బాపుదేవ్ శాస్త్రి
మహామహోపాధ్యాయ పండిట్ బాపుదేవ్ శాస్త్రి (1 నవంబర్ 1821-1900) కాశీ సంస్కృత కళాశాలలో జ్యోతిషశాస్త్ర ప్రధాన ఉపాధ్యాయుడు. భారతీయ, పాశ్చాత్య ఖగోళశాస్త్రం రెండింటికీ ప్రొఫెసర్‌గా మారిన మొదటి పండితుడు. అతను కౌన్సిల్ ఆఫ్ ప్రయాగ్, కలకత్తా విశ్వవిద్యాలయాలలో, రాయల్ సొసైటీ ఆఫ్ ఐర్లాండ్ , గ్రేట్ బ్రిటన్‌లో గౌరవనీయమైన సభ్యుడు. మహామహోపాధ్యాయ బిరుదు కూడా పొందిన పండితుడు.
జీవిత విశేషాలు
[మార్చు]బాపుదేవ్ శాస్త్రి 1743లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో గోదావరి నది ఒడ్డున ఉన్న 'టోంకే' అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని ప్రారంభ విద్యాభ్యాసం నాగ్‌పూర్‌లోని మరాఠీ పాఠశాలలో జరిగింది, అక్కడ అతను అంకగణితం, బీజగణితంలో విద్యను అభ్యసించాడు. అతను ధుండిరాజ్ మిశ్రా నుండి బీజగణితం, లీలావతి (భాస్కరాచార్యుడు) గ్రంథాలని నేర్చుకున్నాడు. అతని ప్రతిభకు ముగ్ధుడై, బ్రిటీష్ రాజకీయ ఏజెంట్ లాన్సెలాట్ విల్కిన్సన్ అతన్ని సెహోర్‌లోని (మధ్య ప్రదేశ్) సంస్కృత పాఠశాలలో చేర్పించాడు, అక్కడ అతను సిద్ధాంత శిరోమణి, యూక్లిడియన్ జ్యామెట్రి, యూరోపియన్ సైన్స్‌లో విద్యను అభ్యసించాడు. పండిట్ సేవారామ్ ,విల్కిన్సన్ స్వయంగా అతని ఉపాధ్యాయులు. 1842లో, శాస్త్రిగారు వారణాసిలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలలో నియమించబడ్డారు, అక్కడ అతను జ్యామితి బోధించడం ప్రారంభించాడు.
భాస్కరాచార్య సిద్ధాంతశిరోమణిని అనువదించి 1891లో బనారస్‌లో ప్రచురించారు. విల్కిన్‌సన్‌తో కలిసి, అతను సూర్య సిద్ధాంతానికి ఆంగ్ల అనువాదం అయిన 'సూర్య సిద్ధాంతం లేదా ఖగోళ శాస్త్రం యొక్క ప్రాచీన వ్యవస్థ' అనే పుస్తకాన్ని వ్రాసాడు. అతని దృక్సిద్ధ పంచాంగం ఇప్పటికీ వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయం నుండి ప్రచురించబడుతూఉంది.
రచనలు
[మార్చు]అతని గ్రంథాలు:
- రేఖాగణితప్రథమాధ్యాయి
- త్రికోణమితి,
- ప్రాచీన జ్యోతిషాచార్యషయవర్ణన,
- సయనవాద,
- తత్వవివేకపరీక్ష,
- మానమందిరస్థ యంత్ర వివరణ,
- అంకగణితం,
- బీజగణితం.