బీరేందర్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీరేందర్ సింగ్
బీరేందర్ సింగ్


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2 ఆగష్టు 2016 – 20 జనవరి 2020
నియోజకవర్గం హర్యానా
పదవీ కాలం
29 నవంబర్ 2014 – 1 ఆగష్టు 2016
నియోజకవర్గం హర్యానా
పదవీ కాలం
2 ఆగష్టు 2010 – 28 ఆగష్టు 2014
నియోజకవర్గం హర్యానా

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి
పదవీ కాలం
5 జులై 2016 – 14 ఏప్రిల్ 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నరేంద్ర సింగ్ తోమార్
తరువాత ధర్మేంద్ర ప్రధాన్

పదవీ కాలం
9 నవంబర్ 2014 – 5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు నితిన్ గడ్కరీ
తరువాత నరేంద్ర సింగ్ తోమార్

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నితిన్ గడ్కరీ
తరువాత నరేంద్ర సింగ్ తోమార్

మంచినీటి శాఖ & పారిశుధ్యం శాఖ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నితిన్ గడ్కరీ
తరువాత రమేష్ జిగజినాగి, నరేంద్ర సింగ్ తోమార్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1984 – 1989
ముందు మణి రామ్ బాగ్రి
తరువాత జై ప్రకాష్
నియోజకవర్గం హిసార్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-03-25) 1946 మార్చి 25 (వయసు 78)
రోహతక్, పంజాబ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ (1972–2014) (2024[1]– )
ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ (2014–2024)
జీవిత భాగస్వామి ప్రేమ్‌లతా సింగ్
సంతానం బ్రిజేంద్ర సింగ్, సహా 2

సిహెచ్. బీరేందర్ సింగ్ (జననం 25 మార్చి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2016 వరకు నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పారిశుధ్యం & త్రాగునీటి మంత్రిగా, 2016 నుండి 2019 వరకు కేంద్ర ఉక్కు మంత్రిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

బీరేందర్ సింగ్ ఉచానా శాసనసభ నియోజకవర్గం నుండి (1977–82, 1982–84, 1991–96, 1996–2000, 2005–09) ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయన హర్యానాలో ప్రభుత్వంలో 1982 నుండి 1984 వరకు సహకార & పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా, 1991 నుండి 1992 వరకు రెవెన్యూ & ప్రణాళిక శాఖ మంత్రిగా, 2005 నుండి 2009 వరకు ఆర్థిక, కార్మిక & ఉపాధి శాఖ మంత్రిగా, 2007 నుండి 2009 వరకు ఎక్సైజ్ & పన్నుల శాఖ మంత్రిగా పని చేశాడు.

బీరేందర్ సింగ్ 1984లో హిసార్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంటు అంచనాల కమిటీ (1984-86), కాన్సులేటివ్ కమిటీ ఆన్ డిఫెన్స్ (1986-88), కన్సల్టేటివ్ కమిటీ ఆన్ పవర్ (1988-89)లో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన 2010లో హర్యానా కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై సెప్టెంబర్ 2013 నుండి ఏప్రిల్ 2014 వరకు మానవ వనరులు, మహిళలు & శిశు అభివృద్ధి, యువజన & క్రీడల మంత్రిత్వ శాఖపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు.

బీరేందర్ సింగ్ 28 ఆగస్టు 2014న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 29 ఆగస్టు 2014న భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత తిరిగి రాజ్యసభకు ఎన్నికై నవంబర్ 2014లో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, త్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు. ఆయన జూలై 2016లో మూడవసారి రాజ్యసభకు తిరిగి ఎన్నికై నరేంద్ర మోడీ రెండవ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉక్కు శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (9 April 2024). "Ex-Minister Chaudhary Birender Singh returns to Congress after 10 years with BJP" (in Indian English). Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. "Haryana abuzz after Birender Singh's name dropped from Union Cabinet | Chandigarh News". The Times of India. Archived from the original on 2013-06-30.