Jump to content

ఔకు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°13′01″N 78°07′01″E / 15.217°N 78.117°E / 15.217; 78.117
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°13′01″N 78°07′01″E / 15.217°N 78.117°E / 15.217; 78.117
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంఔకు
విస్తీర్ణం
 • మొత్తం476 కి.మీ2 (184 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం50,452
 • జనసాంద్రత110/కి.మీ2 (270/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి988


ఔకు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాలోని మండలం. ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] OSM గతిశీల పటం

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఔకు మండలం మొత్తం జనాభా 50,452. వీరిలో 25,381 మంది పురుషులు కాగా, 25,071 మంది మహిళలు ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఔకు మండల పరిధిలో మొత్తం 12,440 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండలం సగటు లింగ నిష్పత్తి 988.ఔకు మండల జనాభా మొత్తంలో 13.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 86.9% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 50.7% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 58.6%గా ఉంది. మండలంలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 934 కాగా, గ్రామీణ ప్రాంతాలు 996గా ఉంది.మండల పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5801, ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది.0-6 సంవత్సరాల మధ్య 3017 మంది మగ పిల్లలు, 2784 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఔకు మండలంలోని చైల్డ్ సెక్స్ నిష్పత్తి 923, ఇది ఔకు మండలం సగటు లింగ నిష్పత్తి 988 కంటే తక్కువ. ఔకు మండల మొత్తం అక్షరాస్యత రేటు 57.55%. పురుషుల అక్షరాస్యత రేటు 60.29%, స్త్రీల అక్షరాస్యత రేటు 41.45%గా ఉంది.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అన్నవరం
  2. చానుగొండ్ల
  3. చెన్నంపల్లె
  4. చెర్లపల్లె
  5. గుండ్ల సింగవరం
  6. జున్నూతల
  7. కునుకుంట్ల
  8. మెట్టుపల్లె
  9. నిచ్చెనమెట్ల
  10. ఔకు
  11. రామవరం
  12. సంగపట్నం
  13. సింగనపల్లె
  14. శివవరం
  15. సుంకేశుల
  16. ఉప్పలపాడు
  17. వజ్రగిరి
  18. వేములపాడు

శివారు లేదా రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. మన్నే నాయక్ తండా
  2. ఇశ్రానాయక్ తాండ
  3. కొందామానాయని పల్లి
  4. పీకర్ల పల్లి తండా
  5. మర్రికుంఠ తండా
  6. చిన్న కొట్టాల
  7. కోనాపురం
  8. పెద్దకొట్టాల
  9. గడ్డమేకల పల్లి
  10. లింగబోడు
  11. గోకుల దీన్నే
  12. కాశీ పురం
  13. బెలుం సింగవరం
  14. ఓబుళపురం
  15. మంగంపేట తాండ
  16. అలెబాద్ తాండ
  17. లక్ష్మి పల్లి
  18. మారేమాడుగుల
  19. చెన్ను గాని పల్లి

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. "Villages & Towns in Owk Mandal of Kurnool, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-04-24.
  4. "Owk Mandal Population, Religion, Caste Kurnool district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-04-24. Retrieved 2021-04-24.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఔకు_మండలం&oldid=4321175" నుండి వెలికితీశారు