బ్రిజ్‌లాల్ నెహ్రూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిజ్‌లాల్ నెహ్రూ (1884 మే 5 - 1964 మే 27) ప్రముఖ పౌర సేవకుడు, నెహ్రూ కుటుంబ సభ్యుడు.

మోతీలాల్ నెహ్రూ అన్నయ్య పండిట్ నందలాల్ నెహ్రూకు బ్రిజ్‌లాల్ నెహ్రూ కుమారుడు. నందలాల్ నెహ్రూ 11 సంవత్సరాలు ఖేత్రి రాష్ట్రానికి దివాన్ గా ఉన్నాడు.[1]

బ్రిజ్‌లాల్ 1884 మే 5న అలహాబాద్ లో జన్మించాడు, ఆయన ఆనంద్ భవన్ లో పెరిగాడు.[2] 1905లో మోతీలాల్ నెహ్రూ చేత భారత పౌర సేవ కోసం పోటీ చేయడానికి బ్రిజ్‌లాల్ ను ఆక్స్ఫర్డ్ పంపాడు.[3] ఆయన ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ లో సీనియర్ అధికారిగా పనిచేసాడు. పదవీ విరమణ తరువాత, మహారాజా హరి సింగ్ పాలనలో జమ్మూ కాశ్మీర్ సంస్థాన ఆర్థిక మంత్రిగా పనిచేసాడు.[1]

అతను ప్రముఖ సామాజిక మహిళా కార్యకర్త, స్వాతంత్ర సమరయోధురాలు అయిన రామేశ్వరి రైనాను వివాహం చేసుకున్నాడు. ఆమె 1955లో పద్మభూషణ్ గ్రహీత, 1961 లో లెనిన్ శాంతి బహుమతి కూడా అందుకుంది.[4][5]

వారి కుమారుడు బ్రజ్ కుమార్ నెహ్రూ (1909-2001), ఒక నిర్వాహకుడు, పద్మ విభూషణ్ గ్రహీత.[6]

బ్రిజ్‌లాల్ 1964 మే 27న మరణించాడు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Prominent Kashmiris". The Kashmir Education Culture & Science. Archived from the original on 13 June 2012. Retrieved 18 March 2014.
  2. Brijlal, Sonia (2004). Two Alone, Two Together: Letters Between Indira Gandhi and Jawaharlal Nehru. p. xxii. ISBN 9780143032458.
  3. Mukherjee, Sumita (2009). Nationalism, Education and Migrant Identities: The England-returned By Sumita Mukherjee. p. 41. ISBN 9781135271138.
  4. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 15 October 2015.
  5. Vijay Prashad, The Darker Nations: A People's History of the Third World, 53.
  6. "Governors of Gujarat: details of the life sketch of B.K. Nehru". Rajbhavan (Govt of India). Archived from the original on 10 December 2018. Retrieved 18 March 2014.
  7. Brij Lal Nehru (c.1884 - 1964)