బదావత్ ప్రభాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బదావత్ ప్రభాకర్

బదావత్ ప్రభాకర్ భౌతిక శాస్త్రవేత్త, ప్రభుత్వ పంచాయితీరాజ్ శాఖలో సహాయక ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చని పరిశోధన చేసారు.

విద్య[మార్చు]

ఈయన హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులు.

పరిశోధన[మార్చు]

వస్తువులకు ద్రవ్యరాశి వలన గురుత్వ బలం ఉత్పన్నమవుతుంది. అధిక వ్యాప్తి బలం గల ఈ శక్తి ఒక అసంతృప్త బలం, ఎప్పటికీ ఆకర్షణ బలంగా ఉంటుంది. అందువలన ఇది అతి తక్కువ తీవ్రత కలిగి ఉన్న బలం అవుతుంది. అయితే దీని ప్రభావం వస్తు ద్రవ్య రాశులు అధికంగా ఉన్నపుడు అత్యధిక తీవ్రంగా ఉంటుంది. గురుత్వాకర్షణ బలమనేది గురుత్వబలం, విద్యుదాయస్కాంతబలం, కేంద్రక బలాలు కలిపిన బలం. గురుత్వాకర్షణ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసే సరికొత్త ప్రక్రియను ప్రభాకర్ అన్వేషించారు. గతితార్కిక భౌతికవాదముననుసరించి గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం తను రూపొందించిన చక్రం లాంటి పరికరమిన సామాన్య లోలకం (simple pendulum) ఎటువంటి బాహ్యబలం లేకుండానే నిరంతరంగా తిరుగుతుందని నిర్ధారించారు. సామాన్య లోలకం కేవలం ముందుకు, వెనక్కు కదలడం వలన శక్తి ఉత్పత్తికి సరిపోదు. అందుకని ఈయన గుండ్రంగా ఉండే విధంగా ఒక పరికరాన్ని తిరిగే విధంగా రూపొందించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం దీనిని సులువుగా ఉపయోగించవచ్చు. అలాంటి యంత్రాన్ని రూపొందించి ఈయన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని నిర్ధారించారు. సెల్ఫ్ రివాల్వింగ్ ఇన్‍స్ట్రుమెంట్ ‌ (ఎస్.ఆర్.ఐ) పేరుతో పిలిచే ఈ యంత్రానికి జనరేటర్ అనుసంధానం చేస్తే ఎటువంటి ఇంధనం లేకుండా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని పరిశోధన ద్వారా నిరూపించారు ప్రభాకర్.

నమ్మకం[మార్చు]

ఈయన ప్రకారం ఈ పరిశోధన వెలుగులోకి వస్తే రాష్ట్రానికి సరిపడేంత విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని ధీమా వ్యక్తం చేసారు ప్రభాకర్.

జీవన గమనం[మార్చు]

వరంగల్ జిల్లా మహబూబాబాద్లో పంచాయితీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. యువశాస్త్రవేత్తగా రాణిస్తున్న ఈయన గిరిజన మేధావి రోడ్దు ప్రమాదంలో కంటి చూపు కోల్పోయినప్పటికీ ఏ మాత్రం పట్టుదల కోల్పోలేదు. రైల్లు పర్స్పరం ఢీకొనకుండా ఉండేలా రక్షణ పరికరాన్ని కూడా రూపొందించారు.

మూలాలు[మార్చు]

  • జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆంధ్ర శాస్త్రవేత్తలు. శ్రీవాసవ్య. కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ. పేజీ 13-14