బొడిగె శోభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొడిగె శోభ

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2018
ముందు సుద్దాల దేవయ్య
తరువాత సుంకే ర‌విశంక‌ర్

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం చొప్పదండి

వ్యక్తిగత వివరాలు

జననం (1974-06-09) 1974 జూన్ 9 (వయసు 49)
పాత కరీంనగర్ జిల్లా, ఎల్కతుర్తి మండలం , దామెర
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
తల్లిదండ్రులు సాతూరి రత్నం, భాగ్యలక్ష్మి
జీవిత భాగస్వామి బొడిగె గాలన్న
సంతానం దివ్య, వికాస్
నివాసం కోతిరాంపూర్, కరీంనగర్

బొడిగె శోభ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బొడిగె శోభ 1974 జూన్ 9 న తెలంగాణ రాష్ట్రం, పాత కరీంనగర్ జిల్లా, ఎల్కతుర్తి మండలం, దామెర గ్రామంలో సాతూరి రత్నం, భాగ్యలక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె పదో తరగతి వరకు వరంగల్ లోని కంచరగుంట ప్రభుత్వ పాఠశాలలో చదివి, కొన్ని కారణాల వల్ల ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసింది. ఆమెకు 16 వయస్సులో బొడిగె గాలన్నతో వివాహం జరిగింది. వారికీ దివ్య, వికాస్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

బొడిగె శోభ 1990 దశకంలో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. ఆమె 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాజన ఫ్రంట్ (వీరన్న వర్గం) నుంచి కమల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదర్‌గూడ లోని 49వ నెంబర్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్రకార్యాలయం సమీపంలోని జలదృశ్యంలో జయశంకర్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లింది. ఆ సమావేశం అనంతరం ఆమె, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.

బొడిగె శోభ కరీంనగర్ జిల్లా శంకరపట్నం జెడ్‌పీటీసీగా పోటీ చేసి గెలిచింది. ఆమెను 2009 నుండి చొప్పదండి శాసనసభ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా టిఆర్ఎస్ పార్టీ నియమించింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుద్దాల దేవయ్య పై 54781 ఓట్ల మెజారిటీతో గెలిచి కరీంనగర్ జిల్లా నుంచి శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించింది.[2][3] 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో 2018 నవంబరు 15 న భారతీయ జనతా పార్టీలో చేరింది.[4][5] 2018, 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయింది.[6][7]

మూలాలు[మార్చు]

  1. Eenadu (23 October 2023). "కీలక నేతలకు ప్రాధాన్యం సామాజిక సమీకరణం". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Result University (2014). "Choppadandi Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  3. Election Commission of India (2014). "Statistical Reports of 2014 Assembly Elections held in Telangana" (PDF). Archived from the original (PDF) on 18 January 2024. Retrieved 18 January 2024.
  4. The News Minute (15 November 2018). "Denied TRS ticket for Telangana polls, MLA Bodiga Shobha defects to BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  5. Sakshi (16 November 2018). "బీజేపీలోకి బొడిగె శోభ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  6. News18 (2018). "Choppadandi Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (16 December 2023). "కీలక నేతలకు ప్రాధాన్యం సామాజిక సమీకరణం". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.