బీవీఆర్ మోహన్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బోదనపు వెంకట రామ మోహన్ రెడ్డి
బోదనపు వెంకట రామ మోహన్ రెడ్డికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
జననం (1950-10-12) 1950 అక్టోబరు 12 (వయసు 73)[1]
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
విద్యాసంస్థఆంధ్రా విశ్వవిద్యాలయం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్
మిచిగాన్ విశ్వవిద్యాలయం
వృత్తిసైయంట్ చైర్మన్ (గతంలో ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్)[2]
బోర్డు సభ్యులుసైయంట్
జీవిత భాగస్వామిసుచరిత [3]

బి. వి. ఆర్. మోహన్ రెడ్డి (జననం 1950) భారతీయ వ్యాపార కార్యనిర్వాహకుడు, ఇంజినీరింగ్ మేనేజర్. ఆయన సైయంట్(Cyient ) స్థాపించి[4], ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. 1974లో, డీసీఎమ్ గ్రూప్‌తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఎమ్ఐసీఓ బాష్, హెచ్​సీఎల్​, ఓఎమ్​సీ కంప్యూటర్స్ లిమిటెడ్‌ వంటివాటితో కలిసి పనిచేశాడు. ఆయన 2014-2015 వరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్‌) ఛైర్మన్‌గా కూడా వ్యవహరించిన ఆయన విజయవంతమైన వ్యాపార విశ్లేషకుడుగా ప్రసిద్ధిచెందాడు.[5]

ప్రారంభ జీవితం[మార్చు]

బీవీఆర్ మోహన్ రెడ్డి 1950 అక్టోబరు 12న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ లో జన్మించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందాడు.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.ఎస్సీ, గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ హానోరిస్ కాసా ఆయనను వరించాయి.[6]

కెరీర్[మార్చు]

డీసిఎమ్ గ్రూప్ షీరామ్ రిఫ్రిజిరేషన్ తో ఆయన కెరీర్ ప్రారంభించాడు, అక్కడ అతను డీజిల్ ఇంజిన్ ఉత్పత్తిలో అసెంబ్లీ లైన్ కార్యకలాపాలకు సహకరించాడు. ఆ తరువాత, ఆయన ఎమ్ఐసీఓ బాష్, హెచ్​సీఎల్​ లలో పనిచేశాడు. ఓఎమ్​సీ కంప్యూటర్స్ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ఎదిగాడు.[7] 1991లో, ఆయన ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌ని సైయంట్‌గా స్థాపించాడు. ప్రస్తుతం అతను ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.[8][9]

2003 నుండి ఆయన నాస్కామ్‌ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. 2008-2009 మధ్యకాలంలో, ఆయన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సౌత్ జోన్ ఛైర్మన్‌గా పనిచేసాడు. వివిధ అకడమిక్, ఇండస్ట్రీ ఫోరమ్‌ల కౌన్సిల్‌లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పారిశ్రమలు అభివృద్ధి చెందడానికి చేసిన అనేక కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించాడు. ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ గవర్నర్ల బోర్డు ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. అంతేకాకుండా, ఆయన ఎన్ఐఐటీ విశ్వవిద్యాలయం, నీమ్రానా బోర్డులో సభ్యుడు; హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సభ్యుడు.[10]

మూలాలు[మార్చు]

  1. "BVR Mohan Reddy". hyderabadangels.in. Archived from the original on 7 మే 2015. Retrieved 3 ఆగస్టు 2015.
  2. "Infotech chief exudes confidence on Seemandhra's future". The Hindu. 21 February 2014. Retrieved 3 August 2015.
  3. "P3Ps raise a toast to 29 years of German reunification". India Times. 13 November 2019. Retrieved 13 November 2019.
  4. "Infotech Enterprises turns Cyient". The Hindu. 7 May 2014. Retrieved 3 August 2015.
  5. "సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే |". web.archive.org. 2023-11-20. Archived from the original on 2023-11-20. Retrieved 2023-11-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "B V R Mohan Reddy". Indian Institute of Technology, Kanpur. Archived from the original on 27 February 2015. Retrieved 3 August 2015.
  7. "Mr. B. V. R. Mohan Reddy, Founder, CMD, Infotech Enterprises Limited". India Infoline News Service. 24 December 2010. Retrieved 3 August 2015.
  8. "Nasscom appoints B.V.R. Mohan Reddy as new chairman". 2015-04-09.
  9. "Cyient eyeing four firms as potential buys". 2014-06-04.
  10. "Cyient eyeing four firms as potential buys". 2014-06-04.