బెన్ ఎఫ్రాయిము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెనె ఎఫ్రాయిములు (హీబ్రూ: בני אפרים) Bnei Ephraim ("ఎఫ్రాయిం వంశీయులు"), వారు తెలుగు మాట్లాడే కారణంగా తెలుగు యూదులు అని కూడా పిలుస్తారు. వీరు ప్రధానంగా చేబ్రోలు, గుంటూరు జిల్లా వెలుపల కొత్త రెడ్డి పాలెంలో, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, కృష్ణా నది డెల్టా సమీపంలో మచిలీపట్నంలో నివసిస్తున్నారు.[1] వారు ఎఫ్రాయిమ్ గోత్రానికి చెందిన వారని, పది కోల్పోయిన గాత్రాలకు చెందిన వారని, 1980 నుండి ఆధునిక జుడాయిజాన్ని ఆచరించడం నేర్చుకున్నారు.[2]

చరిత్ర

[మార్చు]

బెనె ఎఫ్రాయిములు తాము ఎఫ్రాయిము వంశస్తులుం అని వాదిస్తారు. ఇశ్రాయేలు నుంచి పాశ్చాత్య ఆసియాలో (అంటే ఇరాన్, అఫ్ఘానిస్థాన్, తిబత్, చీనాలలో) పదహారు వందల సంవత్సరాలు తిరుగుతూ వెళ్లి, వెయ్యేళ్ళ కంటే ముందు దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు.[3] వాళ్ల చరిత్ర మిజోరాం, మణిపూర్లో ఉన్న బెనె మ్నాషె యూదుల చరిత్రలాగా ఉంటుంది.

మధ్యయుగంలో వాళ్లు రైతులుగా పని చేసే వాళ్లు. అంతకు ముందు యూదుమతాన్ని ఆచరించినా, 19వ శతాబ్దంలో వచ్చిన బ్రిటిష్ బేప్టిస్ట్ మతప్రచారకుల ప్రోత్సాహం వల్ల క్రైస్తవ మతం స్వీకరించారు.[3]

వాళ్ల నాయకుడు, ష్ముయెల్ యాకొబీ, 1980 దశాబ్దంలో యెరూషలేంకి వెళ్లి వాళ్లది యూదువంశమే అని నమ్మారు.[3]

1980 దశాబ్దం నుండి, కొత్త రెడ్డి పాలేంలో సుమారు 50 కుటుంబాలు యూదు మతం గురించి చదువుకుని, హీబ్రూ భాష నేర్చుకుని, ఒక సినగోగ్ని స్థాపించారు. యూదు పండుగలన్నీ జరుపుకుంటారు. తోరాహ్ గ్రంథాన్ని హీబ్రూ లో చదువుతారు. ఈ మధ్య హీబ్రూ భాష ప్రార్థనాల్లో మాత్రమే కాకుండా, వాడుక భాషలో కూడా వినిపిస్తుంది. రబ్బీలు (యూదు గురువులు) ఈ సంఘానికి వచ్చి వాళ్ల సంప్రదాయాలు చూశారు. ఇశ్రాయేల్లో, రబ్బనూత్ నుండి బెన్ ఎఫ్రాయిములకి హలాఖా (యూదు మత స్మృతి) ప్రకారం వాళ్ళు యూదులని ఇంకా గుర్తింపు రాలేదు.[1]

చూడండి

[మార్చు]
  • ఆంధ్ర ప్రదేశ్
  • Bnei Menashe
  • History of the Jews in India
  • Shavei Israel
  • [Amaravati Museum]
  • [Buddhist Museum, Guntur]
  • [Ministry of Communications, Government of India about Cretan origins of Telugu people]
  • [History of Andhra Pradesh, Semitic links - Thesis by Dr. T. Bhaskar Rao, A.C. College, Guntur]
  • [Telugu Historian Dr. B.S.N. Hanumantha Rao]
  • [Manamevaru - History of Telugu People - published by Hebrew Open University Study Center - By Shmuel Yacobi]
  • [The Ten Commandments Constitution - Thesis by Dr. Chilaka Abraham submitted to A.N. University, Guntur]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 యాకోబి, సడోక్. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Yacobi" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; http://www.academia.edu/1849132/The_Children_of_Ephraim_being_Jewishinrad_Per అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 3.2 Shaikh Azizur Rahman, "Another tribe seeks rabbinical recognition", Washington Times, 1 May 2006, accessed 16 May 2013

వనరులు

[మార్చు]
  • Francisco, Jason L., "Meet the Telugu Jews of India", Kulanu website
  • Sussman, Bonita & Gerald., "India Journal", 2007, Kulanu website
  • Indian Jews, Kulanu Website index.
  • Tudor Parfitt (2002), "The Lemba: An African Judaising Tribe", in Judaising Movements: Studies in the Margins of Judaism, edited by Parfitt, Tudor and Trevisan-Semi, E., London: Routledge Curzon.
  • Shmuel Yacobi, THE CULTURAL HERMENEUTICS, an introduction to the cultural translation of the Hebrew Bible among the ancient nations of the Thalmulic Telugu Empire of India.
  • Shmuel Yacobi, Manamevaru, Ereb Rab Telugu people and their links with Israel.
  • Chilaka Abraham, Ten Commandments Constitution - A Sociological study - A.N. University, Guntur.
  • Ministry of Interior, Israel, Rabbi Marvin Tokayer U.S - Letters to Shmuel Yacobi, member of Bene Ephraim Community