బూడిద గుమ్మడి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బూడిద గుమ్మడి | |
---|---|
Nearly mature winter melon | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | Benincasa |
Species: | B. hispida
|
Binomial name | |
Benincasa hispida | |
Synonyms | |
బూడిద గుమ్మడి, అనగా గుమ్మడిలో ఒక రకం. ఇది ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గట్టతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడి ని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్తాలు చేయ డానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు. దీన్నే పుల్లగుమ్మడి అని కుడా అంటాము.
ఉపయోగములు
[మార్చు]- పులుసులొ ముక్కలు
- వొడియాలు
- ఆయుర్వేదము
- ఉబ్బసము
- ఉదరకోశ వ్యాధులు (పురుగులు)
- వాయు సమస్య
- దిష్టి కోసము ఇల్లు ముందు వేలాడతీస్తారు
- విజయదశమి, గృహప్రవేశము లో కూడా దీన్ని వాడతారు
గుమ్మడి పంటలో రెండో రకం బూడిద గుమ్మడి. దీనికి మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. దీనిని ఎక్కువగా గుమ్మాలకు కట్టుకునేందుకు ప్రజలు ఉపయోగిస్తారు. అంతేగాక పెద్ద హోటళ్లల్లో పెరుగు పచ్చడికి దీన్ని మాత్రమే ఉపయోగిస్తుండటంతో భలే గిరాకీ ఉంది
ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం . సాధారణంగా బూడిద గుమ్మడి కాయ ఐదారు కిలోలు ఉండటం సహజం. అలాగే ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. దీనిని చవకరకం కూర అని అనుకోవడం పొరపాటు. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు.కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
అలాగే మలబద్దకంతో బాధపడే వాళ్ళు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుందట. అంతేకాదు ఈ విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిదగుమ్మడి తీగ రసాన్ని హై బి పి , నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. బూడిదగుమ్మడికాయ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు మాత్రమే. కానీ చలికాలంలో పిందె తొడిగి, వేసవి వరకూ పెద్ద పెద్ద కాయలు కాసే ఈ గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. అంతేకాదు, నీరు ఎక్కువుండే బూడిదగుమ్మడిలో కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో డైటింగ్ చేసే వారికి మంచి ఆహారము .
సైన్స్ విశిష్టతను తెలుపుతున్న బూడిద గుమ్మడి- - పురాణపండ రంగనాథ్ .
[మార్చు]బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు. కాని దానికి గల విశిష్టఔషధ గుణాలు గురించి చాలామందికి ఎక్కువగా తెలియదు. అందులో ప్రశస్తమైన ఔషధగుణాలు, పోషక లక్షణాలు ఉన్నాయి కనుకనే దానిని 'వైద్య కుష్మాండం' అని 'వైద్య కంబళం' అని ప్రశంసించే వారున్నారు.
అనేక ఆయుర్వేద మందులు
[మార్చు]సిద్ధవైద్య మందులు తయారీలో దీనిని త బాగా వాడతారు. బూడిద గుమ్మడి అనగానే మనకు ఒడియాలు, పేటా అనే స్వీట్‌ఠక్కున గుర్తుకు వస్తాయి. ఒడియాల రుచి ప్రశ స్తం. ఉత్తరాది మిఠాయి లలో పేటా ప్రముఖ మైనది. ఆగ్రా 'పేటా' మరీ పేరెన్నికగన్నది. హిందీలో బూడిద గుమ్మడిని 'పేటా' అని పిలుస్తారు. కన్నడం వారు తూడగుంబళ అంటారు. 'పుసినికారు' అని తమిళులు, 'కుంభలగా' అని కేరళీయులు పిలుస్తారు.
'వైద్య కుంబళం' అనే జాతి బూడిదగుమ్మడితో కేరళలో 'కూష్మాండ రసాయనం' అనే మందు చేస్తారు. ఇది పుష్టినిచ్చే ఔషధం. ఆరోగ్యవర్థని చక్కెర వ్యాధి చికిత్సలో వాడతారు. విరేచనకారి. వైద్యకుంబళం విత్తనాలు అరుదైనవి. ప్రశస్తమైనది. అందుకే వీటిని జాగ్రత్తపరచి రైతులకు ఇస్తుంటారు.
ఈ రకం బూడిదగుమ్మడి కాయలు ఆకుపచ్చగా, కోడిగుడ్డు ఆకారంలో ఉండి 750-1000 గ్రాముల బరువు తూగుతాయి. ఎర్రనేలలు, రేగడి నేలలు, ఈ పంటకు మేలైనవి. పాదుపెట్టిన 80-100 రోజులలో కాయలు కాస్తాయి. ఏడాది పొడవునా దీనిసాగు చేయవచ్చు. హెక్టారుకు 4 టన్నులవరకు కాయలుకాస్తాయి.
శాస్త్రీయ వర్గీకరణ :
[మార్చు]సామ్రాజ్యము: ప్లాంటే విభాగము: మాగ్నోలియోఫైటా తరగతి: మాగ్నోలియోప్సిడా వర్గము: Cucurbitales కుటుంబము: కుకుర్బిటేసి ఉపకుటుంబము: Cucurbitoideae Tribe: Benincaseae Subtribe: Benincasinae ప్రజాతి: Benincasa Savi జాతి: B. hispida