బాషా మహబూబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాషా మహబూబ్‌ తెలుగు కథా రచయిత. ఆయన వ్రాసిన కథ పలు భాషల్లోకి అనువదించబడి ఆయా ఇతర భాషా పత్రికలలో చోటు చేసుకుంది.

బాల్యము[మార్చు]

బాషా మహబూబ్‌ గుత్తి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 1952 మే 1 న గుత్తి రసూల్‌ బీ, గుత్తి నబీ రసూల్‌ దంపతులకు జన్మించారు .ఆయన బి.యస్సీ చదివారు. ఆయన ఫార్మాసూటికల్‌ కంపెనీలో ఏరియా సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

రచనా వ్యాసంగము[మార్చు]

తిలక్‌- చలంల కథలు-నవలల ప్రభావంతో సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. ఆ క్రమంలో 2003లో 'శాన్యంలోంచి శాన్యంలోకి' శీర్షికన రాసిన తొలి కథా 'రచన' మాసపత్రికలో ప్రచురితం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభంఅయ్యింది. ఆ క్రమంలో 2005లో రాసిన 'బెపాస్‌ రడర్స' కద తొలుత ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధలో ప్రచురితమై 'కథ-2005' కు ఎంపికయ్యింది. ఈ కథ పలు భాషల్లోకి అనువదించబడి ఆయా ఇతర భాషా పత్రికలలో చోటు చేసుకుంది.

రచనలు[మార్చు]

కథలు, కథానికలు, 'సగం మనిషి' (నవల). ప్రచురితమైనాయి.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647.

మూలాల జాబితా[మార్చు]