బచావ్ శోభా దినేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బచావ్ శోభా దినేష్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు సుభాష్ భామ్రే
నియోజకవర్గం ధూలే

నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
పదవీ కాలం
20 మార్చి 1999 - 15 మార్చి 2002

వ్యక్తిగత వివరాలు

జననం (1959-09-29) 1959 సెప్టెంబరు 29 (వయసు 65) 2
ధూలే , మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు లక్ష్మణరావు భావు పాటిల్, నిర్మల
జీవిత భాగస్వామి దినేష్ మోతీరామ్ బచావ్
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం ధన్వంతి హాస్పిటల్ 78/1A, దత్తా నగర్, పేత్ రోడ్, పంచవతి, నాసిక్, మహారాష్ట్ర
మూలం [1]

బచావ్ శోభా దినేష్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధూలే నియోజకవర్గం నుండి  తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

శోభా బచావ్ 1992లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ధూలే జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా, 26 ఫిబ్రవరి 1992న తొలిసారి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తరువాత వరుసగా మూడుసార్లు ఎన్నికై 20 మార్చి 1999 నుండి 2002 వరకు నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేసింది. ఆమె 2004 నుండి 2009 వరకు నాసిక్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ మహిళా హక్కులు & సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, ప్రజారోగ్యం & కుటుంబ సంక్షేమం, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ శాఖ మంత్రిగా పని చేసింది.

శోభా బచావ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధూలే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ భామ్రేపై 3,831 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై,[4] 26 సెప్టెంబర్ 2024 నుండి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా పని చేస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "Dhule election results 2024 live updates: Congress' Bachhav Shobha Dinesh wins". The Times of India. 2024-06-05. ISSN 0971-8257. Retrieved 2024-06-04.
  2. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  3. India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  4. TV9 Bharatvarsh (7 June 2024). "Dhule Lok Sabha Seat Winner Shobha Dinesh Bachhav: कौन हैं डॉ. शोभा? धुले में BJP को दी करारी शिकस्त, जानें सांसद के बारे में सब कुछ". Retrieved 14 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)