Jump to content

బొబ్బిలి పట్టాభిషేకం

వికీపీడియా నుండి

బొబ్బిలి పట్టాభిషేకం తిరుపతి వేంకట కవులు రచించిన కావ్యం. బొబ్బిలి రాజావారు శ్రీ శ్వేతాచలపతి రంగారావు స్వయంగా వీరిని పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానించి, మహోత్సవంపై కావ్యాన్ని వినిపించమని అర్ధించారు.

కృతిని మహారాజు గారికి అంకితమిస్తూ:

సంకల్ప సిద్ధుడవు నీ
కొంకొకడాశీర్వదింప నేటిని నీ స
త్సంకల్పమ్ములు సిద్ధిన
లంకృతములు గా నెసగి చెలంగుట మెపుడున్ (ప.25)

ఆశ్వాసాలు

[మార్చు]

కావ్యములో నాలుగు ఆశ్వాసాలున్నాయి.

ప్రథమాశ్వాసంలో బొబ్బిలిని పరిపాలించిన రావు వంశీయుల చరితం వర్ణించబడినది. దీనిలో బొబ్బిలి రాజుల వైభవం, విశిష్ట్యం వర్ణించబడ్డాయి.

ద్వితీయాశ్వాసంలో బొబ్బిలిలో జరిగిన పట్టాభిషేకోత్సవపు సన్నాహాలు, సంరంభాలు వర్ణించబడ్డాయి. దీనిలో ఆనాటి జమిందారుల ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు ప్రకటించారు.

తృతీయాశ్వాసంలో పట్టాభిషేకోత్సవ సంరంభం గుణగనాదులు రాజు చేసిన ప్రజాహిత కార్యాలు యథోచితంగా వర్ణింపబడ్డాయి.

చతుర్థాశ్వాసంలో శ్వేతాచలపతి రంగారావు సర్వతోముఖ ప్రజ్ఞను వర్ణించారు.