బొల్లా బ్రహ్మనాయుడు
| బొల్లా బ్రహ్మనాయుడు | |||
ఎమ్మెల్యే | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 - 2024 | |||
| ముందు | జీ.వి. ఆంజనేయులు | ||
|---|---|---|---|
| తరువాత | జీ.వి. ఆంజనేయులు | ||
| నియోజకవర్గం | వినుకొండ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1957 వేల్పూరు, శావల్యాపురం మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | హనుమయ్య, మాణిక్యమ్మ | ||
| జీవిత భాగస్వామి | ఆదిలక్ష్మి | ||
| సంతానం | పోట్ల మణికుమారి, శ్రీనివాసరావు, గిరిబాబు | ||
బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జననం
[మార్చు]బొల్లా బ్రహ్మనాయుడు 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, శావల్యాపురం మండలం, వేల్పూరు గ్రామంలో హనుమయ్య, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]బొల్లా బ్రహ్మనాయుడు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి 2004 తిరుమల డెయిరీని, తిరుమల ఇంజినీరింగ్ కళాశాల, తిరుమల ఆక్స్‌ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట విద్యాసంస్థలను స్థాపించాడు . ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
బొల్లా బ్రహ్మనాయుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడంతో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి 28,628 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4] బొల్లా బ్రహ్మనాయుడు 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". ఒరిజినల్ నుండి 2 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2021.
- ↑ Sakshi (19 March 2019). "గుంటూరు జిల్లా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా." the original నుండి 2021-09-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 December 2021.
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". ఒరిజినల్ నుండి 8 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2021.
- ↑ Sakshi (2019). "Vinukonda Constituency Winner List in AP Elections 2019 | Vinukonda Constituency Election Results 2019". the original నుండి 3 December 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "Andhrapradesh Assembly Elections 2024 - Vinukonda". the original నుండి 13 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 November 2024.