Jump to content

అన్నా యూనివర్సిటీ

వికీపీడియా నుండి
అన్నా యూనివర్సిటీ
ఇతర పేర్లు
ఎయూ
ఆంగ్లంలో నినాదం
ప్రోగ్రెస్ త్రూ నాలెడ్జ్
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయం
స్థాపితం1978; 46 సంవత్సరాల క్రితం (1978)
వ్యవస్థాపకుడుఎం.జి.రామచంద్రన్
ఛాన్సలర్తమిళనాడు గవర్నర్
వైస్ ఛాన్సలర్ఆర్. వేల్‌రాజ్[1]
డీన్ఎల్. సుగంటి (CEG)
ఆర్. జయవేల్ (ACT)
జె. ప్రకాష్ (MIT)
సీతాలక్ష్మి(SAP)
రిజిస్ట్రార్రాణీ మరియా లియోనీ వేదముత్తు
విద్యార్థులు18,372[2]
అండర్ గ్రాడ్యుయేట్లు11,049[2]
పోస్టు గ్రాడ్యుయేట్లు4,455[2]
డాక్టరేట్ విద్యార్థులు
2,828[2]
స్థానంచెన్నై, తమిళనాడు, 600025, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంతం, 185 ఎకరాలు
అనుబంధాలుUGC, AICTE, AIU, ACU
జాలగూడుwww.annauniv.edu

అన్నా విశ్వవిద్యాలయం భారతదేశంలోని తమిళనాడులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ప్రధాన క్యాంపస్ చెన్నైలో ఉంది. ఇది 1978 సెప్టెంబరు 4న స్థాపించబడింది. తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సి. ఎన్. అన్నాదురై పేరు పెట్టారు.[3]

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) విడుదల చేసిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024 జాబితాలో అన్నా యూనివర్సిటీ టాప్-600లో స్థానం దక్కించుకుంది.[4] 2023లో ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్తో పాటు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్-1000లో నమోదు చేసుకుంది.

కోర్సులు

[మార్చు]

విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాలల ద్వారా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కోర్సులను అందిస్తుంది. ప్రతి సంవత్సరం మే-జూన్‌, నవంబరు-డిసెంబరులలో రెండుసార్లు సెమిస్టర్‌ల పరీక్షలను నిర్వహిస్తూ ఈ విశ్వవిద్యాలయం డ్యూయల్ సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తుంది.

ప్రవేశాలు

[మార్చు]

తమిళనాడు ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్ష (TNPCEE) - 2006 వరకు రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రాతిపదికగా ఉండేది.[5] అయితే 2007-08 విద్యా సంవత్సరం నుండి, విద్యార్థుల హయ్యర్ సెకండరీ మార్కుల ఆధారంగా ప్రవేశం కలిపిస్తున్నారు.[6] ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ TANCET, GATE స్కోర్‌ల ద్వారా నిర్వహించబడుతుంది.[7]

అనుబంధ కళాశాలలు

[మార్చు]

అన్నా యూనివర్సిటీ క్యాంపస్ చెన్నైలో ఉంది. విశ్వవిద్యాలయం కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, మధురై, తిరునెల్వేలిలలో సాటిలైట్ క్యాంపస్‌లను కలిగి ఉంది. ఈ విశ్వవిద్యాలయం చెన్నై ప్రాంతంలోని విల్లుపురం, తిండివనం, అరణి, కాంచీపురం, కోయంబత్తూరు ప్రాంతంలోని ఈరోడ్, బర్గూర్, తిరుచిరాపల్లి ప్రాంతంలోని పన్రుతి, పట్టుక్కోట్టై, తిరుక్కువలై, అరియలూర్, మధురై ప్రాంతంలోని రామనాథపురం, దిండిగల్, తిరునల్వేలి ప్రాంతంలో నాగర్‌కోయిల్, తూత్తుకుడిలో ఇంజనీరింగ్ కళాశాలలను నిర్వహిస్తోంది.

పూర్వ విద్యార్థులు

[మార్చు]
అయ్యలసోమయాజుల లలిత, భారతదేశం నుండి మొదటి మహిళా ఇంజనీర్[8]
ఎ. సి. ముత్తయ్య, భారత పారిశ్రామికవేత్త, మాజీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్[9]
అక్కినేని నాగార్జున, తెలుగు సినిమా నటుడు[10]
అనుమోలు రామకృష్ణ, లార్సెన్ & టూబ్రో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్[11]
క్రేజీ మోహన్, తమిళ హాస్య నటుడు, స్క్రిప్ట్ రైటర్, నాటక రచయిత[10][12]
కవితాలయ కృష్ణన్, భారతీయ సినిమా, టెలివిజన్ నటుడు[13]
ధీరజ్ రాజారామ్, మ్యు సిగ్మా (Mu Sigma Inc) వ్యవస్థాపకుడు, ఛైర్మన్[14][15]
గోపాలస్వామి పార్థసారథి, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, మయన్మార్‌లకు మాజీ భారతీయ హైకమీషనర్, జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ ఛాన్సలర్[16][17]
కానూరి లక్ష్మణరావు, భారతదేశ నీటి నిర్వహణ రూపశిల్పి, మాజీ కేంద్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత[10]
కృష్ణకుమార్ నటరాజన్, మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్[9]
కృష్ణమాచారి శ్రీకాంత్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్, మాజీ ఛైర్మన్, భారత క్రికెట్ జట్టు జాతీయ ఎంపిక కమిటీ[10]
కుట్రలీశ్వరన్, స్విమ్మర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్[18]
మదన్ కార్కి, తమిళ చిత్ర గీత రచయిత[18]
మెండు రామ్మోహన్ రావు, మాజీ డీన్ ఎమెరిటస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్[19]
మునిరత్న ఆనందకృష్ణన్, మాజీ ఛైర్మన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్, మాజీ వైస్-ఛాన్సలర్, అన్నా యూనివర్సిటీ
ఎన్. మహాలింగం, వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్, శక్తి గ్రూప్; మాజీ ఛైర్మన్, ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్, చెన్నై[18][20]
పి. ఎస్. వీరరాఘవన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్[10]
ఆర్. కె. బలిగా, బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ డెవలపర్[10]
పి. వి. నందిధా, భారత చెస్ క్రీడాకారిణి, భారతదేశపు 17వ మహిళా గ్రాండ్‌మాస్టర్[21]
పొన్నంబలం కుమారస్వామి, ఇంజనీర్, గణిత శాస్త్రజ్ఞుడు, హైడ్రాలజిస్ట్[22]
దబ్బాల రాజగోపాల్ రెడ్డి, ట్యూరింగ్ అవార్డు గ్రహీత, కార్నెగీ-మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత[10]
రాజ్‌కుమార్ భారతి, శాస్త్రీయ గాయకుడు, సంగీత స్వరకర్త[23]
రంగస్వామి నరసింహన్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ కాలిక్యులేటర్ (TIFRAC)ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త,

మొదటి స్వదేశీ భారతీయ కంప్యూటర్, పద్మశ్రీ పురస్కార గ్రహిత[24]

రవి రుయా, ఎస్సార్ గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ అండ్ సహావ్యవస్థాపకుడు[10]
ఎస్. సోమశేఖర్, మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మైక్రోసాఫ్ట్[25]
శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్, మాజీ క్రికెట్ కెప్టెన్, ఐసిసి ఎలైట్ అంపైర్స్ ప్యానెల్ సభ్యుడు[26]
ఉపేంద్ర జె. చివుకుల, న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ మాజీ సభ్యుడు[27][28]
వి. ఎం. మురళీధరన్, చైర్మన్, ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్[29]
వి. ఎస్. మహాలింగం, DRDO శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ డైరెక్టర్[30]
వేణు శ్రీనివాసన్, సుందరం - క్లేటన్ లిమిటెడ్, టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్[9]
వర్గీస్ కురియన్, ఆపరేషన్ ఫ్లడ్ ఆర్కిటెక్ట్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహిత[10]
ఎం. మదన్ బాబు FRSC, సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ డైరెక్టర్[31]
సుందరం కరివర్ధన్, పారిశ్రామికవేత్త, మోటార్‌స్పోర్ట్ మార్గదర్శకుడు[32]
ఎ. జి. రామకృష్ణన్, ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్[33]
మహేష్ ముత్తుస్వామి, భారతీయ సినిమాటోగ్రాఫర్ [34]

మూలాలు

[మార్చు]
  1. Sujatha, R (11 April 2021). "Anna University V-C Surappa's term ends". The Hindu. Tamil Nadu. Retrieved 11 April 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "University Student Enrollment Details". www.ugc.ac.in. Retrieved 10 February 2020.
  3. "The Anna university Chennai Act 1978" (PDF).
  4. "World University Rankings 2024 | Times Higher Education (THE)". web.archive.org. 2023-09-28. Archived from the original on 2023-09-28. Retrieved 2023-09-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Common Entrance Test abolished in Tamil Nadu". The Hindu. 7 December 2006. Archived from the original on 7 December 2006.
  6. "Should Common Entrance Test be scrapped?". The Hindu. 21 August 2006. Archived from the original on 20 February 2008.
  7. "Admission for PG in CEG".
  8. Archive, The Telugu (2019-07-24). "India's first female engineer: Lalitha Ayyalasomayajula". Medium. Archived from the original on 2019-09-21. Retrieved 2019-09-21.
  9. 9.0 9.1 9.2 Aruna Natarajan (30 August 2018). "Why alumni of Chennai's College of Engineering, Guindy are a worried lot today". Citizen Matters.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 10.8 Vidya Raja (31 July 2018). "India's Oldest Engineering College Turns 225: 6 Alumni Who Have Made Guindy Proud!". The Better India.
  11. PM News Bureau (2 January 2014). "Dr. A. Ramakrishna, doyen of Indian Construction Industry". Project Monitor.
  12. "Comedy cocktails his forte". The Hindu. 20 December 2008.
  13. "'Crazy' Mohan is no more". Times of India. 11 June 2019.
  14. Jayadevan PK (5 December 2016). "Mu Sigma's chairman Dhiraj Rajaram re-emerges as controlling shareholder". Factor Daily. Archived from the original on 8 జూన్ 2023. Retrieved 28 సెప్టెంబరు 2023.
  15. Sneha Shah (12 July 2017). "Mu Sigma's chairman Dhiraj Rajaram re-emerges as controlling shareholder". The Economic Times.
  16. WSJ (2018). "Executive Profile". The Wall Street Journal.
  17. Admin (2018). "Executive Profile". Bloomberg.
  18. 18.0 18.1 18.2 "Popular faces and famous alumni of Anna University". Aapka Times. 28 October 2017. Archived from the original on 28 సెప్టెంబరు 2023. Retrieved 28 సెప్టెంబరు 2023.
  19. "Faculty Profile". Institute of Management Technology Hyderabad.[permanent dead link]
  20. "Veteran industrialist Pollachi Mahalingam passes away". The Hindu. 2 October 2014.
  21. "TN Chief Minister honours Chess champion Nandhidhaa". www.dtnext.in. 2017-08-01. Archived from the original on 28 November 2020. Retrieved 2020-11-20.
  22. http://www.ias.ac.in/describe/fellow/Kumaraswamy,__Ponnambalam list of Fellows of the Indian Academy of Sciences
  23. Asha Krishnakumar (27 June 2018), Sound of Silence: Rajkumar Bharathi's Musical Quest, Notions Press, ISBN 978-1-64324-568-3
  24. Srinivasan Ramani (May 2008). "Rangaswamy Narasimhan: Doyen of Computer Science and Technology". Indian Institute of Information Technology, Bangalore.
  25. "Breathing easy in the fast lane". Live Mint. 19 April 2008.
  26. Vaibhav Joshi (6 January 2019). "Engineer's XI: An XI featuring cricketers who hold an engineering degree". Yahoo.
  27. admin (2011). "Candidate Profile". The Wall Street Journal. Archived from the original on 6 May 2019. Retrieved 6 May 2019.
  28. G Venkataramana Rao (8 November 2011). "Telugu man in the race for New Jersey Assembly". The Hindu.
  29. Sai Srravya, Aishwarya Valliappan (September 2009). "A Testimony for Empowerment through Education – V. M. Muralidharan". Guindy Times.
  30. Director, Defence Scientific Information & Documentation Centre (September 2009). "Promotion Announcement in the Monthly Newsletter of DRDO" (PDF). Defence Research & Development Organization.
  31. "2018 ISCB Innovator Award: M. Madan Babu". www.iscb.org. Retrieved 2023-01-13.
  32. "Outstanding Alumni Award" (PDF).[permanent dead link]
  33. "Distinguished Alumni". Electronics & Communication Engineering, PSG College of Technology. Archived from the original on 24 September 2015. Retrieved 31 August 2014.
  34. "Mr.G.Parthasarathy's profile as a faculty of Centre for Policy Research". cprindia.org. Retrieved 9 August 2012.