Jump to content

బీడీ

వికీపీడియా నుండి
(బీడి నుండి దారిమార్పు చెందింది)
బీడీ కంపెనీలు

బీడీ ఒక రకమైన దక్షిణ ఆసియా సిగరెట్టు. పొగాకు చుట్టూ బీడీ ఆకుల్ని (Diospyros melonoxylon) చుట్టి ఒక చివర దారంతో కట్టి ఈ బీడీలు తయారుచేస్తారు. బీడీలలో పొగాకు 10-20 శాతం వరకు ఉంటుంది. అయితే సిగరెట్టుతో పోలిస్తే బీడీల వలన నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తారు ఎక్కువగా శరీరంలోకి చేరుస్తుంది.[1] పొగాకు లాగా బీడీలు ఉపయోగించడం వలన కూడా వివిధ రకాల వ్యాధులు, కాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

బీడీ చుట్టడం భారతదేశంలో ఒక కుటీర పరిశ్రమ (cottage industry). సాధారణంగా గ్రామీణ స్త్రీలు వారివారి ఇండ్లలో వీటిని తయారుచేస్తారు. బీడీలలో చాలా రకాలున్నాయి. తయారైన రాష్ట్రాన్ని బట్టి, రుచిని బట్టి వాడకం ఆధారపడి ఉంటుంది. రుచులలో వెనీల, స్ట్రాబెర్రి, చక్ లేట్, మామిడి ముఖ్యమైనవి. సామాన్యంగా గుజరాత్, మైసూర్ రకాలు ఎక్కువమంది ఇష్టపడతారు.

సిగరెట్టుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు మూలంగా బీడీ తాగే అలవాటు ఎక్కువగా పేదలలో కనిపిస్తుంది. భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా, బంగ్లాదేశ్ దేశాలలో బీడీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్క భారతదేశంలోనే సుమారు 850 బిలియన్ బీడీలు తాగుతున్నారని అంచనా.

బీడీ ఆకుల సేకరణ ఆడవీ ప్రాంతాలలో నివసించే షెడ్యూల్ కులాలు, తెగల ప్రజల ఉపాధి కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.[2]

అభివృద్ధి చెందిన దేశాలలో కూడా 31 నుండి 58 శాతం పాఠశాల విద్యార్థులు బీడీలను రుచిచూసినట్లు అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని సర్వేలో తెలిసింది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బీడీ ఆకు చెట్టు

మూలాలు

[మార్చు]
  1. Bidis and Krekets Fact Sheet Archived 2010-03-05 at the Wayback Machine — Centers for Disease Control and Prevention, February 2007
  2. "Beedi Leaf Scheme of APFDC". Archived from the original on 2009-06-01. Retrieved 2008-12-23.
  3. Bidi Use Among Urban Youth Archived 2008-02-25 at the Wayback Machine — Massachusetts, March-April, 1999. Morbidity and Mortality Weekly Report September 17, 1999; 48(36):796–799.
"https://te.wikipedia.org/w/index.php?title=బీడీ&oldid=3879754" నుండి వెలికితీశారు