భక్త ప్రహ్లాద (నాటకం)

వికీపీడియా నుండి
(భక్తప్రహ్లాద (నాటకం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ఈ నాటకాన్ని, సురభి బాబ్జీ దర్శకత్వం వహించారు.

శాపగ్రస్తులైన జయవిజయులు భూలోకంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. దానవులైన వీరు యజ్ఞ వాటికలను ధ్వంసం చేస్తూ దేవతలను హింసిస్తారు. శ్రీ మహావిష్ణువు వరాహావతారమున హిరణ్యాక్షుని వధిస్తాడు. తమ్ముని మృతితో కోపించిన హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఘర తపస్సు చేసి మెప్పిస్తాడు. ఆయన ద్వారా వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించి, వారిని బాధిస్తాడు. విద్యనభ్యసించడం, హరినామస్మరణ మానని తనయుడు ప్రహ్లాదుని అనేక విధాల చిత్రహింసలకు గురి చేయడం, చివరకు శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి ఉగ్రనరసింహరూపాన ప్రత్యక్షమై హిరణ్యకశిపుని వధించడంతో కథ ముగుస్తుంది.