Jump to content

బానోతు మదన్ లాల్

వికీపీడియా నుండి
బానోతు మదన్ లాల్
బానోతు మదన్ లాల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2018
ముందు బానోత్ చంద్రావతి
తరువాత లావుడ్యా రాములు నాయక్‌
నియోజకవర్గం వైరా

వ్యక్తిగత వివరాలు

జననం 1963 మే 3
ఈర్లపుడి గ్రామం, రఘునాథపాలెం, ఖమ్మం జిల్లా
మరణం 2025 మే 27
హైదరాబాద్‌
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మాన్ సింగ్
జీవిత భాగస్వామి మంజుల
సంతానం మృగేందర్ లాల్ (ఐపీఎస్ అధికారి)[1] & మనీషా లక్ష్మి

బాణోతు మదన్‌లాల్‌ (03 మే 1963 - 27 మే 2025) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బానోతు మదన్ లాల్ 1963 మే 03లో ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం, ఈర్లపుడి గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బానోతు మదన్ లాల్ రాజకీయాల్లోకి రాకముందు 1983 నుంచి 85 వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి 1995లో ఎంపీటీసీగా గెలిచి, ఆ తరువాత రాజీనామా చేసి ఈర్లపూడి సర్పంచ్‌గా 1996 నుండి 2001, 2006 నుండి 2011 వరకూ రెండుసార్లు పని చేశాడు. ఆయన 2009లో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి చేతిలో 47,539 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వై.కా.పా అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బానోత్ బాలాజీ పై 10583 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2018లో ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్‌ చేతిలో 2013 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[5][6]

బానోతు మదన్ లాల్ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ మాలోత్ చేతిలో 33045 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[7][8]

మరణం

[మార్చు]

బానోతు మదన్ లాల్ అనారోగ్యంతో బాధపడుతూ 2025 మే 27న హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[9][10][11][12]

మూలాలు

[మార్చు]
  1. Great Telangana (4 August 2020). "సివిల్స్‌లో సత్తాచాటిన మాజీ ఎమ్మెల్యే మదన్‌లాన్‌ తనయుడు." Great Telangaana. Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  2. Sakshi (16 May 2014). "పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  3. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  4. Sakshi (9 April 2014). "వైఎస్‌ఆర్‌సీపీ జాబితా విడుదల". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  5. News18 (2018). "Wyra Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. India (2018). "Wyra Election Results" (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  7. "Telangana Assembly Election Results 2023: Wyra". Election Commission of India. 13 December 2023. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  8. "Wyra Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 13 December 2023. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  9. "వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ గుండెపోటుతో కన్నుమూత". NT News. 27 May 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  10. "వైసీపీ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కన్నుమూత." V6 Velugu. 27 May 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  11. "వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూత, బీఆర్ఎస్ నేతల సంతాపం". ABP Desham. 27 May 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  12. "వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ హఠాన్మరణం". Andhrajyothy. 28 May 2025. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.