Jump to content

సంజన సారథి

వికీపీడియా నుండి
సంజన సారథి
జననం (1993-07-25) 1993 జూలై 25 (వయసు 31)
వృత్తినటి, మోడల్, పారిశ్రామికవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చటర్‌ఫాక్స్, తుపాకీ, వాలు

సంజన సారథి (జననం 1993 జూలై 25) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పని చేస్తుంది. 2012 తమిళ చిత్రం తుపాకీలో విజయ్ పోషించిన జగదీష్ పాత్రకు సోదరిగా ఆమె బాగా పేరు తెచ్చుకుంది.

ఆమె సింథాల్, అమెజాన్ ఫైర్‌స్టిక్, 7అప్, పిజ్జా హట్, ఎవిటి టీ, 7అప్ మద్రాస్ గిగ్, ఏస్2త్రీ వంటి అనేక బ్రాండ్‌లకు మోడలింగ్ చేసింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

సంజన 1993 జూలై 25న విజయ్ సారథి, రాజీ విజయ్ సారథి దంపతులకు జన్మించింది. ఆమె చెన్నైలోని సెయింట్ మైఖేల్ అకాడమీలో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో బి.ఎస్సీలో పట్టభద్రురాలైంది. అన్నా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎం.ఎస్సీ. చదువు ముగించుకుని హాంకాంగ్‌లోని న్యూస్ మీడియా కంపెనీలో పని చేయడం ప్రారంభించింది.

కెరీర్

[మార్చు]

బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వజక్కు ఎన్ 18/9 ద్వారా సంజన తన నటనా రంగ ప్రవేశం చేసినప్పటికీ, విజయ్ హీరోగా వచ్చిన తుపాకీ ద్వారా ఆమె పాపులర్ అయ్యింది. ఆమె మ్యూజికల్ వీడియో, 7అప్ మద్రాస్ గిగ్స్ సీజన్ 2 – అవిజాయి వంటి కమర్షియల్ లలో చేసింది. 2019 జీ5 వెబ్ సిరీస్ ఫింగర్‌టిప్‌లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.[2][3]

సంజన నినైవో ఒరు పరవైలో మహిళా ప్రధాన పాత్రలో చేసింది, ఇందులో జంప్ కట్స్ - హరి భాస్కర్ ప్రధాన పాత్ర పోషించారు.[4][5]

ఆమె చటర్‌ఫాక్స్ పేరుతో తన స్వంత డిజైనర్ లేబుల్‌ని నడుపుతున్న స్టైలిస్ట్ కూడా.[6] యువన్ శంకర్ రాజా 2019 అమెరికా పర్యటనలో కూడా ఆమె ప్రదర్శన ఇచ్చింది.[7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2012 వజక్కు ఎన్ 18/9 శ్వేత (ఆర్తి స్కూల్‌మేట్)
2012 తుపాకీ జగదీష్ చెల్లెలు
2013 ఎండ్రెండ్రుం పున్నాగై ప్రియ సోదరి తెలుగులో చిరునవ్వుల చిరుజల్లుగా విడుదలైంది.[8]
2015 వాలు శక్తి సోదరి
2019 ఎనై నోకి పాయుమ్ తోట సంజన తెలుగులో తూటాగా డబ్బింగ్ చేయబడింది.[9]
2021 #బ్రో రాధ తెలుగు సినిమా[10]
2023 వరిసు విజయ్ స్నేహితురాలు తెలుగులో వారసుడుగా వచ్చింది.[11]
TBA నినైవో ఒరు పరవై

మూలాలు

[మార్చు]
  1. Jagannathan, Sahithya (2018-05-12). "No Filter: This mother-daughter duo makes everyone feel really jealous". dtNext.in (in ఇంగ్లీష్). Archived from the original on 2 December 2020. Retrieved 2020-02-09.
  2. Balu, Aparajitha (2019-09-10). "Fingertip Review: Welcome Change In The Tamil Television Landscape". Silverscreen.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-26.
  3. "Serial Chiller: Zee5's Fingertip is a highly relatable, acutely watchable series about modern Tamil lives". Firstpost (in ఇంగ్లీష్). 2019-09-03. Retrieved 2020-02-26.
  4. "YouTuber Hari Bhaskar makes his film debut". The New Indian Express. Retrieved 2020-02-09.
  5. "YouTuber Jump Cuts Hari Bhaskar makes his film debut". Cinema Express. Retrieved 2020-02-09.
  6. "Get your summer swagger on with this 24-year-old Chennai stylist's new collection". www.indulgexpress.com. Retrieved 2020-02-09.
  7. "Vijay Sethupathi to be part of Yuvan's US music tour - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-02-26.
  8. The Times of India (2014). "Chirunavvula Chirujallu Movie: Showtimes". Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
  9. 10TV (1 January 2020). "'తూటా' మూవీ రివ్యూ" (in telugu). Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  10. "BRO Review: A poignant tale of a grieving brother". timesofindia.indiatimes.com. Archived from the original on 2021-11-25.
  11. Hindustantimes Telugu (9 January 2023). "వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ - చిరు బాల‌య్య‌ సినిమాల‌ త‌ర్వాతే వార‌సుడు - దిల్‌రాజు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.