బ్రో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రో
దర్శకత్వంకార్తిక్ తుపురాని
రచనసచిన్ కుందాల్కర్
నిర్మాతగ్రంధి రవిచంద్
తారాగణంనవీన్ చంద్ర
అవికాగోర్
సాయి రోనక్‌
సంజన సారథి
ఛాయాగ్రహణంఅజీమ్ మహమ్మద్
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
జేజేఆర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
26 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

బ్రో 2021లో విడుదలైన తెలుగు సినిమా. జేజేఆర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై గ్రంధి రవిచంద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ తుపురాని దర్శకత్వం వహించాడు.[1] నవీన్ చంద్ర, అవికాగోర్, సాయి రోనక్‌, సంజన సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన ఆగష్టు 8న విడుదల చేసింది.[2] మరాఠీ సినిమా ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌గా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 26న సోని లివ్ ఓటీటీలో విడుదలైంది.

మాధవ్ ( నవీన్ చంద్ర ), సుబ్బు ( అవికా గోర్ ) ఇద్ద‌రూ అన్నాచెల్లెలు. సుబ్బు అనారోగ్యంతో బాధ పడుతుంది. త‌న చెల్లెలు ఆరోగ్యం కొసం కావ‌ల్సిన డబ్బు కొసం దుబాయ్ వెళ్ళి అక్క‌డే పని చేస్తూ వుంటూ త‌న కుటుంబాన్ని డబ్బుల్ని పంపిస్తాడు. మాధవ్ సౌదీ వెళ్ళి పని చేసే సమయంలోనే సుబ్బు చనిపోతుంది. ఈ విష‌యం తెలిసి మాధ‌వ్ కు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో అతడు ఏం చేశాడు.? మాధవ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? చివరికి ఏం జరిగింది ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • అన్నయ్య , రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం.సునీత ఉపద్రష్ట
  • ఊహలో, రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం. షణ్ముఖ భరద్వాజ్ , హ్రితిక ఆనంది
  • ఆనందం, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. యాజి న్ నిజార్, విష్ణు ప్రియా రవి
  • ఓ మై డియర్ బ్రదర్ , రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం నూతన మోహన్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: జేజేఆర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • సమర్పణ: మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్
  • నిర్మాత: గ్రంధి రవిచంద్
  • కథ: సచిన్ కుందాల్కర్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తిక్ తుపురాని
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • పాటలు: భాస్కరభట్ల‌
  • సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్
  • ఎడిటింగ్: విప్లవ్ నైషధం
  • లైన్ ప్రొడ్యూసర్: కేదరిసిపల్లి శ్రీను
  • ఆర్ట్ డైరెక్టర్: ఏ.యస్. ప్రకాష్
  • కోరియోగ్రఫీ – భాను మాస్టర్, అనీష్ మాస్టర్, పృథ్వీ మాస్టర్
  • ఫైట్స్: రియల్ సతీష్
  • ప్రొడక్షన్ ఎక్స్‌క్యూటివ్ – సుబ్రమణ్యం ధీతి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (15 November 2021). "నవ్విస్తూ.. కంటతడి పెట్టించే 'బ్రో'". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. The Hans India (11 August 2021). "'#Bro' movie first look launched" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  3. TV9 Telugu (27 November 2021). "ఆకట్టుకుంటున్న బ్రో మూవీ.. నవీన్ చంద్ర ఖాతాలో హిట్ పడ్డట్టేనా." Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (21 November 2021). "నేను ఉన్నంత వరకూ నువ్వు ఎప్పటికీ ఒంటరి కాదు: అవికాగోర్‌ - telugu news bro trailer out now". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రో&oldid=4203296" నుండి వెలికితీశారు