బల్వంత్ బస్వంత్ వాంఖడే
బల్వంత్ వాంఖడే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 24 జూన్ 2024 | |||
ముందు | నవనీత్ కౌర్ రానా | ||
---|---|---|---|
నియోజకవర్గం | అమరావతి | ||
ఆధిక్యత | 19,731 | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 24 అక్టోబర్ 2019 – 12 జూన్ 2024 | |||
ముందు | రమేష్ బండిలే | ||
తరువాత | గజానన్ లావాటే | ||
నియోజకవర్గం | దర్యాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 2 జులై 1967 మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | బస్వంత్ సావన్జీ వాంఖడే, సీతాబాయి బస్వంత్ వాంఖడే | ||
జీవిత భాగస్వామి | మందా బల్వంత్ వాంఖడే | ||
మూలం | [1] |
బల్వంత్ బస్వంత్ వాంఖడే (జననం 2 జూలై 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమరావతి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బల్వంత్ వాంఖడే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005 నుండి 2010 వరకు లెహ్గావ్ గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2012 నుండి 2019 వరకు అమరావతి జిల్లా కౌన్సిల్ ఛైర్మన్‌గా, 2005 నుండి 2020 వరకు దర్యాపూర్ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, అమరావతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్‌గా పని చేశాడు.
బల్వంత్ వాంఖడే 2009 శాసనసభ ఎన్నికలలో దర్యాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా, 2014 శాసనసభ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అబండిలే రమేష్ గణపత్రరావుపై 30519 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
బల్వంత్ వాంఖడే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అకోలా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రానాపై 19,731 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 election results: Amravati".