Jump to content

బిజ్జం పార్థసారథి రెడ్డి

వికీపీడియా నుండి
బిజ్జం పార్థసారథి రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
ముందు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
తరువాత కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963
చెన్నంపల్లె, ఔకు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

బిజ్జం పార్థసారథి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బిజ్జం పార్థసారథిరెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పై 21,246 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చేతిలో 4592 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

బిజ్జం పార్థసారథిరెడ్డి 2004 ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటూ ఉండి, 2019లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చి 4 ఏప్రిల్ 2019న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 April 2019). "వైఎస్సార్‌సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  2. HMTV (4 April 2019). "వైసీపీలో చేరిన పార్థసారధి రెడ్డి". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.