బి. రాధాబాయి ఆనందరావు
బి. రాధాబాయి ఆనందరావు B. Radhabai Ananda Rao | |||
![]()
| |||
పదవీ కాలం 1967 - 1984 | |||
తరువాత | సోడే రామయ్య | ||
---|---|---|---|
నియోజకవర్గం | భద్రాచలం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వెంకటాపురం, ఆంధ్ర పదేశ్ | 1930 ఫిబ్రవరి 2||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | బి.కె. ఆనందరావు | ||
సంతానం | 1 కొడుకు, 2 కుమార్తెలు | ||
మతం | హిందూమతం |
బి. రాధాబాయి ఆనందరావు (B. Radhabai Ananda Rao) తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు.
జననం, విద్య[మార్చు]
ఈమె ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో 1930 లో జన్మించింది. ఈమె రాజమండ్రి ట్యుటోరియల్ కళాశాలలోనూ, ఉపాధ్యాయుల శిక్షణా పాఠశాలలోనూ చదువుకున్నారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఈమె 1952 సంవత్సరం బి.కె.ఆనందరావును వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు.
రాజకీయ జీవితం[మార్చు]
ఈమె 4వ లోకసభ, 5వ లోకసభ, 6వ లోకసభ, 7వ లోకసభ లకు వరుసగా నాలుగుసార్లు భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా ఎన్నికై 1967 నుండి 1984 వరకు లోక్‍సభలో భద్రాచలానికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో ఈమె భారతీయ లోక్ దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తన సోదరి పి.వాణీ రమణారావుపై గెలుపొందటం విశేషం. 1984లో తిరిగి ఎన్నికలలో పోటీ చేసినా, సి.పి.ఐ అభ్యర్థి అయిన సోడే రామయ్య చేతిలో ఓడిపోయారు.
ఈమె సింగరేణి కాలరీలలో కుటుంబ నియంత్రణ కార్యకర్తగా 1957 నుండి 1967లో లోక్‍సభకు ఎన్నికయ్యే వరకు పది సంవత్సరాలు పనిచేసింది.