భద్రిరాజు పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రిరాజు పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
భద్రిరాజు పాలెం is located in Andhra Pradesh
భద్రిరాజు పాలెం
భద్రిరాజు పాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′55″N 80°47′42″E / 16.331862°N 80.794865°E / 16.331862; 80.794865
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521163
ఎస్.టి.డి కోడ్ 08676

భద్రిరాజు పాలెం, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 163., ఎస్.టి.డి.కోడ్ = 08676 .

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

ఈ ఊరు కృష్ణానది పక్కన ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

దేవరపల్లి 3 కి.మీ, కనకవల్లి 4 కి.మీ, పెనమకూరు 4 కి.మీ, కుమ్మమూరు, అమీనపురం 6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 31 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, దేవరపల్లి, పెనమకూరు

గ్రామంలోని మౌలిక వసతులు[మార్చు]

నీటిశుద్ధికేంద్రం[మార్చు]

ఈ కేంద్ర నిర్మాణానికి గ్రామ పంచాయతీ 3 సెంట్ల స్థలాన్ని ఏర్పాటుచేసారు. హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రా స్ట్రక్చర్స లిమిటెడ్ (M.E.I.L) అను సంస్థ వారి సహకారంతో, గ్రామానికి చెందిన దాత శ్రీ కొమ్మారెడ్డి బసివిరెడ్డి కుమారుడు శ్రీ కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతుల 15 లక్షల రూపాయల వితరణతో, ఈ కేంద్రాన్ని నిర్మించారు. శంకుస్థాపన చెసిన ఒక నెలరోజుల వ్యవధిలోనే యుద్ధప్రాతిపదికన ఈ నిర్మాణం పూర్తిచేయడం విశేషం. ప్రజల వద్ద ఏ మాత్రం రుసుము వసూలు చేయకుండనే ఈ కేంద్రం నుండి శుద్ధమైన రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. [3], [4]&[5]

అంగనవాడీ కేంద్రం[మార్చు]

ఈ కేంద్రం స్థానిక ఎస్.సి.వాడలో ఉంది.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వల్లూరు విమలమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ రాజభద్రేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ గంగానమ్మతల్లి ఆలయం:- 2014, నవంబరు-30, ఆదివారం నాడు, ఈ గ్రామంలో గంగానమ్మ, పోతురాజుల జాతరను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా జరుపుకున్నారు. వివిధప్రాంతాలలో ఉంటున్న గ్రామస్థులు, జాతరను పురస్కరించుకొనిగ్రామానికి తరలి రావడంతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్దలు, మహిళలు, పిన్నలు నూతన వస్త్రాలు ధరించి గంగానమ్మ తల్లికి మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం, గంగానమ్మకు మొక్కుబడులు సమర్పించుకొని అనంతరం, వరికోతలకు శ్రీకారం చుడతారు. [1]
  3. శ్రీ అంకమ్మ దేవర ఆలయం:- ఈ గ్రామములోని ఆళ్ళవారి అంకమ్మ దేవర సంబరాలు, 2015, జూన్-7వ తేదీ ఆదివారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆళ్ళ వారి వంశస్తులు ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. [2]
  4. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం భద్రిరాజుపాలెం గ్రామములో కృఇష్ణానది కరకట్టపై ఉన్నది.
  5. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2016, మే-12వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నసమారాధన వితరణ నిర్వహించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

చెరకు, పసుపు, అరటి, కంద. ఇవిగాక ప్రస్తుతం ఈ గ్రామ రైతులు ఇప్పుడు బంతిపూల సాగుపై మక్కువ చూపుచున్నారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-1; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, జూన్-8; 38వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, జూన్-18; 43వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూలై-2; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016, జనవరి-9; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మే-13; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మే-27; 2వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Bhadrirajupalem". Retrieved 18 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)