ప్లేటో తత్త్వములు
ప్రముఖ గ్రీకు తత్త్వవేత్త ప్లేటో, మానవులు తమ గురించి తాము నిజము తెలుసుకోవడానికి ఉపయోగపడేలా 'గుహ'ఉదాహరణ (allegory of the cave) ను వాడుతూ ఉండేవాడు. ఇది ప్లేటో రిపబ్లిక్ లో సోక్రటీసు ద్వారా గ్రంథస్తము చెయ్యబడింది.
కథా వస్తువు
[మార్చు]గమనిక: ఇది కేవలము ఊహ మాత్రమే. కథ కోసం మటుకే ఈ పరిస్థితి ఊహించబడింది. కొంతమంది బందీలు చిన్న తనము నుండి ఒక గుహలో బంధింపబడి ఉన్నరని ఊహించుకోండి. వారి చేతులు, కాళ్ళు, తల కూడా కదపడానికి వీలు లేకుండా ఉండి దృష్టి అంతా ఒక గోడ మీద మాత్రమే ఉంది. బందీల వెనుక నుండి వెలుతురు వస్తున్నది. వారికి గోడకు మధ్య ఒక కొంచము ఎత్తైన దారి పై మనుష్యులు వివిధ చెట్లను, జంతువుల బొమ్మలను తీసుకుని నడుస్తూ ఉంటారు. వాటి నీడలు గోడపై పడి బందీలు ఆ నీడలను చూడగలుగుతారు. ఎవరైనా బొమ్మలు పట్టుకు వెళ్ళే వారు మాట్లాడితే గుహ అంతా ప్రతిధ్వని వచ్చి బందీలు ఆ ప్రతిధ్వని విని గోడ మీద నీడల నుండి ఆ ధ్వని వచ్చిందని నమ్ముతారు. బందీలు మామూలుగా గోడ పై కనపడే నీడలకు పేర్లు పెట్టుకునే ఆట ఆడుతూ ఉంటారు. వారు నీడలను మాత్రమే చూస్తున్నపటికీ వరికి తెలిసిన నిజమంతా ఇదే. కాబట్టి ఒకరిలో ఒకరు ఎవరు ఎంత త్వరగా/బాగా నీడను చూసి పేరు గుర్తు పట్టగలరు ఆనే దాని పై వారి పేరు ప్రఖ్యాతులు ఆధారపడి ఉంటాయి. వెంటనే పేరు గుర్తు పట్టగెలిగే వారిని అందరూ ఇష్టపడతారు. గుర్తు పట్టలేని వారిని అంతగా ఇష్టపడరు.
ఒకడిని విడిపించి, నించునేలా చేసి తల తిప్పేలా చేసామనుకోండి. వెనుక ఉన్న వెలుతురు వలన వాడు ఒక్క క్షణము కళ్ళు కనపడక, నీడల కంటే నిజము వస్తువులు ఆంత సహజముగా కనపడవు. ఆలాగే వాడిని గుహ లోపల నుంచి బయటకు లాగి, సూర్యుని వెలుగులోకి ప్రవేశపెట్టామను కోండి. వాని కళ్ళు కొన్నాళ్ళు అసలు కనపడక ఏవీ చూడలేడు. ఆ తరువాత మెల్లిగా సూర్యకాంతి పడని వస్తువులను మొదట, ఆ తరువాత మంచి సూర్యకాంతి పడే వస్తువులను, చివరికి సూర్యుణ్ణి చూస్తాడు. అప్పటికి సూర్యుని వలనే రాత్రి, పగలు, ఋతువులు సాధ్యమవుతున్నాయని, కనపడే ప్రతి ఒక్క వస్తువు మీద సూర్యుని ప్రభావము ఉందని, ఇప్పటి వరకూ తాను చూసిన వస్తువులన్నికీ కారణము సూర్యుడేనని తెలుస్తుంది.
ఒక్కసారి జ్ఞానోదయమైన తరువాత, ఈ బందీ ఒక వేళ తన పాత గుహకు తిరిగిరాకపోవడానికి ఒకవేళ ఇష్టపడక పోయినప్పటికీ అక్కడికి రాక తప్పదు. ఇప్పుడు మిగతా బందీలను విడిపించాలంటే ఆ బందీలు స్వాతంత్ర్యానికి అంగీకరించక పోవచ్చు. ఎందుకంటే తిరిగి గుహ లోకి దిగాలంటే కళ్ళు ముందు అలవాటు పడాలి. వెళ్ళిన తరువాత మళ్ళీ పేరు తెచ్చుకోవడానికి పైన చెప్పిన ఆట ఆడాలి. చీకటికి కొన్నాళ్ళు కళ్ళు అలవాటు పడక ఆటలో ఒడిపోతూ ఉంటాడు. ఆందువలన మిగతావారు వీడు బయటకు వెళ్ళడము వలన గుడ్డివాడై పోయాడని భయపడి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. వాడితో పోరాడతారు కూడా (The Republic bk. VII, 516b-c; trans. Paul Shorey).
అర్థము
[మార్చు]మన గురించి మనము నిజాలు తెలుసుకునే పద్ధతుల గురించి ప్లేటొ చెపుతున్నడు. మనకు తెలిసింది ఎంతవరకూ నిజము అనేదే ప్రశ్న. మనస్సు ఉన్నత శిఖారాలను చేరి, సృష్టికి మూలకారణాము ఏది (సూర్యుడే దేవుడని గ్రీకులు భావించేవారు.) అనే విషయము తెలుసుకోవడము, తెలుసుకున్న తరువాత మిగతావారికి ఆ విషయాలు చెప్పడము గురించి ఈ కథ చెపుతుంది. (517b-c).
దివ్యజ్ఞానము పోందిన తరువాత వెనక్కు వచ్చుట అంత మందికీ సాధ్యము కానప్పటికీ, తత్త్వవేత్త-రాజులు భగవంతుని దగ్గర నుండి నిత్యమూ నిజము తెలుసుకుంటూ పాలిస్తూ ఉండగలిగే రాజ్యము ఉంటుందని ప్లేటో ఊహ.
జ్ఞానోదయము పొందడము ఎలా? పొందాక ఏమవుతుంది అనే విషయము కూడా ఈ కథ వివరిస్తుంది. మొదట కల నుండి నిద్ర లేచి బంధములను తొలగించుకోవలెను. తరువాత మనలను ఉత్తేజితము చేసే వస్తువుల (పై కథలో గోడ పై నీడలు) నిజస్వరూపము కనపడుతుంది. ఆ తరువాత పరమ సత్యము (సూర్య్డు, గుహ బైట). జ్ఞానోదయమైన తరువాత సహజమైన్ కోరిక తోటి వారిని విడిపిద్దామని. చాలాసార్లు ఈ ప్రయత్నము వ్యర్థము కావచ్చు ఎందుకంటే వారు ఆ బంధాల నుండి విడడానికి ఇష్టపడక 'నిజము చెప్పేవాడి పై' యుద్ధము చేయుదురు.
సోక్రటీసు జీవితము నకు ఈ కథ ఉదాహరణ. తెలుసుకున్న నిజమును వేరే వారికి చెప్పబోయిన సోక్రటీసుకు మరణశిక్ష విధించిరి.
సారూప్యత
[మార్చు]ఈ కథలో ప్రతీ స్థితికి దాని ప్రత్యేకత ఉంది. ప్లేటోకు రాజకీయాలలో సమాజ సేవలో ఉన్న గొప్ప ఆసక్తి ఈ కథలో కనపడుతుంది.
- ప్లేటో సూర్య్డుడు సృష్టిలో నిజ జ్ఞానానికి మూలముగా భావించాడు. గుహలో బందీలు సామాన్య మానవులు. మనము నిజము తెలియకుండా అలాగే కూర్చుంటాము. కాని తత్త్వవేత్తలు (విడుదలైన మనుష్యులు) బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
- బంధించిన గొలుసులు మనపై సమాజము వలన పడే అనేక ప్రభావాలు. అవి మన జీవితము లోజరిగే విడ్డూరాలను ప్రశ్నించకుండా అపివేస్తూ ఉంటాయి. అధికారములో ఉన్నవారు కొన్నిసార్లు అధికారము కోసము, జనులను చిన్న చిన్న విషయాలలో ములిగిపోయేటట్ట్లు చేస్తూ ఉంటారు.
- అధికారములో ఉన్నవారు నిజాన్ని కాకుండా గోడపై దాని నీడలను చూపించి బందీలను ఎక్కడి వారిని అక్కడే ఉంచే ప్రయత్నము చేస్తూ ఉండవచ్చు.
- వెనక్కు వచ్చిన విముక్తునకు, మిగతా వారికి అర్థమయ్యే లా వివరించడానికి పదజాలము దొరకదు. బందీల భాష గుహలో వస్తువులకు మాత్రము పరిమితమైతే బైట వస్తువులకు సారూప్యతను ఎలా చూపిస్తారు?
- అలాగే దివ్యత్వాన్ని వివరించడానికి మన అనుభవము నుండి పుట్టిన మామూలు భాష సరిపోదు. అలాగే మనకు చెప్పబడిన దానిని ప్రశించుకుని మనకు మనమే బంధములను కొంత వరకూ తొలగించుకోవచ్చు
ఈ రోజుల లో ఈ తత్త్వము ప్రత్యేకత
[మార్చు]పండోరాస్ బాక్స్ (గ్రీకు పురాణాలలో దుష్టశకులన్నీ ఈ పెట్టెలో బంధించబడి యులెసిస్కు ఇవ్వబడ్డాయి. వాడిని ఆ పెట్టె తెరువవద్దని కోరగా, వాడు దానిని తెరిచి ఇబ్బందులు పడతాడు) ఎలాగైతే సమాజములో సాంకేతిక పరిజ్ఞానము (టెక్నాలజీ) యొక్క అక్కరలేని ప్రభావమును వ్యక్తీకరించినట్లు, ప్లేటో గుహ 'మాస్ మీడియా' ప్రజాభిప్రాయాన్ని వారి జ్ఞానాన్ని, మనిషికి ఘటనకు మధ్య నిలబడి ఎలా మారుస్తుందో చూపిస్తుంది. అలాగే మార్పు కోరుకోని సమాజములోని ప్రజలు బైట ప్రపంచములో ఏమి జరుగుతాందో తెలుసుకోకుండా, వారి వారి విధానాలు సరి అయినవి అనుకునే లా ఉన్నపుడు ఎలా ఉంటుది అన్నది వివరిస్తున్నది.
ది మేట్రిక్స్ మూడు సినిమా లలో ప్లాట్ లో కూడా ఇది కనబడుతుంది. ఇందులో నియో గుహలాంచి విడుదలైన మనిషి.
ఇవికూడా చూడండి
[మార్చు]- ప్లేటో
- అమెరికన్ యూనివర్శిటీ విద్యార్థుల చే యూట్యూబ్ లో పెట్టబడిన హాస్య రూపకము