బ్రిజ్ కృష్ణ చాందీవాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిజ్ కృష్ణ చాందీవాలా ఢిల్లీకి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. మహాత్మా గాంధీకి రాజకీయ సహచరుడు. సామాజిక పని రంగంలో ఆయన చేసిన కృషికి గాను 1963 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

బ్రిజ్ కృష్ణ 1900 లో బనార్సీదాస్ చాందీవాలా, జానకీ దేవి లకు ఆరవ సంతానంగా జన్మించాడు. [1] చాందీవాలాలు ఢిల్లీలోని చాందినీ చౌక్ లో వెండి వర్తకం చేసేవారు. అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే 1918 లో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌కె రుద్రకు అతిథిగా వచ్చిన గాంధీని కలిశాడు. [2]

గాంధీ సహచరుడు

[మార్చు]

గాంధీతో ఆయన సమావేశం చాందీవాలాను బాగా ప్రభావితం చేసింది. అతను గాంధీకి అనుచరుడు, సన్నిహితుడూ అయ్యాడు. చాందీవాలా గాంధీ ప్రభావంతో నిరాడంబరమైన భోజనం అలవాటు చేసుకున్నాడు, ఖద్దరు ధరించాడు. అలాగే, గాంధీ ఢిల్లీలో ఉన్నప్పుడు అతనికి మేక పాలు సరఫరా చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఈ విషయంలో ఆయనకున్న శ్రద్ధను చూసి డాక్టర్ ఎంఏ అన్సారీ, అతన్ని గ్వాలీన్ (పాలవాడు) అని పిలిచేవాడు. [3]

1930 వ దశకంలో, చాందీవాలా ఢిల్లీలోని రాళ్ళు పగలగొట్టే కార్మికులను ఒక యూనియన్‌గా సంఘటితం చేసాడు. వారి పనికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలకు సరిగ్గా అమలు చేసేందుకు, వారికి సరైన వేతనం లభించేందుకూ ఢిల్లీ పాలకులతో, న్యాయస్థానాలలోనూ వారి హక్కుల ఉల్లంఘన కేసులను చేపట్టాడు. ఉల్లేఖన లోపం: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు ఢిల్లీలో ఉన్నప్పుడు, గాంధీ చాందీవాలా ఇంట్లోనే ఉండేవాడు. 1924 లో మత సామరస్యం కోసం గాంధీ 21 రోజుల ఉపవాసాన్ని అక్కడే చేపట్టాడు. గాంధీని హత్య చేసిన రోజున చాందీవాలా అతని తీనే ఉన్నాడు. అతడే గాంధీ మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేశాడు. ఉల్లేఖన లోపం: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు ఉల్లేఖన లోపం: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు

సామాజిక సేవ

[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత, చాందీవాలా సామాజిక సేవను చేపట్టాడు. భారత సేవక్ సమాజ్, సదాచార్ సమితి సంస్థలకు అతడు వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడూను. 1952 లో అతను శ్రీ బనార్సీదాస్ చాందీవాలా సేవా స్మారక్ ట్రస్ట్ సొసైటీని స్థాపించాడు, దీనికి మొదట్లో గాంధీ కుమారుడు దేవదాస్ నాయకత్వం వహించాడు. ఈ ట్రస్టు ఢిల్లీలో జానకీ దేవి కాలేజ్ ఫర్ ఉమెన్ సహా అనేక ఆసుపత్రులు, విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. దీనికి అతని తల్లి గౌరవార్థం ఆమె పేరు పెట్టాడు. [4] [5] [6] చాందీవాలా చేసిన సామాజిక కృషికి గాను 1963 లో అతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. [2]

పుస్తకాలు

[మార్చు]

చాందీవాలా హిందీలో బాపు కే చరణోం మే అనే మూడు సంపుటాల పుస్తకాన్ని రచించాడు. ఇది ఆంగ్లంలోకి ఎట్ ది ఫీట్ ఆఫ్ బాపుగా అనువాదమైంది. [2] [7] అతని ఇతర ముఖ్యమైన రచన గాంధీజీ కి ఢిల్లీ డైరీ. ఇది ఢిల్లీలో గాంధీ గడిపిన రోజులను వివరిస్తుంది. [8]

మూలాలు

[మార్చు]
  1. 'Family History of Chandiwala Family', Manuscript in Nehru Memorial Museum and Library, Individual Collections, B.K. Chandiwala, Instalment II-III Subject Files, F no. 6
  2. 2.0 2.1 2.2 "The league of quiet, extraordinary gentlemen". The Hindu. 11 January 2013. Retrieved 13 January 2013.[dead link]
  3. "Gandhiji and Delhi". Gandhi Research Foundation. Retrieved 13 January 2013.
  4. "Janki Devi Memorial College - About Us". Archived from the original on 2 October 2013. Retrieved 13 January 2013.
  5. "Shri Banarsidas Chandiwala Sewa Smarak Trust Society - About Us". Retrieved 13 January 2013.
  6. BCIP Today - August 2010 (PDF). Banarsidas Chandiwala Institute of Physiotherapy. 2010. p. 2. Archived from the original (PDF) on 2011-03-04.
  7. Carter, April (1995). Mahatma Gandhi: A Selected Bibliography. Greenwood Press. p. 74. ISBN 9780313282966.
  8. "The Last Hours Of Mahatma Gandhi". Gandhi Research Foundation. Archived from the original on 31 మే 2013. Retrieved 13 January 2013.