బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) చైర్మన్‌ [1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 జులై 2021 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 02 మార్చి 1993
ముచ్చుమర్రి , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఉషారాణి , డా. బైరెడ్డి మల్లికార్జునరెడ్డి
బంధువులు బైరెడ్డి శేషశయనారెడ్డి (తాత) , బైరెడ్డి రాజశేఖరరెడ్డి (పెదనాన్న)

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) ఛైర్మన్‌గా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి 02 మార్చి 1993లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, పగిడ్యాల మండలం, ముచ్చుమర్రి గ్రామంలో డా. బైరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఉషా దంపతులకు జన్మించాడు. ఆయన కడపలోని విద్య మందిర్ లో 10వ తరగతి పూర్తి చేసి, హైదరాబాద్సి సిబిఐటి బి.టెక్ లో చేరి ఇంజనీరింగ్ లో మధ్యలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. ఆయన తాత బైరెడ్డి శేషశయనారెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా, బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా పని చేశారు.[2] ఆయన పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి తో కలిసి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి,ఆయన 2019 ఎన్నికల ముందు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జ్‌గా పని చేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ అయిన నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 2021లో జరిగిన గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తన స్వగ్రామమైన పాత ముచ్చుమ‌ర్రి పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా ఆంజ‌నేయులు 831 ఓట్లు, కొత్త ముచ్చుమ‌ర్రి స‌ర్పంచ్‌గా రాధ‌మ్మ 650 ఓట్ల మెజార్టీతో గెలవడంలో కీలకంగా పని చేశాడు.

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డిని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) ఛైర్మన్‌గా నియమిస్తూ 17 జులై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.[3]ఆయన క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, నీటివనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో చైర్మన్‌గా 6 ఆగష్టు 2021న ప్రమాణస్వీకారం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి (18 July 2021). "శాప్‌ చైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డి". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  2. Sakshi (16 July 2016). "మాజీ మంత్రికి కన్నీటి వీడ్కోలు". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  3. 10TV (17 July 2021). "శాప్ ఛైర్మన్‌గా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి" (in telugu). Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sakshi (6 August 2021). "సీఎం జగన్‌ నమ్మకాన్ని నిలబెడతా: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి". Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.