Jump to content

బ్రిజేంద్ర సింగ్

వికీపీడియా నుండి
బ్రిజేంద్ర సింగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - 2024
ముందు దుష్యంత్ చౌతాలా
తరువాత జై ప్రకాష్
నియోజకవర్గం హిసార్

వ్యక్తిగత వివరాలు

జననం (1972-05-13) 1972 మే 13 (వయసు 52)
రోహ్తక్ , హర్యానా , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2024 వరకు)
తల్లిదండ్రులు బీరేందర్ సింగ్, ప్రేమలతా సింగ్

బ్రిజేంద్ర సింగ్ (జననం 13 మే 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హిసార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన మాజీ కేంద్ర ఉక్కు మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు.[1]

వృత్తి జీవితం

[మార్చు]

బ్రిజేంద్ర సింగ్ 1998 బ్యాచ్‌లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ 9ని సాధించి హర్యానాలో 21 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బ్రిజేంద్ర సింగ్ తన తండ్రి బీరేందర్ సింగ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హిసార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి దుష్యంత్ చౌతాలాపై 3,14,068 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 నుండి 2024 వరకు పార్లమెంట్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రక్షణ స్టాండింగ్ కమిటీ, జీవ వైవిధ్యం (సవరణ) బిల్లు, 2021పై జాయింట్ కమిటీ & పిటిషన్‌ల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

బ్రిజేంద్ర సింగ్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 మార్చి 2024న బలవంతపు రాజకీయ కారణాల వల్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2][3] బ్రిజేంద్ర సింగ్‌ 2024 శాసనసభ ఎన్నికలలో ఉచన కలాన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి దేవేందర్ అత్రి చేతిలో 32 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (11 March 2024). "Haryana BJP MP Brijendra Singh Joins Congress, Citing Farm Stir and Wrestlers' Protest". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. The Wire (11 March 2024). "Why Jat Leader Brijendra Singh Quit BJP to Join Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  3. The Hindu (28 April 2024). "Denied ticket by Cong., ex-Hisar MP Brijendra Singh holds 'internal politics' responsible" (in Indian English). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  4. India Today (8 October 2024). "BJP's Devender Chatar makes photo finish in Haryana's Uchana Kalan, wins by 32 votes" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.