కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
Katasani Ram Bhupal Reddy.jpeg
In office
23 మే 2019 – ప్రస్తుతం
Constituencyపాణ్యం
వ్యక్తిగత వివరాలు
జననం27 డిసెంబర్ 1959
గుండ్ల శింగవరం, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ
జీవిత భాగస్వామిఉమా మహేశ్వరి
సంతానంశివనరసింహ రెడ్డి, ఉషారాణి, దేదీప్యా రాణి, మాధవీలత
తల్లిదండ్రులుకె. నరసింహ రెడ్డి
నివాసంబనగానపల్లి
వృత్తిరాజకీయ నాయకుడు

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాణ్యం నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఎమ్మెల్యేగా పోటీ[మార్చు]

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981లో గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం ఆయన 1985, 1989,1994లో వరుసగా మూడుసార్లు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. [1]

అయన 1999లో ఓటమి పాలై, 2004, 2009లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాడు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయాడు, అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి 29 ఏప్రిల్, 2018న కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[2]

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పార్టీలో చేరిన తరువాత వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడై, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

సంవత్సరం విజేత పేరు పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
2019 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వైఎస్సార్సీపీ 122476 గౌరు చరితా రెడ్డి టీడీపీ 78619 43857 గెలుపు
2014 గౌరు చరితా రెడ్డి వైఎస్సార్సీపీ 72245 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి 60598 11647 ఓటమి
2009 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 63323 బైరెడ్డి రాజశేఖరరెడ్డి తె.దే.పా 54409 8914 గెలుపు
2004 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 63077 బిజ్జం పార్థసారథి రెడ్డి తె.దే.పా 59469 3582 గెలుపు
1999 బిజ్జం పార్థసారథి రెడ్డి తె.దే.పా 63333 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 42087 21246 ఓటమి
1994 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 72629 కె. చంద్రశేఖర రెడ్డి తె.దే.పా 35240 37389 గెలుపు
1989 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 55692 బిజ్జం సత్యనారాయణ రెడ్డి తె.దే.పా 40675 15017 గెలుపు
1985 కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 38712 బిజ్జం సత్యనారాయణ రెడ్డి తె.దే.పా 34653 4,059 గెలుపు

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 2 సెప్టెంబర్ 2021. Retrieved 2 September 2021. Check date values in: |archivedate= (help)
  2. Sakshi (30 April 2018). "వైఎస్సార్‌సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  3. One india (2019). "Panyam Election Result 2019 LIVE: Panyam MLA Election Result & Vote Share - Oneindia" (in ఇంగ్లీష్). Archived from the original on 2 సెప్టెంబర్ 2021. Retrieved 2 September 2021. Check date values in: |archivedate= (help)