బైరం ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైరం ఖాన్
The submission of Bairam Khan, 1560.
Regent of the Mughal Emperor
In office
1556–1560[1]
చక్రవర్తిAkbar
వ్యక్తిగత వివరాలు
జననంసుమారు 1501[2]
Badakhshan
మరణం1561 జనవరి 31(1561-01-31) (వయసు 59–60)
Patan, Gujarat, (modern-day India)
జీవిత భాగస్వామిJamal Khan's daughter (m. 1554–1561)[3][better source needed][4][better source needed]
Salima Sultan Begum (m. 1557–1561)[5]మూస:Npsn
సంతానంAbdul Rahim
నైపుణ్యంChief advisor of Akbar, Military commander and commander-in-chief of Mughal army and Mughal Statesman
Military service
AllegianceMughal Empire
Years of servicec. 1517-1561
CommandsMughal Army
Battles/warsBattle of Khanwa
Battle of Ghaghra
Siege of Sambhal
Second Battle of Panipat

బైరం ఖాన్ (బేరం ఖాన్) (సా.శ1501 జనవరి 18 - 1561 జనవరి 31 జనవరి 31) ఒక ముఖ్యమైన సైనికాధికారి తరువాత మొఘల్ సైన్యంలో సైన్యాధ్యక్షుడు మొఘల్ చక్రవర్తుల ప్రతినిధి హుమాయూన్, అక్బర్. ఆయన సంరక్షకుడుగా, ప్రధాన గురువుగా, సలహాదారుగా, అక్బర్ చక్రవర్తికి అత్యంత విశ్వసనీయ మిత్రుడుగా ఉండేవాడు.[6] హుమాయున్ అతనిని ఖాన్-ఐ-ఖాన్న్ అని "కింగ్స్ ఆఫ్ కింగ్" అని గౌరవించాడు. బైరం వాస్తవానికి బైరం "బెగ్" అని పిలిచేవారు. కానీ తర్వాత 'ఖా' లేదా ఖానుగా గౌరవించారు.[7][8] బైరమ్ ఖాన్ సైన్యాధ్యక్షుడుగా పనిచేస్తూ మొఘల్ సామ్రాజ్యం మీద చక్రవర్తి అధికారాన్ని పునరుద్ధరించాలని తీవ్రంగా కృషిచేసాడు.[6]

ఆరంభకాల జీవితం, పూర్వీకులు[మార్చు]

బైరమ్ ఖాన్ సెంట్రల్ ఆసియాలో బాదాఖ్షాన్ ప్రాంతంలో జన్మించాడు. కారా కయాజుల్ సమాఖ్య బహర్లూ టర్కుమాన్ వంశానికి చెందినవాడు. [9][10]కారా కొయూన్లూ పశ్చిపర్షియాను కొన్ని దశాబ్ధాలుగా పాలించారు. తరువాత ప్రత్యర్థులైన అక్ కొయూన్లు వారిని పడగొట్టి అధికారం చేపట్టారు. బైరమ్ ఖాన్ తండ్రి సెయ్ఫాలి బాహర్లూ, తాత జనాలీ బెగ్, బాబర్ కొలువులో పనిచేసారు.[7] ఆయన ముత్తాత పిరాలి బెగ్ బహర్లూ బాబర్ భార్య పాషా బేగానికి సోదరుడు,[11] కరా ఇస్కాండరు అల్లుడు.[12]

సైనిక సేవ[మార్చు]

16 సంవత్సరాల వయస్సులో బాబర్ సేవలోకి ప్రవేశించి భారతదేశపు మొఘల్ విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు.[13] బైరమ్ ఖాన్ హుమాయూన్ ఆధ్వర్యంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించటానికి గొప్పగా సహకరించాడు. ఆయన ముహార్దారు (ముద్రల నిర్వహణ) స్థానానికి అప్పగించబడ్డాడు. అలాగే బెనారసు, బెంగాలు, గుజరాతులలో సైనిక పోరాటంలో పాల్గొన్నాడు.[13] హుమాయూన్ పర్షియాలో ప్రవాసవాసం చేస్తున్న సమయంలో తొమ్మిది సంవత్సరాలకాలం వెంట ఉన్నాడు. 1556 లో తరువాత హుమాయూన్ కాందహారు జయించడానికి సహాయంగా ఉన్నాడు. తరువాత దానికి గవర్నరుగా పనిచేసాడు. హుమాయున్ హిందూస్థానును తిరిగి స్వాధీనం చేసుకొన్న తరువాత సైన్యాధ్యక్షునిగా ముఖ్య పాత్రను పోషించాడు.[14] 1556 లో హుమాయున్ మరణం తరువాత బైరాం ఖాన్ యువ చక్రవర్తి అక్బరు వద్ద ప్రతినిధిగా నియమించబడ్డాడు. ఉత్తర భారతదేశంలో ఆయన మొఘల్ అధికారాన్ని ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా రెండవ పానిపట్టు యుద్ధంలో మొఘలు దళాలను నాయకత్వం వహించాడు. పానిపట్టు యుద్ధంలో 1556 నవంబరులో అక్బర్ హేముల మధ్య జరిగింది.

తరువాత జీవితం[మార్చు]

భైరం ఖాను షియా ముస్లిం. ఆయన టర్కీ సున్నీ ముస్లిం కులీనుల పట్ల అయిష్టత ప్రదర్శించేవాడు.[15] షియా ముస్లిం అయినప్పటికీ శుక్రవారం సేవలకు మాసీదుకు హాజరు అయ్యేవాడు, షాహ్ గడా (సికిందర్ లోడి సభలో కవిగా ఉన్న జమాలి ఖాంబొ కుమారుడు) బాధ్యత వహించేవాడు. 1555 లో హుమాయూను ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత " సదర్ అస్ సుదర్ " అయ్యాడు. [16]

వివాహాలు[మార్చు]

ఉల్యుర్ గెజిటర్ చెప్పింది:

బాబర్ మరణం తర్వాత వారసుడైన హుమయూనును సా.శ 1540 లో షేర్ షా పడగొట్టాడు. షేర్ షా మరణం తరువాత సా.శ 1545 లో ఇస్లాం షా వారసుడయ్యాడు. తరువాతి కాలంలో యుద్ధం మెవత్ లోని ఫిరోజ్పూర్ ఝిర్కా వద్ద చక్రవర్తి దళాలు చేసిన పోరాటంలో ఇస్లాం షా మేవతును కోల్పోయినప్పటికీ ఇస్లాం షా అతని సాంరాజ్యం మీద పట్టు కోల్పోలేదు. సా.శ 1552 లో లో సూరి వంశానికి చెందిన మూడవ వారసుని చంపి అడిల్ షా సామ్రాజ్యం కోసం తిరిగి వచ్చిన హుమయూనుతో పోటీ పడవలసి వచ్చింది.[17]

బాబర్ రాజవంశం పునరుద్ధరణకు సంబంధించి ఈ పోరాటాలలో స్పష్టంగా కనిపించలేదు. హుమాయున్ బాబర్ ప్రత్యర్థి హసన్ ఖాన్ మేవాటి మేనల్లుడు జమాల్ ఖాను పెద్ద కుమార్తెని వివాహం చేసుకున్నాడు. హుమాయూన్ మంత్రి బైరం ఖాన్ జమాల్ చిన్న కుమార్తెను వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.[18] భైరం ఇతర భార్య సలీమా సుల్తాన్ అతని మరణం తరువాత అక్బరును వివాహం చేసుకున్నది.[19]

మరణం[మార్చు]

Bairam Khan is assassinated by an Afghan at Patan, 1561, Akbarnama

బైరం ఖానుతో అభిప్రాయంలో తేడాలు ఉన్నందున అక్బరు తనకు విశ్రాంతి ఇవ్వడం, రాజభవనంలో నివసించడం, హజ్ తీర్ధయాత్ర కొరకు మక్కకు వెళ్ళవచ్చని చెప్పాడు. వెళుతుండగా అతని ప్రత్యర్థులు ఆయనను చేజిక్కించుకున్నారు.[20] ఆయన పంజాబులో వారిని ఓడించాడు. అక్బరు ఆయనకు సలహాదారుడిగా కొనసాగడమో లేదా తన తీర్థయాత్రను కొనసాగించడమో నిర్ణయించుకోవచ్చని ఆదేశించాడు. బైరం ఖాను తరువాతి హజ్ యాత్ర కొనసాగించుకోవాలని ఎంచుకున్నాడు.[21] యాత్ర కొరకు గుజరాతు గుండా ప్రయాణిస్తున్నప్పుడు అతను చంపబడ్డాడు.[22] బైరం ఖాను అహ్శిల్వాద్ పటాన్ సమీపంలోని ఒక మతప్రాధాన్యత కలిగిన ప్రదేశమైన సహస్త్రలిగే కొలనులో ఉన్నసమయంలో హాజీ ఖాను మేవాటి సహచరుడైన లోహని పష్టున్ గుర్తించాడు. దీని గురించి తెలుసుకున్న తరువాత హాజీ ఖాను చక్రవర్తి హేము మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బైరం ఖాను మీద దాడి చేసి చంపాడు. హాజీ ఖాను మేవార్టి (ఆల్వారు) హేము వద్ద సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. 1559 లో అక్బరు దళాలు హాజీ ఖానును ఓడించి అల్వారు సర్కారును పట్టుకున్న తరువాత హజీ ఖాను గుజరాతు లోన్ పటానులో ఉన్నాడు.

బైరాం ఖాను 1561 జనవరి 31 న మరణించాడు. ఆయన కొడుకు భార్యను ఆగ్రాకు పంపబడ్డారు. బైరాం ఖాను భార్య అక్బరు బంధువు. బైరం ఖాను మరణం తరువాత అక్బరు అమెను వివాహం చేసుకున్నాడు. బైరం కుమారుడు అబ్దుల్ రహీం ఖాన్-ఐ-ఖానా అక్బరు పరిపాలనలో ముఖ్యమైన భాగంగా మారాడు. అక్బరు సభలో నవరత్నలలో (తొమ్మిది రత్నాలు)ఆయన ఒకడు.

మూలాలు[మార్చు]

  1. Chandra, Satish (2005). Medieval India : from Sultanat to the Mughals (Revised ed.). New Delhi: Har-Anand Publications. p. 95. ISBN 9788124110669.
  2. "The Indian Historical Quarterly" (in ఇంగ్లీష్). 25–26. Calcutta Oriental Press. 1949: 318. Retrieved 13 ఆగస్టు 2017. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. "Bibliotheca Indica" (in ఇంగ్లీష్). 202. Baptist Mission Press. 1848. Retrieved 13 ఆగస్టు 2017. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. Cunningham, Sir Alexander (1885). Report of a Tour in Eastern Rajputana in 1882-83 (in ఇంగ్లీష్). Office of the Superintendent of Government Printing. p. 21.
  5. (Begam), Gulbadan (1974). Humāyūn-nāma (in ఇంగ్లీష్). Sange-Meel Publications distributors, Islamic Book Service. p. 57.
  6. 6.0 6.1 Mikaberidze, Alexander (2011). Conflict and Conquest in the Islamic World a Historical Encyclopedia. Santa Barbara: ABC-CLIO. p. 707. ISBN 9781598843378.
  7. 7.0 7.1 Thackston, Wheeler M. (2002) The Baburnama: Memoirs of Babur, Prince and Emperor The Modern Library, New York, p.xix, ISBN 0-375-76137-3
  8. Ahmed, Humayun,(2011) Badsha Namdar, National Library, Dhaka, pp.200-233. ISBN 978-984-502-017-6
  9. Schimmel 1980, p. 77. sfn error: multiple targets (2×): CITEREFSchimmel1980 (help)
  10. Ansari 1989, pp. 3–5.
  11. Baburnama (PDF). p. 251.
  12. "Baharlı soyadının ilk daşıyıcısı". Azadliq (in అజర్బైజాని). Retrieved 6 మే 2017.
  13. 13.0 13.1 Ray, Sukumar & Beg, M.H.A. (1992) Bairam Khan, Mirza Beg, 1992, page 11, ISBN 969-8120-01-7
  14. Ray, Sukumar & Beg, M.H.A. (1992) Bairam Khan, Mirza Beg, 1992, page 27, ISBN 969-8120-01-7
  15. Richards, John F. (1993). The Mughal Empire. The New Cambridge History of India Location=Cambridge, England. Cambridge University Press. p. 13. ISBN 978-0-521-25119-8.
  16. Schimmel, Annemarie (1980). Handbuch der Orientalistik. Leiden: Brill. p. 77. ISBN 9789004061170.
  17. Full text of "The Imperial Gazetteer of India, Volume- XXI. Retrieved 11 జనవరి 2014.
  18. https://archive.org/stream/gazetteerofulwur00powliala#page/8/mode/2up (pages 7 + 8)
  19. Gulbadan, Begam; Beveridge, Annette S. (1972). The history of Humayun = Humayun-nama (in ఇంగ్లీష్). Begam Gulbadam. p. 278.
  20. Chandra 2007, p. 227
  21. Rahim-Abdul Rahim Khankhanan at Indiagrid Archived 13 జూలై 2011 at the Wayback Machine
  22. Bose, Mandakranta, ed. (2000). Faces of the Feminine in Ancient, Medieval, and Modern India. New York: Oxford University Press. p. 205. ISBN 978-0-19-512229-9.

ఇంగ్లీషు[మార్చు]

  • Singh, Damodar (2003) Khan-i-Khanan Bairam Khan: a political biography Janaki Prakashan, Patna, India, OCLC 54054058
  • Shashi, Shyam Singh (1999) Bairam Khan : soldier and administrator (Series Encyclopaedia Indica volume 58) Anmol Publishing, New Delhi, India, OCLC 247186335
  • Pandey, Ram Kishore (1998) Life and achievements of Muhammad Bairam Khan Turkoman Prakash Book Depot, Bareilly, India, OCLC 5007653.
  • Ray, Sukumar (1992) Bairam Khan Institute of Central and West Asian Studies, University of Karachi, Karachi, Pakistan, OCLC 29564939.

హిందీ[మార్చు]

  • Agravāla, Sushamā Devī (1994) Bairamakhām̐ aura usake vaṃśaja kā Mugala sāmrājya meṃ yogadāna Rāmānanda Vidyā Bhavana, New Delhi, India, OCLC 34118191, in Hindi. (Contribution of Bairam Khan, 1524?-1561, Mogul nobleman, to the Mogul Empire.)
  • Devīprasāda, Munśī (2001) Khānakhānā nāmā Pratibhā Pratishṭhāna, New Delhi, India, ISBN 81-85827-89-3, in Hindi. (On the life and achievements of Bairam Khan, 1524?-1561, ruler in the Mogul Empire and Khane Khana Abdul Rahim Khan, 1556–1627, Braj poet.)

బెంగాలీ[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బైరం_ఖాన్&oldid=3818259" నుండి వెలికితీశారు