బొల్లినేని వెంకట రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొల్లినేని వెంకట రామారావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, శాసనసభ్యుడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ఇతను నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఫోటీ చేసి సమీప యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పత్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి పై 3622 ఓట్ల మెజారిటీ సాధించి శాసనసభ్యునిగా గెలుపొందాడు.[2] 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయాడు. [3] 2012 ఉదయగిరి శాసనసభ నియోజక వర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పెద్దపాడు వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. అతని తండ్రి బొల్లినేని కొండయ్యనాయుడు. అతను రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికి మహరాష్ట్రలో కాంట్రాక్టరుగా స్థిరపడ్డాడు. అయితే పుట్టిన గడ్డపై మమకారంతో ఈ ప్రాంతానికి తనవంతు సేవ చేయాలనే తలంపుతో రాజాకీయాల్లోకి అడుగుపెట్టి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 2014సార్వత్రిక ఎన్నికల్లో మేకపాటిపై 3,622 ఓట్ల మెజార్టీతో బొల్లినేని విజయం సాధించాడు. ప్రతి విషయంపై పీఏలపైనో ద్వితీయ నాయకత్వంపైనే ఆధారపడటం వలన పార్టీకి వీరవిధేయులు,నిజమైన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు దూరమైపోయి చివరకు సొంత మండలంలో మెజారిటీ తెచ్చుకోలేకపోయాడు. ఎమ్మెల్యే గెలుపునకు నిరంతరాయంగా కష్టించి పనిచేసిన వారిని దూరంగా పెట్టడాన్ని జీర్ణించుకోలేని నాయకులు తమను నమ్ముకున్న అనుచరుల కోసం బొల్లినేనిని వీడి వెళ్లిపోయారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో నియోజకవర్గానికి అభివృద్ధి చేసినా అది ఫలితం ఇవ్వలేదు.[5]

మూలాలు[మార్చు]

  1. "Bollineni Venkata Ramarao (TDP):Constituency- UDAYAGIRI(NELLORE) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2020-07-12.
  2. "Andhra Pradesh Assembly Election Results in 2014". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2020-07-12.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2020-07-12.
  5. "ఈ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నమ్మినోళ్లే నట్టేట ముంచేశారు!". www.andhrajyothy.com. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-12.