి. ప్రొపనోల్ రసాయన సూత్రం లేదా ఫార్ములా CH3CH2CH2OH. ప్రొపనోల్ను నార్మల్ ప్రొపైల్ ఆల్కహాల్(n-propyl alcohol),ప్రొపాన్-1-ఓల్, 1-ప్రొపైల్ ఆల్కహాల్ లేదా ఎన్-ప్రొపనోల్ అన్నీ కూడా పిలుస్తారు. ఇది రంగులేని ద్రవం.ఆల్కహాల్ అనే పదానికి తెలుగులో సారాయి అని అర్ధం.[1] ఆల్కహాల్‌లు అనేవి కర్బన సమ్మేళనాలు, ఇవి ఆల్కైల్ సమూహం లేదా హైడ్రోకార్బన్ గొలుసులో కార్బన్ అణువుతో జతచేయబడిన ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ హైడ్రాక్సిల్ సమూహాల(-OH) ఉనికిని కలిగి ఉంటాయి.కేవలం ఒక హైడ్రాక్సిల్ సమూహాం(-OH) వున్న ఆల్కహాలులను మోనో హైడ్రాక్సి ఆల్కహాలు అని అంటారు. ప్రొపనోల్ ఒక మోనో హైడ్రాక్సి ఆల్కహాలు.మూడు హైడ్రాక్సిల్ సమూహాలు(-OH)కలిగి వున్న పాలి హైడ్రాక్సి ఆల్కహాలుకు ఉదాహరణ గ్లిజరాల్.నార్మల్ ప్రొపనోల్ యొక్క ఐసోమర్ ను ఐసో ప్రొపనోల్ లేద 2-ప్రొపనోల్ లేదా 2.ప్రొపైల్ ఆల్కహాలు అని పెలుస్తారు.[1]

ప్రొపనోల్ అణు నిర్మాణం[మార్చు]

ప్రొపనోల్ ఒక సరళ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.మూడు కార్బనులను కలిగిన హైడ్రోకార్బను సరళ(వంపులు,శాఖలు లేని)గొలుసు యొక్క చివరి కార్బనుకు ఒక హైడ్రాక్సి(OH)సమూహం/గ్రూపు అనుసంధానం అయ్యి వుండును.పొపనాల్ జల ఆకర్షక మరియు తక్కువ జలవికర్షక గుణాలను కలిగిన ఆల్కహాలు.అయితే సాధారణంగా ద్రువద్రావణి(poplar solvent)గా పరిగణిస్తారు. ప్రొపనోల్ యొక్క హైడ్రోకార్బను శృంఖలం/గొలుసు లోని మొదటి కార్బను మూదు హైడ్రోజన్ పరమాణువులతొ బంధం కల్గివుండగా, చివరి మూడో కార్బన్ ఒక హైడ్రోజన్ పరామాణువుతో బంధం వుండి,దానితో హైడ్రాక్సైడ్ సమూహం బంధంలొ వుండటం వలన,ఈ భాగం జలాపెక్ష(hydrophilic) గుణం ప్రదర్శిస్తుంది.మొదటి కార్బను మూడు హైడ్రోజను పరమాణువులతో కోవాలెంట్ బంధంలో వుండి జల వికర్షక లక్షణాన్ని కలిగి వుండును.అల్కహాలులలోని అల్కైల్ గొలుసుపెరిగే కొలది,ఆల్కహాలు యొక్క జలాపేక్ష గుణం పెరుగుతుంది. [2]

సహజ లభ్యత[మార్చు]

ఇది అనేక కిణ్వ ప్రక్రియ ప్రక్రియల సమయంలో తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయబడుతుంది.సాధరణంగా ఇది 2-ప్రొపనోల్ యొక్క నిర్మాణ( ప్రొపనోల్ యొక్క ఐసోమర్) సౌష్తవాన్నింకల్గి వుండును.[3]ప్రొపనోల్ అనేది మద్యసారమిశ్రణములో ప్రధాన భాగం, బంగాళాదుంపలు లేదా ధాన్యాలు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి పులియబెట్టినప్పుడు కొన్ని అమైనో ఆమ్లాల నుండి ప్రొపనోల్ ఉప-ఉత్పత్తిగా ఏర్పడుతుంది. జీడిపప్పు, చైనీస్ ఆవాలు, గ్రీన్‌థ్రెడ్ టీ అలాగే చాయోట్ వంటి అనేక ఆహార పదార్థాలలో ప్రొపైల్ ఆల్కహాల్ తక్కువ మొత్తంలో ఉంటుంది.మానవులలో, ప్రొపైల్ ఆల్కహాల్ ప్రధానంగా రక్తం, మలం మరియు లాలాజలం, అలాగే మానవ ఫైబ్రోబ్లాస్ట్ కణజాలంలో వుంటుంది.[4]ఆపిల్, కాగ్నాక్ మరియు రమ్(rum) యొక్క సహజ సుగంధాలలో కనుగొనబడినట్లు నివేదించబడింది.ఆల్కహాలిక్ కిణ్వ ప్రక్రియ సమయంలో కూడా ఏర్పడుతుంది.ఆపిల్, నేరేడు పండు, అరటిపండు, స్వీట్ చెర్రీ, బొప్పాయి, పైనాపిల్, ఆరెంజ్ జ్యూస్, లింగన్‌బెర్రీ, క్రాన్‌బెర్రీ, ద్రాక్ష, బఠానీలు, కోరిందకాయ, స్ట్రాబెర్రీ, ఉల్లిపాయ, లీక్, టమాటో, అల్లం, వెనిగర్, అనేక చీజ్‌లు(మీగడలు), వెన్న, కొవ్వు వంటి వాటిలో కూడా ఉన్నట్లు నివేదించబడింది. చేపలు, చేప నూనె, వండిన గొడ్డు మాంసం, మటన్ మరియు పంది మాంసం, బీర్, అనేక రకాల బ్రెడ్,షెర్రీ, కోకో, టీ, కాల్చిన ఫిల్బర్ట్‌లు మరియు వేరుశెనగలు, తేనె, సోయాబీన్, ఓట్స్, ప్యాషన్ ఫ్రూట్, ప్లం, బీన్స్, మష్రూమ్, యాపిల్ మరియు ప్లం బ్రాందీ, జిన్, రైస్, రైస్ బ్రాన్, క్విన్సు, ప్రిక్లీ పియర్, పనస పండు, లోక్వాట్ వైల్డ్ రైస్,సోంపు బ్రాందీ, కేప్ గూస్‌బెర్రీ మరియు చైనీస్ క్విన్సు లలో కూడా ప్రొపనోల్ ఉనికిని గుర్తించారు.[5]

వాణిజ్యపరంగా ప్రొపనోల్ తయారీ[మార్చు]

పెట్రోకెమికల్ పరిశ్రమలో, ప్రొపియోనాల్డిహైడ్‌ను పొందటానికి కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్‌తో ప్రతిచర్య జరిపినపుడు ఈథేన్ నుండి 1-ప్రొపనోల్ ఉత్పత్తి చేయబడుతుంది, ఇది తరువాత హైడ్రోజనేటెడ్ అవుతుంది.[6]ఇథనాల్ యొక్క వాణిజ్య తయారీ సమయంలో బంగాళాదుంపలు లేదా ధాన్యాలు పులియబెట్టినప్పుడు 1-ప్రొపనోల్ ఉప-ఉత్పత్తిగా కూడా ఉత్పత్తి అవుతుంది.[6][7]2008లో, అట్సుమీ(Atsumi)మరియు ఇతరులు, అలాగే షెన్ మరియు ఇతరులు. E. coli యొక్క మెటబాలిక్ ఇంజనీరింగ్ ద్వారా గ్లూకోజ్ నుండి 1-ప్రొపనోల్ ఉత్పత్తిని చెయ్య వచ్చని నివేదించారు.కీటో యాసిడ్ డెకార్బాక్సిలేస్ మరియు ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ చర్య ద్వారా 2-కెటోబ్యూటిరేట్ 1-ప్రొపనోల్‌గా మార్చబడింది.[8][9]ప్రొపనోయిక్ ఆమ్లం నుండి ప్రొపనోల్ సంశ్లేషణ చెయ్యవచ్చు ప్రొపనోల్ రెండు దశల ద్వారా సంశ్లేషణ చేయబడుతుంది. మిథైల్ ప్రొపనోయేట్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రొపనోయిక్ యాసిడ్ మరియు మిథనాల్‌ను 4:3 మోల్ నిష్పత్తితో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్ప్రేరకం సమక్షంలో ఎస్టెరిఫికేషన్ చేయడం వలన మిథైల్ ప్రొపనోయేట్ ఏర్పడుతుంది. దానిని సోడియంతో క్షయికరించడంవలన ప్రొపనోల్ ఉత్పత్తి అవుతుంది.మిథనాల్‌తో ప్రొపనోయిక్ ఆమ్లం యొక్క ఎస్టరిఫికేషన్ వలన 75% మిథైల్ ప్రొపనోయేట్‌ను ఉత్పత్తి అవుతుందని చేస్తుందని ఫలితాలు చూపిస్తున్నాయి. ఇథిలీన్ గ్లైకాల్‌ను ద్రావకం వలె ఉపయోగించి మిథైల్ ప్రొపనోయేట్ ను క్షయికరించినపుడు 77% దిగుబడితో ప్రొపనోల్‌ను ఉత్పత్తిఅవుతుంది.[10]

ప్రొపియోనాల్డిహైడ్ యొక్క ఉత్ప్రేరక హైడ్రోజనేషన్ ద్వారా సాధారణ ప్రొపనోల్ తయారు చేయబడు తుంది. కోబాల్ట్ ఆక్టాకార్బొనిల్ లేదా రోడియం కాంప్లెక్స్ వంటి ఉత్ప్రేరకం సమక్షంలో కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్‌ను ఉపయోగించి ఇథిలీన్ యొక్క హైడ్రోఫార్మిలేషన్ ద్వారా ప్రొపియోనాల్డిహైడ్ స్వయంగా ఆక్సో ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.[11]

H2C=CH2 + CO +H2 → CH3CH2CH=O
CH3CH2CH=O + H2 → CH3CH2CH2OH(ప్రొపనోల్)

ప్రొపనోల్ భౌతిక గుణాలు[మార్చు]

1-ప్రొపనోల్ యొక్క కొన్ని ఉదాహరణ ప్రతిచర్యలు

N-ప్రొపనోల్ ఆల్కహాల్ రబ్బింగ్ ఆల్కహాల్ వంటి ఘాటైన దుర్వాసనతో స్పష్టమైన రంగులేని ద్రవంగా కనిపిస్తుంది. ఆల్కహాల్ ఫ్లాష్ పాయింట్ 53-77 °F(11.5-25°C). స్వయం జలితం 700°F(370°C) వద్ద అవుతుంది. ఆవిరి గాలి కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది మరియు కళ్ళు, ముక్కు మరియు గొంతును కొద్దిగా చికాకుపెడుతుంది.[12]సాంద్రత 6.5 పౌండులు/గాలన్.నీటిలో కలుస్తుంది.

లక్షణం/గుణం మితి/విలువ
అణు ఫార్ములా C3H8O
అణు భారం 60.10 గ్రా/మోల్[13]
మరుగు స్థానం 97.0°C[14]
ద్రవీభవన ఉష్ణోగ్రత మైనస్1270°C [14]
ఫ్లాష్ పాయింట్ 230°C[15]
సాంద్రత 0.8053,20°C/4°Cవద్ద[14]
బాష్ప సాంద్రత 2.1 (గాలి=1.0)
బాష్ప పీడనం 21.0 మి.మి/పాదరసమట్టం,25 °Cవద్ద[16]
స్నిగ్ధత 2.256cP,20 °Cవద్ద[17]
దహన ఉష్ణ శక్తి 2021.3 కిలోజౌల్స్ /మోల్,25°C వద్ద[17]
బాష్పీభవన ఉష్ణం 47.45 కిలోజౌల్స్ /మోల్,25°Cవద్ద[17]
వక్రీభవన సూచిక 1.3862 @ 20 °C/D[14]

ప్రొపనోల్ అనువర్తనం/వినియోగం[మార్చు]

  • 1-ప్రొపనోల్ యొక్క సాధారణ ఉపయోగం మందులు మరియు లోషన్లు, సబ్బులు మరియు నెయిల్ పాలిష్‌ల వంటి సౌందర్య సాధనాల తయారీలో ఉంది.ఇది ఫ్లెక్సోగ్రాఫిక్ ప్రింటింగ్ ఇంక్ మరియు టెక్స్‌టైల్స్ తయారీలో కూడాప్రొపనోల్ వినియోగం వుంది.[6][18]
  • సర్వసాధారణంగా ప్రొపనోల్‌ను ద్రావకం వలె ఉపయోగిస్తారు. అలాగే యాంటీఫ్రీజ్, వార్నిష్ తయారీ ఫార్ములాలు,సబ్బులు, రంగు ద్రవాలు , విండో క్లీనర్‌లు వంటివి వాటి తయారీలో వాడతారు. మరియు ఇతర ద్రావకాలను/ద్రావణిలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఐసోప్రొపనోల్ లేదా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వంటి ప్రొపనోల్ సమ్మేళనాలు ప్రింటింగ్ పరిశ్రమలో మరియు ప్రింటింగ్ ఇంక్‌లో సాధారణంగా ఉపయోగించబడతాయి.[1]
  • హాలైడ్‌లు, ప్రొపైల్ అమైన్‌లు మరియు ప్రొపైల్ అసిటేట్‌లను సృష్టించే ప్రక్రియలో రసాయన ఇంటర్మీడియట్‌గా(మాధ్యమం)ప్రొపనోల్ పనిచేస్తుంది.
  • ప్రొపనోల్ వైద్య ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. ఇది యాంటిసెప్టిక్‌గా ఉపయోగించబడుతుంది.హ్యాండ్ శానిటైజర్, రుబ్బింగ్ ఆల్కహాల్ సీసాలు మరియు వైప్‌లలో కూడా ఉపయోగిస్తారు.సౌందర్య సాధనాలలో, నెయిల్ పెయింట్ రిమూవర్, సబ్బులు, వైప్స్ మరియు మాయిశ్చరైజర్‌లో ప్రొపనోల్ ఉంటుంది.[19]
  • ప్రొపనోల్‌ను ఆహార పదార్థాలు మరియు పచ్చి పాలు, ఆరెంజ్ జ్యూస్, సోయా సాస్, చేప నూనె, టొమాటో పేస్ట్, ఎండీవ్ మొదలైన ఆల్కహాల్ లేని పానీయాలలో ఉపయోగించవచ్చు. కిణ్వ ప్రక్రియ ఉత్పత్తి ప్రక్రియలో, ఆల్కహాలిక్ డ్రింక్స్ ద్రావణంలో కొంత భాగాన్ని కలిగి ఉంటుంది.[20]

దుష్ప్రభావాలు[మార్చు]

ప్రొపనోల్ వలన మనషుల్లో ఈ క్రింది దుష్ప్రభావాలు కనపడవచ్చు[21]

  • పొత్తి కడుపు నొప్పి
  • కోమా (ప్రతిస్పందన లేకపోవడం)
  • రిఫ్లెక్స్‌లు తగ్గడం లేదా లేకపోవడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • తల తిరగడం
  • తలనొప్పి
  • బద్ధకం (అలసట)
  • తక్కువ రక్తపోటు (మరణానికి ఎక్కువ ప్రమాదం ఉన్న తీవ్రమైన విషానికి సంకేతం)
  • తక్కువ మూత్ర విసర్జన
  • వికారం మరియు వాంతులు
  • నెమ్మదిగా లేదా శ్రమతో కూడిన శ్వాస
  • అస్పష్టమైన ప్రసంగం
  • మూర్ఖత్వం (చురుకుదనం మరియు గందరగోళం స్థాయి తగ్గింది)
  • సమన్వయం లేని కదలికలు
  • రక్తం వాంతులు

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Propanol". byjus.com. Retrieved 2024-03-09.
  2. "Propanol structure". study.com. Retrieved 2024-03-09.
  3. "Propanol and butanol". sciencedirect.com. Retrieved 2024-03-09.
  4. "1-Propanol". foodb.ca/compounds. Retrieved 2024-03-09.
  5. "1-Propanol Chemical Properties,Uses,Production". chemicalbook.com. Retrieved 2024-03-09.
  6. 6.0 6.1 6.2 "1-PROPANOL". inchem.org. Retrieved 2024-03-09.
  7. Material Safety Data Sheet 1-Propanol. Caledon Laboratory chemicals.
  8. Atsumi S, Hanai T, Liao JC: Engineering synthetic non fermentative pathways for production of branched-chain higher alcohols as biofuels. Nature. 2008, 451: 86-89. 10.1038/nature06450
  9. Shen CR, Liao JC: Metabolic engineering of Escherichia coli for 1-butanol and 1-propanol production via the keto-acid pathways. Metabolic Engineering. 2008, 10: 312-320. 10.1016/j.ymben.2008.08.001
  10. "Synthesis propanol by esterification and reduction reaction". researchgate.net. Retrieved 2024-03-09.
  11. "How is N-Propanol produced?". solventis.net. Retrieved 2024-03-09.
  12. "1-Propanol". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-09.
  13. Computed by PubChem 2.2 (PubChem release 2021.10.14)
  14. 14.0 14.1 14.2 14.3 Budavari, S. (ed.). The Merck Index - An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals. Whitehouse Station, NJ: Merck and Co., Inc., 1996., p. 1348
  15. "N-PROPANOL". pubchem.ncbi.nlm.nih.go. Retrieved 2024-03-09.
  16. Riddick, J.A., W.B. Bunger, Sakano T.K. Techniques of Chemistry 4th ed., Volume II. Organic Solvents. New York, NY: John Wiley and Sons., 1985., p. 194
  17. 17.0 17.1 17.2 "N.propanol". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-09.
  18. Material Safety Data Sheet 1-Propanol. Caledon Laboratory chemicals.
  19. "Uses Of Propanol". collegedunia.com. Retrieved 2024-03-09.
  20. "Uses of Propanol". shiksha.com. Retrieved 2024-03-09.
  21. "Propyl alcohol". mountsinai.org. Retrieved 2024-03-09.