ఫర్హత్ ఇబ్రహీం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫర్హత్ ఇబ్రహీం
ఫర్హత్ ఇబ్రహీం


వ్యక్తిగత వివరాలు

జననం 1966, డిసెంబర్
హైదరాబాద్, తెలంగాణ
వృత్తి తెలంగాణ ఉద్యమకారులు, వ్యాపారవేత్త.

ఫర్హత్ ఇబ్రహీం గారు తెలంగాణ ఉద్యమకారులుగా, వ్యాపారవేత్తగా సుపరిచితమైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేసిన వారిలో ముఖ్యులు, పార్టీ మాజీ వ్యవస్థాపక సభ్యులు.[1]

జీవిత విషయాలు[మార్చు]

డిసెంబర్ 1966 హైదరాబాద్ నగరంలో ఫర్హత్ ఇబ్రహీం గారు జన్మించారు. ఫర్హత్ ఇబ్రహీం గారిది జాగీరుదారి కుటుంబం. వారి పూర్వీకులకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉండేవి. ఫర్హత్ ఇబ్రహీం గారి తండ్రి గారి పేరు షేక్ ఇబ్రహీం, ఆయన పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవారు. ఫర్హత్ ఇబ్రహీం గారికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. ఫర్హత్ ఇబ్రహీం డిగ్రీ వరకు చదువుకున్నారు.

భారత మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆర్.వెంకటరామన్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతో షేక్ ఇబ్రహీం గారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. నెహ్రు గారితో కలిసి వేటకు కూడా వెళ్ళేవారు. కరీంనగర్ మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్ళిన సందర్భంలో కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షులుగా పీవీ నరసింహారావు నియమించబడడానికి షేక్ ఇబ్రహీంగారు తోడ్పాటు అందించారు.[2]

రాజకీయాలు[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకావడంలో ముందుండి పార్టీ స్థాపనకు సహకరించిన ఫర్హత్ ఇబ్రహీం గారు, అనేక కాలంపాటు పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేశారు.[3] పదవులను ఆశిచకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతికోసం అహర్నిశలు నిస్వార్ధంగా సేవలు చేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో విభేదాల కారణంగా ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.[4]

తెలంగాణ ఉద్యమం[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఫర్హత్ ఇబ్రహీం చురుకైన పాత్ర పోషించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఉద్యమంలో పాల్గొని అనేక మందిని ఉద్యమం వైపు నడిపించారు. అందుకోసం తన జీవితాన్ని, తన సంపాదనను కూడా ఖర్చు చేశారు.

ప్రభుత్వంపై హైకోర్ట్ లో కేసు[మార్చు]

మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిలు భారత రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించారని, భారత రాజ్యాంగంలోని నిబంధనలు, అవినీతి నిరోధక చట్టం, 1988లోని నిబంధనల ప్రకారం వారిని విచారించాలని ఫర్హత్ ఇబ్రహీం గారు ప్రభుత్వంపై హైకోర్ట్ లో కేసు వేశారు.

అవినీతి లేని రాజకీయాలు కావాలని, అలాంటి నాయకులు రావాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి పూనుకున్నారు.

పుస్తక రచనలు[మార్చు]

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తదనంతర పరిణామాలపై 'ఒక్క మంత్రి పదవి కోసం – కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాస్తవగాధ' అనే పేరుతో పుస్తకాన్ని వెలువరించారు.[5]

మూలాలు[మార్చు]

  1. MPost (2015-08-18). "Ex-TRS founder accuses Telangana CM of constitutional impropriety". www.millenniumpost.in (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  2. తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పిన Farhat Ibrahim || మీ iDream Nagaraju B.Com, retrieved 2023-04-11
  3. ANI (2015-08-15). "Ex-TRS founder accuses KCR of constitutional impropriety". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  4. KCR Friend Farhat Ibrahim Sensational Exclusive Interview | BS Talk Show | CM KCR | Top Telugu TV, retrieved 2023-04-11
  5. ఒక్క మంత్రి పదవి కోసం!! బుక్ లో నమ్మలేని నిజాలు...సంచలనాలు | Ibrahim Comments On KCR | Tolivelugu TV, retrieved 2023-04-11

బాహ్య లింకులు[మార్చు]