బి. ఏ. యస్. ప్రొడక్షన్స్
స్వరూపం
బి.ఎ.సుబ్బారావు | |
|---|---|
| జననం | బుగట వెంకట సుబ్బారావు 1915 కాకినాడ |
| మరణం | మార్చి 13, 1987 |
| వృత్తి | దర్శకుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1950 - 1987 |
బి. ఏ. యస్. ప్రొడక్షన్స్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి బి. ఏ. సుబ్బారావు.
నిర్మించిన చిత్రాలు
[మార్చు]- పల్లెటూరి పిల్ల (1950)[1] : రామారావు, అక్కినేని కలసి నటించిన మొదటి సినిమా ఇది. బి. ఎ.సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ,సంగీతం పి.ఆదినారాయణరావు సమకూర్చారు. తాపీ ధర్మారావు మాటలు, పాటలు రాసారు.
- రాజు-పేద (1954) :మార్క్ ట్వేయిన్ నవలాధారిత హాలీవుడ్ చిత్రం ది ప్రిన్స్ అండ్ పాపర్ (1937)ను అనుసరించి ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రాన్ని 1957లో తమిళంలో ఆందీ పిట్రాసెల్వమ్ పేరుతో డబ్బింగ్ చేశారు. ఇదే చిత్రాన్ని హిందీలో రాజా అవుర్ రంక్‌గా కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఎల్.వి.ప్రసాద్ 1968లో పునర్నిర్మించాడు.
- రాణి రత్నప్రభ (1955) : నందమూరి తారక రామారావు, అంజలీదేవి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[2]
- చెంచులక్ష్మి (1958) : ఈ సినిమాలో మొదటి భాగంలో ప్రహ్లాదుని కథను, రెండవ భాగంలో చెంచులక్ష్మి కథను చూపారు. మొదటి భానుమతిని ఎంపిక చేశారు. తరువాత ఆ పాత్రకు అంజలీదేవిని తీసుకొన్నారు. ఈ సినిమా విడుదలైనపుడు విష్ణువు గెటప్‌లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలెండర్లను థియేటర్ల వద్ద అమ్మారు. ఈ సినిమాలో పాటలు జనప్రియమయ్యాయి.
- మైరావణ (1964 సినిమా) : ఈ చిత్రం లో కాంతారావు ,కృష్ణకుమారి నటించగా, సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
- భీష్మ (1962) :ఇది 1962లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి.అర్ భీష్మునిగా నటించారు.
- మోహినీ భస్మాసుర (1966)
మూలాలు
[మార్చు]- ↑ "Palleturi Pilla (1950)". Indiancine.ma. Retrieved 2025-11-17.
- ↑ "Rani Rathna Prabha (1960)". Indiancine.ma. Retrieved 2020-12-17.