Jump to content

భరత్ అరుణ్

వికీపీడియా నుండి
భరత్ అరుణ్

1963, డిసెంబర్ 14ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించిన భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. బౌలింగ్ లో మీడియం పేసర్ గా, బ్యాటింగ్ లో క్రింది వరుసలో ఆడేవాడు. 1986-87 లో దులీప్ ట్రోఫి సెమీపైనల్స్ లో సౌత్ జోన్ తరపున ఆడుతూ 149 పరుగులు చేయడమే కాకుండా 7 వ వికెట్టుకు డబ్ల్యూ.వి.రామన్తో కలిసి 221 పరుగులు జోడించాడు [1]. అండర్-25 లో శ్రీలంక పై 107 (నాటౌట్) పరుగులు చేసి జాతీయజట్టులో స్థానం సంపాదించి తొలి టెస్ట్ శ్రీలంకపైనే ఆడినాడు. 1979లో రవిశాస్త్రి నేతృత్వంలో శ్రీలంక పర్యటించిన అండర్-19 భారత జట్టులో కూడా ఇతను సభ్యుడే.

భరత్ అరుణ్ భారత జట్టు తరపున 2 టెస్టులు ఆడి 4 వికెట్లు సాధించాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేక్షణ 76 పరుగులకు 3 వికెట్లు. ఇది శ్రీలంకపై తొలి టెస్టులో సాధించాడు. రంజీ ట్రోపీ లలో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. http://cricketarchive.com/Archive/Scorecards/47/47939.html