బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
Boy-friend-for-Hire.jpg
దర్శకత్వంసంతోష్ కంభంపాటి
రచనసంతోష్ కంభంపాటి
నిర్మాతవేణుమాధవ్‌ పెద్ది
కె.నిరంజన్‌ రెడ్డి
నటవర్గంవిశ్వంత్
మాళవిక సతీశన్
మధునందన్
హర్ష వర్ధన్
ఛాయాగ్రహణంబాలా సరస్వతి
కూర్పువిజయ్ వర్ధన్ కే
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థలు
స్వస్తిక సినిమా
ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీలు
14 అక్టోబరు 2022 (14-10-2022)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ సినిమా.[2] స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. విశ్వంత్, మాళవిక సతీశన్, మధునందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను 2021 మే 2న విడుదల చేశారు.[3]

కథ[మార్చు]

అర్జున్(విశ్వంత్ దుడ్డుంపూడి) పై త‌న‌ బాబాయ్ (హర్ష వర్ధన్ ) ప్రభావితం ఎక్కువ‌. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటే అమ్మాయిలతో స్నేహం చేయడం మానేస్తాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగంలో చేరుతాడు. ఇంట్లో పెళ్లి చేసేయాలని నిర్ణయిస్తారు. అసలే అమ్మాయిలంటే భయం, చిరాగా వుండే అర్జున్ తనకు కావాల్సిన అమ్మాయిని అన్వేషించే క్రమంలో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కాన్సెప్ట్ ని ఎంచుకుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి దివ్య(మాళవిక సతీషన్) వస్తుంది. ఆమెకు దగ్గరైన అర్జున్ ఆ తరువాత అద్దె బాయ్ ఫ్రెండ్ కి, నిజమైన ప్రేమకి మధ్య సంఘర్షణకు లోనవుతాడు. అర్జున్ తాను కోరుకునే లక్షణాలతో వున్న అమ్మాయి దొరికిందా ? లేదా ? అనేది మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్లు: స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌
 • నిర్మాతలు: వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
 • సంగీతం: గోపీ సుందర్
 • సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి
 • పాటలు : రెహమాన్ , రాకేందు మౌళి
 • కొరియోగ్రాఫర్ : విజయ్ ప్రకాష్
 • ఎడిటర్ : విజయ్ వర్ధన్ కే

మూలాలు[మార్చు]

 1. Sakshi (10 October 2022). "'బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌'.. సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Archived from the original on 13 October 2022. Retrieved 13 October 2022.
 2. Mana Telangana (3 August 2019). "బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
 3. Sakshi (2 May 2021). "అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ దొరికితే." Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
 4. "'బాయ్‌ఫ్రెండ్ ఫ‌ర్ హైర్' రివ్యూ : బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకోవడం ఏంటి? సినిమా ఎలా ఉందంటే?". 14 October 2022. Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
 5. Deccan Chronicle (4 August 2019). "Viswant in a rom-com" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.