Jump to content

బి. కె. ఎస్. అయ్యంగార్

వికీపీడియా నుండి
బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్
2004 లో తన 86 వ పుట్టినరోజు న అయ్యంగార్
జననం(1918-12-14)1918 డిసెంబరు 14
బెల్లూర్, (కోలార్ జిల్లా), బ్రిటిష్ భారతదేశం, (ప్రస్తుతం కర్ణాటక, భారతదేశం).
మరణం2014 ఆగస్టు 20(2014-08-20) (వయసు 95)
మరణ కారణంమూత్రపిండ వైఫల్యం, గుండె వైఫల్యం
ఇతర పేర్లుబి కె ఎస్ అయ్యంగార్.
వృత్తియోగ గురువు, రచయిత.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అయ్యంగార్ యోగ
జీవిత భాగస్వామిరామమణి
పిల్లలుగీతా అయ్యంగార్
ప్రశాంత్
సునీతా

బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్, (1918 డిసెంబరు 14 - 2014 ఆగస్టు 20) బి. కె. ఎస్. అయ్యంగార్ గా ప్రసిద్ధులు. ఈయన "అయ్యంగార్ యోగ" యోగ శైలి స్థాపకుడు. ఈయనను ప్రపంచంలో ఆధునిక యోగా ఉపాధ్యాయులలో ప్రథముడిగానూ, ప్రసిద్ధ గురువుగా భావిస్తారు.[1][2][3] ఈయన యోగ సాధన మీద, తత్వం మీద పలు పుస్తకాలు రచించాడు. వీటిలో లైట్ ఆన్ యోగా, లైట్ ఆన్ ప్రాణాయామ, లైట్ ఆన్ యోగ సూత్రాస్ ఆఫ్ పతంజలి, లైట్ ఆన్ లైఫ్ ముఖ్యమైనవి. ఆధునిక యోగా పితామహుడిగా భావించే తిరుమలై కృష్ణమాచార్య తొలితరం శిష్యులలో ఈయన కూడా ఒకడు.[4] యోగాను మొదట భారతదేశంలోనూ, తర్వాత విదేశాల్లోనూ బాగా ప్రచారం చేసిన వాడిగా ఈయనకు పేరుంది.[5]

1991 లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ, 2002 లో పద్మ భూషణ్, 2014 లో పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది.[6][7] 2004 లో టైం మ్యాగజీన్ ఈయనను అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది.[8][9]

తొలి రోజులు

[మార్చు]

ఈయన 1918 డిసెంబరు 14 న కోలార్ జిల్లాలోని బెల్లూర్ లో[10], ఒక పేద శ్రీవైష్ణవ అయ్యంగార్ కుటుంబంలో జన్మించాడు.[11] ఈయన తండ్రి కృష్ణమాచార్ ఒక బడి పంతులు. తల్లి శేషమ్మ.[12] ఆ తల్లిదండ్రులకు కలిగిన 13 మంది సంతానంలో ఈయన పదకొండో వాడు. ఈయనకు ఐదు సంవత్సరాల వయసు ఉండగా వీరి కుటుంబం బెంగుళూరుకు మారింది. నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన తండ్రిని మృత్యువు అపెండిసైటిస్ రూపంలో కబళించింది.

గ్రంథ పట్టిక

[మార్చు]

అయ్యంగార్ 1966 లో తన మొదటి పుస్తకం (Light on Yoga) ప్రచురించారు. ఈ పుస్తకం 17 భాషలలో అనువదించబడింది, 3 మిలియన్ ప్రతులు అమ్మారు.

  • బి. కె. ఎస్. అయ్యంగార్. (1966; revised ed. 1977). Light on Yoga. న్యూ యార్క్: స్చోకెన్. ISBN 978-0-8052-1031-6
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (1989). Light on Pranayama: The Yogic Art of Breathing. న్యూ యార్క్: క్రాస్ రోడ్. ISBN 0-8245-0686-3
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (1985). The Art of Yoga. బోస్టన్: అన్విన్. ISBN 978-0-04-149062-6
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (1988). The Tree of Yoga. బోస్టన్: శంభల. ISBN 0-87773-464-X
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (1996). Light on the Yoga Sutras of Patanjali. లండన్: తోర్సొంస్. ISBN 978-0-00-714516-4
  • బి. కె. ఎస్. అయ్యంగార్., Abrams, D. & Evans, J.J. (2005). Light on Life: The Yoga Journey to Wholeness, Inner Peace, and Ultimate Freedom. పెన్సిల్వేనియా:రోడెల్. ISBN 1-59486-248-6
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (2007). Yoga: The Path to Holistic Health.న్యూ యార్క్: డార్లింగ్ కిన్దేర్స్లేయ్. ISBN 978-0-7566-3362-2
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (8 Vols, 2000–2008). Astadala Yogamala: Collected Works. న్యూ ఢిల్లీ: అలైడ్ పబ్లిషర్స్.
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (2009). Yoga Wisdom and Practice.న్యూ యార్క్: డార్లింగ్ కిన్దేర్స్లేయ్. ISBN 0-7566-4283-3
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (2010). Yaugika Manas: Know and Realize the Yogic Mind. ముంబై: యోగ్. ISBN 81-87603-14-3
  • బి. కె. ఎస్. అయ్యంగార్. (2012). Core of the Yoga Sutras: The Definitive Guide to the Philosophy of Yoga. London: HarperThorsons. ISBN 978-0007921263

మూలాలు

[మార్చు]
  1. Jain, Andrea (2015). Selling Yoga: from Counterculture to Pop Culture. Oxford University Press. p. 66. ISBN 978-0-19-939024-3. OCLC 878953765.
  2. Aubrey, Allison. "Light on life: B.K.S. Iyengar's Yoga insights". NPR. Morning Edition, 10 November 1995. Retrieved 4 July 2007.
  3. Stukin, Stacie (10 October 2005). "Yogis gather around the guru". Los Angeles Times. Retrieved 9 January 2013.
  4. Iyengar, B. K. S. (2000). Astadala Yogamala. New Delhi: Allied Publishers. p. 53. ISBN 978-8177640465.
  5. Sjoman 1999, p. 41.
  6. "Ruskin Bond, Vidya Balan, Kamal Haasan honoured with Padma awards". Hindustan Times. HT Media Limited. 25 January 2014. Archived from the original on 25 January 2014. Retrieved 22 August 2014.
  7. "Padma Awards Announced". Press Information Bureau, Ministry of Home Affairs. 25 January 2014. Retrieved 26 January 2014.
  8. "2004 Time 100 – B.K.S. Iyengar". Time. 2004.
  9. Iyengar, B. K. S. "Yoga News & Trends – Light on Iyengar". Yoga Journal. Archived from the original on 31 August 2007. Retrieved 15 November 2012.
  10. Iyengar, B.K.S. (1991). Iyengar – His Life and Work. C.B.S. Publishers & Distributors. p. 3.
  11. "B. K. S. Iyengar Biography". Notablebiographies.com. Retrieved 26 December 2012.
  12. Iyengar, B.K.S. (2006). Light on Life: The Yoga Journey to Wholeness, Inner Peace, and Ultimate Freedom. USA: Rodale. pp. xvi–xx. ISBN 9781594865244. Retrieved 8 January 2013.